నిశీధితో తొలి పరిచయం…

“టిన్కు అన్న, ఎక్కడ సోమయాజి ? నాకు చాలా భయంగా ఉంది.”

“ఉండమ్మా వాడు ఇక్కడే ఉంటానన్నాడు,  కంగారూ పడొద్దు”

“కానీ అన్నయ్య, మా  వాళ్ళు వచ్చేస్తారేమో, నీకు తెల్సు కదా నా భయం.” అన్నది ధాత్రి.

“సరే అలా అయితే నువ్వు ఏదో బస్ పట్టుకొని అహ్మదాబాద్ లో ఉన్న మా అక్క వాళ్ళింటికి పో. నేను వాడ్ని తీసుకొని తర్వాత బస్ కి అక్కడకి వస్తాను.”

“మీరిద్దరు త్వరగా వచ్చేస్తారు కదా అన్నయ్యా”.??

“అదేగా చెప్పాను, అదిగో బస్ రానే వచ్చింది, వెళ్ళు”  ఆమె చేతిలో 5 వేలు పెట్టి హడావిడిగా బస్ ఎక్కించాడు టిన్కు

అయోమయంగా తన వారి బారి నించి తప్పించుకోటానికి  ధాత్రి బస్ ఎక్కేసింది.

బస్సు మలుపు తీరాగ్గానే  టిన్కు చుట్టూ నలుగురు కుర్రాళ్ళు మూగారు, “అరేయ్ వీడేంట్రా ఇలా చేశాడు. ఇప్పుడంటే ధాత్రి వెళ్ళిపోయింది, రేపు  నిజం తెల్సాక మనం మోసం చేశామనుకుంటుంది కదరా!!” అంటూ తలలు పట్టుకున్నారు.

“ఆమె సంగతి తర్వాత ముందు వాడి శవం ఇంటికి చేర్చే పని చూడండి.” తెల్లబోయిన మొఖం తో అన్నాడు సింగన్న.

“ఎలా రా?? వాడొక్కడే ఛస్తే ఏదో చెప్పి ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళం, కానీ పక్కన ఇంకో అమ్మాయితో సహా బావిలో దూకి చచ్చాడు కదా !!” అన్నాడు వేణు.

“అంటే వాడు చచ్చిపోతా అన్నది ధాత్రి కోసం కాదా!! త్రివేణి కోసమా? అలా ఎలా మనకి అర్థం కాలేదురా, వీడి ప్రేమ నిజమనుకొని పెళ్ళి పీటల మీదున్న ధాత్రిని  లాక్కొచ్చాము, ఇప్పుడు ఆ పిల్ల కి పెళ్ళి ఈ జన్మలో అవదు” అన్నాడు ఆ గుంపులో మరొకడు.

“అలా ఎలా నమ్మి లేచొచ్చిందిరా, పది నిమిషాల్లో, ఏం చేప్పావురా…?” అని ఆశ్చర్యంగా  చూశారు అంతా సింగన్న కేసి.

“నీ కోసం చస్తాడని చెప్పాను, అంతే, అసలే  ఇష్టం లేని పెళ్ళి, పైగా సినిమాలు బాగా చూసుద్ది, ఉన్న పళంగా లేచి వచ్చేసిందిరా” అంటూ బిక్క మొహం వేశాడు.

అందరూ ధాత్రి వెళ్తున్న బస్ కేసి చూస్తూ ఉండిపోయారు…భయంగా ..రేపన్న రోజు ఆమెకు సమాధానం చెప్పాల్సిన రోజు… అది ఎంతో దూరంలో లేదు.

*********************************************************************************

“నన్ను టిన్కు అన్న పంపాడు.”

“ఓహ్ నువ్వేనా ధాత్రి అంటే, రా లోపలికి ,వాడు అంతా చెప్పాడు.” అంటూ సాదరంగా ఆహ్వానించింది వినీలక్క.

“ఇంకా రాలేదా, నా కన్నా ముందే వస్తారేమో అనుకున్నఇంకో గంటలో ఇక్కడ ఉంటారా?”

“ముందు నువ్వు రిఫ్రెష్ అవ్వు, నేను నీకు చెప్తాను.”

“ఏంటి సోమయాజి రావట్లేదా….?” భయం గా అడిగింది ధాత్రి.

“అలా  ఏంకాదు, ఊరు ఊరు అంతా అట్టుడికి పోతోంది, అందుకే ఒక వారంలో వస్తా అన్నాడు, ఎవరికి అనుమానం లేకుండా…”

“ఒక్క వారం అంతేగా??”

“అవును ఒకే ఒక్క వారం, నీ తల రాత మారిపోతుంది”. అంటూ ఆమె నిట్టోర్చింది.

***************************************************************************

“వినీలక్క వినబడుతోందా..హల్లో నిన్నే, అది… జరిగింది, ఇప్పుడు మేము ఆ పి‌ల్లకి మొహం చూబించలేము. నువ్వే ఏదో చెప్పి ఇంటికి తిరిగి పంపు.”… అంటూ వేణు గాబరాగ ప్రాధేయ పడ్డాడు ఫోన్లోనే.

“వాడు నిజంగానే  చచ్చాడా లేక లేచివచ్చిందని చులకన చేస్తున్నాడా? మీ స్నేహితుడిని కాపాడ్డానికి మీరంతా నాటకాలు ఆడుతున్నారా?” వెనీళ్ళ అనుమానంగా అడిగింది.

“అయ్యో అక్క !! ఆ ‘మాలోకానికి’ అంత తెలివే లేదు, వాడు ఏదో ఒక పిల్లని చూబిస్తే మేముధాత్రిని చూసాము, మా ఖర్మకి వాడు కాస్త పిరికి వాడు , ఆ రెండో పిల్లతో సహ బావిలో దూకి చచ్చాడు. కావాలంటే  ఇంటెర్నెట్లో ఇవాల్టి పేపర్లో చూడు, వాడి చావు వార్తా మూడో పేజీలో వేశారు.”

“మరి ఇంక నేను దాచి పెట్టేది ఏముంది, ఆమెకి తెల్సి తీరుతుంది.”

“అందుకే పక్క రాష్ట్రంలో ఉన్న నీ దగ్గరకి పంపాను, పైగా వాడి గురించి ఆ పిల్లకి పెద్దగా ఏం తెలీదు, చిన్నప్పుడు ఒక్క సారి ఏదో జాతరలో కలిసాము అందరం. అంతే, నంబర్లు మార్చుకున్నా పెద్దగా కాంటాక్ట్స్ లేవు, అందుకే ధాత్రి సులువుగా నమ్మేసింది. వాడు భయపడి ఆమె పై ప్రేమను చెప్పలేకపోతున్నాడని  చెప్పి ఒప్పించామ్, కానీ వాడు మా కొంప ముంచాడు.”

“సరే నేను చూసుకుంటా, కానీ మీరు కూడా ఇక్కడికి రావాలి, అంతా నా నెత్తి మీద పెట్టి తప్పించుకోలేరు.”

“అక్క, తప్పకుండ, కానీ కాపాడు ‘ధాత్రి’ నించి, అసలే  అమాయకురాలు, ఏదన్నా చేసుకుంటే మేమంతా ఇరుక్కుపోతాము.”

“వాడిని గుర్తు పడుతుందా తను?”

“లేదు 7 యేళ్ళ క్రితం చూసింది అంతే.”

“మీరు ఇంక బయలుదేరండి.” అంటూ ఫోన్ పెట్టేసింది వినీలక్క

*******************************************************************************

ధాత్రి దగ్గరకు పొడుగాటి వ్యక్తి వచిచి చిరునవ్వుతో నించున్నాడు. ఆమె  ప్రశ్నార్థకమైన మొఖం చూసి అతనే తనని తాను పరిచయం చేసుకున్నాడు, ” నా పేరు అరవింద్, యాజీ  చిన్నప్పటి స్నేహితుడిని, వాడు రెండు నెలల వరకు రాలేడని నీ బాగోగులు చూడటం కోసం నన్ను పంపాడు” అంటూ.

“నమ్మను ” అన్నది చిర్రుబుర్రులాడుతూ..

నమ్మి తీరాలి అనట్లేదు, కానీ వాడే  నిజంగా పంపాడు”

“నన్ను కలవటానికి వాడికి తప్ప అందరికీ  ***** లో దమ్ముందా?”

“హవ్వా, నువ్విల మాట్లాడగలవ? నువ్వు చాలా అమాయుకురాలివని చెప్పాడు.”

“అమాయకురాలనే కదా నన్ను తప్పించుకు తిరుగుతునాడు.”

“అలా కాదు, పాపం ఇంట్లో సమస్యలు  వాడికి, గుడ్డి తండ్రి, పెళ్ళికి ఎదిగిన చెల్లి, రోగిష్టి తల్లి.”

“ఇన్ని కష్టాల్లో వాడికి ప్రేమించాలని  ఎలా అనిపించింది అసలూ” అంటూ మూతి మీద వేలు వేసుకు నిల్చుంది ఆమె.”

“కష్టాలకు, ప్రేమ కి సంబంధం ఏంటి కానీ, నీ పాటికి నువ్వు ప్రేమించు”.

“హమ్మయ్యో ఇప్పుడు వీడిని చేసుకుంటే ఇన్ని బ్లాక్ అండ్ వైట్  సినిమా కష్టాలు పడలా?!”

“తప్పదు, లేకపోతే వాడిని వదిలేసి మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకొని వెళ్ళిపో”

“చేసుకోవచ్చు కానీ, అప్పుడు నేను స్వార్థపరులాని అయిపోతాను కదా?”

“ఎవరు చెప్పారు, వాడికి అంటే సొంత కుటుంబం కష్టాలు తప్పవు, నీకేం ఖర్మ, తప్పించుకో, బాగా సంపాదన ఉన్న వాడిని చేసుకో.”

“వద్దు, తన వారిని ప్రేమించే వాడు తనని నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేయడులే, నేను ఎదురు చూస్తాను.

“వద్దు , నువ్వు ఇందాక వాడి గురించి అసహ్యo గా మాట్లాడవు, వాడికి నచ్చవు,  వదిలేయ్.”

“ఓహ్ అదా, ఏదో నీ ముందు అతను రాలేదన్న కోపంతో మాట్లాడాను, యాజీకి నచ్చలేదు అన్నావ్ కనుక నన్ను నేను మార్చుకుంటాను.”

“వద్దు నువ్వు నువ్వుగానే ఉండు, ఎవరి కోసమో మారద్దు.

“ఛ, ఊరుకో నేను చేసింది తప్పు, అలా మాట్లాడి ఉండకూడదు, అంటూ ఆమె వెళ్ళిపోయింది.

తన విఫల ప్రయత్నానికి అరవింద్ నీరస పడి కాళ్ళు ఈడ్చుకుంటూ వెనక్కి వెళ్ళాడు.

**************************************************************************

మరు నాడు అరవింద్ విధిగా పెట్టుకొని వచ్చాడు ధాత్రి మనస్సు మార్చటానికి. “యాజీ ఉద్యోగం చూసుకొని రావాలంటే కొన్ని నెలలు పడుతుందట, నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను, పద” అంటూ హడావిడి చేశాడు.

“అమ్మో వద్దు, కావాలంటే బయట రూమ్ తీసుకొని వుంటాను.” అంటూ అతని నుండి తప్పించుకొనే ప్రయత్నం చేసింది.

“పిచ్చా నీకు, అంతా పని చేయకు, అసలే వేరే రాష్ట్రం, , లేదంటే వాడి దగ్గర నించి మాటొస్తుంది.నీకేం కావాలన్నా నాకు ఫోన్ చేయి, నేనున్నాను నీకు.”

“అయితే నాకు ఒక ఉద్యోగం ఇప్పించండి”

“ఉద్యోగామా ?!! పల్లీలు అనుకున్నవా అడగ్గానే ఇప్పించటానికి, అయినా నువ్వు ఇంటర్ తప్పిన అమ్మాయివి, గుర్తుంచుకో”

“అయితే ఇంక నువ్వు నాకు చేయకలిగింది ఏమి లేదు”

“ఇక వెళ్ళు అని చెప్తున్నావా?”

“……”

“నీతో చాలా కష్టం”, అని నిష్టూరంగా తలుపేసి వెళ్లిపోయాడు అరవింద్.

*************************************************************************************

“ఇప్పుడెలారా, ఆ పిల్ల సీతా దేవి లా తనేదే తప్పు, ఎదురు చూస్తాను అంటోంది. నువ్వేదో ఆమెను ఒప్పించి పంపేస్తవ్ అనుకుంటే దానికి ప్రేమ ఎక్కువ చేసి కూర్చోబెట్టావు” అంటూ విరుచుకు పడ్డారు వేణు అతని మిగితా స్నేహితులు.

“నాకేం తెల్సురా , సాధారణంగా అమ్మాయిలు అబ్బాయికి కష్టాలు అంటే పారిపోతారని చెప్పాను. ” అని వాపోయాడు.

“రేపు మరో పాచిక వేసి తిరుగు టపాలో పంపిస్తాను తన ఇంటికి.”  అంటూ బండ వేణు శపధం చేశాడు.

*************************************************************************************మొక్కలకి నీళ్ళు పోస్తున్నా ధరణి దగ్గరకు బండ వేణు వచ్చి,  “ధరణి నీకు మొక్కలంటే ఇష్టమా!  యాజీ గాడికి తులసి చెట్టు నించి, అన్నీ చెట్లను చూసి చిరాకు పడతాడు.”

“అవునా ఎందుకు”

“చిన్నప్పుడు కోటి కొమ్మచ్చి ఆడేటప్పుడు చెట్టు మీద నించి పడి పళ్ళు రాల కొట్టుకునాడు. అప్పట్ నించి చెట్ల మీద పగ. ”

“అందుకే యాజీకి నేను కావాలి, ప్రేమంటే కష్టాలు, సుఖాలు పంచుకోవటమే కాదు, మూర్ఖత్వం భరించాలి కూడా వేణు అన్నయ్యా ”

“ఎవాడాడు చెప్పింది “?  అన్నాడు వెటకార్మాగా వేణు

“నా మనస్సు ”  అని వెళ్ళిపోయింది ధాత్రి

వేణు తల బాదుకుంటూ వెళ్ళి పోయాడు నచ్చ చెప్పలేక

*************************************************************************************

అరవింద్ మరలా మూడు రోజులు తర్వాత ఆమె మనస్సు విరచటానికి కంకణం  కట్టుకొని వచ్చి “ధాత్రి, ఎంత సేపు గదిలోనే కూర్చుంటావ్,  అలా చల్ల గాలికి వెళ్దాం పద” అంటూ బలవంతంగా ఆమెను ఒప్పించి రెస్ట్రారOట్ కి తీసుకెళ్ళాడు.

పెద్ద హోటల్ అనుకుంటూ లోపలికి వెళ్ళిన ధాత్రి, తను పల్లెటూరు దానినని అతను గ్రహిస్తాడని, ఆమె డాంబికం నటిస్తూ  అవస్థ పడుతోంది. అతనికి ఆమె పడే యాతన అర్థమయి ముసి ముసి  నవ్వులు నవ్వుతున్నాడు. చివరికి ఆమె వల్ల కాక, డబ్బులు ఎన్ని ఉన్నా, ఉన్నది పల్లెటూరు, నాన్న ఎక్కడికి తీసుకెళ్ళలేదు, అందుకే యాజీ వెనక వచ్చేశాను.”

అలవాట్లో పొరబాటుగా మాటల్లో అరవింద్  ఆమె పక్కన కూర్చున్నాడు,  ఆమె చివాలున లేచి నిల్చోని ” నేను నీ స్నేహితుని  కాబోయే భార్యను,   అంటూ బర్రున పక్క టేబల్ దగ్గర కుర్చీ బర్రున లాగి అతడికి ఇచ్చి కూర్చోమంది.

అందరూ వీళ్ళ కేసి ఓ క్షణం వింతగా చూడ సాగారు, అతడు ఇబ్బందిగా కుర్చీలో కూర్చుంటూ వాతావరణం తేలిక చేసే ప్రయత్నంగా మాట మార్చాడు, ” నీకు ఏ రంగు చీర అంటే చాలా ఇష్టం. నాకు గిఫ్ట్ ఇవ్వాలనుంది అంటూ తెల్ల చీర ఆమె చేతిలో పెట్టాడు.  ఆమె ఒక్క ఉదుటున లేచి “నేను నీ స్నేహితుడికి కాబోయే భార్యను, ఏడో పిలిచావు కదా అని వస్తే ఇలా ప్రవర్తిస్తావా? అని రంకెలు పెట్టింది.

“ఎలా ప్రవర్తించాను? అంటూ తెల్ల మొహం వేశాడు, అరవింద్.

“తెల్ల చీర ఎవరు ఎవరికిస్తారు. ? ఆ మాత్రం తెలీదా, సంస్కారం ఉండొద్దు”

“అయ్యో నువ్వాలా అనుకున్నావా? నాకు నీ చిన్న పిల్లల మనస్తత్వానికి  తెలుపు ప్రతీక అని తీసుకొచ్చాను.”

“నిజంగా అంతేనా”

“అంతే”

“సరే నీకు తెలీకపోతే ఇప్పుడు తెల్సుకో, పుస్తకాలు ఇవ్వచ్చు ఈ సారి నించి”

“అలాగే ముందు తిను, అందరూ మనన్నే చూస్తున్నారు,” అని ఆమెను శాంత పరిచి ఊపిరి పీల్చుకున్నాడు.

********************************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s