ఇగో

కస్సున పదునైన కత్తి అతని గుండెలో  దిగింది. వెచ్చటి నెత్తురు ఆమె ముఖం మీద చిమ్మింది. ఆమె వికృతంగా నవ్వుతోంది, అతను బాధతో విల విల లాడుతున్నాడని చూసి . ఆమె కత్తిని మరింత లోతుగా గుచ్చింది. అతను కిమ్మనకుండా నేల మీదకి ఒరిగిపోయాడు. ఆమె చాలా తాపీగా హోటల్ సూట్ రూమ్ తలుపు తెరుచుకొని, మెట్లు దిగి, అక్కడ ఉన్న ఫ్రిజ్లో అతని వద్ద దొంగలించిన క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి చిల్డ్ బీర్ తీసుకొని తాగుతూ రిసెప్షన్ కు వెళ్ళి, “608 రూమ్, బీర్ కావాలంట” అని చెప్పి చల్లగా జారుకున్నది.

రూమ్ బాయ్ ఒక పది నిమిషాల తర్వాత వెళ్ళి అతడి శవం చూసి, యాజమాన్యానికి కబురు మోశాడు.

******************************************************************************

“మన బిజినెస్ టైమ్ అయింది, త్వరగా బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయి, నా లాప్ టాప్ కార్లో పెట్టు, అన్నట్లు నీ లేడీస్ క్లబ్ మెమ్బర్షిప్ ఇవాళ రెన్యు చేయిస్తాను నిన్న వీలు పడలేదు, నీకేమన్నా ఇంకా కావాలంటే చెప్పు” అంటూ టై హడావిడిగా కట్టుకుంటున్నాడు  సుకాంత్.

“డివోర్స్ కావాలి” అన్నది అతడి భార్య చండీ.

ఒక్క సారి అతను అద్దం నించి తల తిప్పి ఆమె వైపు అవాక్కై చూశాడు. అతను పూర్తిగా నోరు వెళ్ళబెట్టక ముందే ఆమె టేబల్ మీద  తను సంతకం చేసిన విడాకుల పత్రాలు పెట్టి వెళ్ళిపోయింది.

సాయంకాలం ఆరు గంటల వరకు అతడికి ఆమెను పలకరించే ధైర్యం సరిపోలేదు. ఆమె అడిగినా సమాధానం చెప్పదని అతనికి తెలుసు. అవును ఆమె ప్రేమ పంచటంలో పంచదార చిలకే అయినా  పంతం పట్టిందంటే పల్నాటి నాగమ్మ అని అతనికి బాగా తెలుసు. తెల్సి కూడా ఆమె ముందు తోక జాడించాడు సుకాంత్. తన క్షమాపణల చిట్టా పెరిగిపోయింది. ఇక నా మనుగడ కష్టమే, ఐనా భార్యే కాదా, పిల్లలు కూడా కనివ్వలేదు, 15 సంవత్సరాలు నే చేసిన త్యాగం గుర్తు చేసి నోరు మూయిస్తాను అనుకుంటూ సాయంత్రం ఇంటికి చేరి, తానే ఇద్దరికీ  కాఫీ కల్పి, కప్పులతో డాబా మీదున్న ఆమె వద్దకు చేరాడు. అప్పటికే అక్కడ ఆరు ఖాళీ కాఫీ కప్పులు ఉండటంతో ఆమె దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తోందని పసి కట్టి, ఆమెకు ఒక కప్పు అందించి, ఏమి ఎరుగని అమాయకుడిలా ఆమెకు ఎదురు కుర్చీలో కూర్చున్నాడు.

“సంతకం పెట్టలేదు ఎందుకు” అని అడిగింది ఆమె  ఖటువుగా, నేరుగా.

అతడు ఆమె దగ్గర మోకరిల్లి, ఆమె చెంపలు నిమురుతూ “నీ వల్ల నాకు పిల్లాలొద్దు, నాకా భావన కూడా లేదు, మా వాళ్ళు ఏమన్నా నిన్ను బాధించున్టే అది నా తప్పు కాదు” అన్నాడు భావయుక్తంగా.

“ఎందుకీ చెప్పు కింద తేలు లాంటి బతుకు, వెళ్ళి వేరే పెళ్ళి చేసుకో”  అన్నది ఆమె అతడికి దూరంగా జరుగుతూ..

సుకాంత్ గతుక్కుమన్నాడు, “అంటే నేను బార్ లో తాగి వాగినది ఎవరో దీనికి చేరేసారన్నమాట. నా ప్రాణం మేఘన వద్ద, కట్టె దీని వద్ద పడేసి దేవుడు వింత చూస్తున్నాడు. అయినా నా మీద పడి ఏడుస్తుంది, ఒక మగాడిని తండ్రిని చేయలేని ఆడది పెళ్ళాంగా అర్హత ఎలా పొందుతుంది. మేఘన నా ఇగో చల్లారుస్తుంది,  ఒక్క ఆస్తి లేదన్న మాటే కానీ. దాన్ని పోషించే శక్తి వచ్చిన మరుక్షణం నేనే దీన్ని  వదిలించుకుందామనుకుంటే ఈలోగానే ఎవడో పుణ్యం కట్టుకున్నాడు” అనుకుంటూ పళ్ల బిగువున ఆవేశం కప్పిపుచ్చుతూ ఆలోచిస్తున్నాడు మరలా ఏం అబద్దం చెప్పాలా అని.

ఇంతలో ఆమె, అతడు తాగి బార్లో గొల్లున ఏడుస్తూ మాట్లాడినా మాటల వీడియో చూబించింది. అతనికి అర్థం అయింది, పరిస్దితి చేయి దాటి పోయింది అని,  ” అవునే, మేఘన నా ప్రాణం, నీ కోసం 15 సంవత్సరాలుగా పిల్లలు లేని బతుకు ఈడుస్తున్నాను, ఎప్పుడు చూసినా -బిల్ల్స్ కట్టావా? సరిగ్గా ఉండు… దాని వంక చూడకు, తాగి ఇంటికి రాకు, ఇవేగా నీతో నాకు దక్కిన బహుమానాలు. అసలు నువ్వేవరివే నా నాడవడిక మార్చటానికి, నువ్వే ఒక గొడ్డుమోతు దానివి. నువ్ ఛస్తే ఆస్తి అంతా అనాధ శరణాలయానాకి వెళుతుందని నా పుట్టిన రోజు పార్టీలో అందరి ముందు చెప్పి పరువు తీస్తావా? అంటే నీ కోసం నేను సన్యాసం జీవితం గడపాలి, నువ్వు పోయాక ఆస్తి వేరే వారి చేతిలో పెట్టాలా?అయినా నీ మొగుడ్ని, నీ కోసం నిన్ను భరిస్తున్న, ఆ మాత్రం దుబారా చేస్తే ఏంటి పిల్ల జెల్ల లేని దానివి” అంటూ ఆమె చేయి గట్టిగా వెనక్కి మెలిపెట్టాడు.

ఆమె అతడి చెంప  ఛేళ్ళుమనిపించి, “నా పేరు నీకు తెల్సు, చండీ” అని వెళ్ళిపోయింది.

*******************************************************************************

“రేయ్ అది నన్ను కొట్టింది రా.. !!!కనీసం దాని గురించి 15 యేళ్ళ జీవితం త్యాగం చేశానని కృతజ్ఞ్యత లేదురా దానికి ” అంటూ పిచ్చి వాడిలా బార్లో అందరూ చూస్తున్నా రoకెలేస్తున్నాడు. అతడి స్నేహితుడు మిధున్ వారిస్తున్నా కూడా సుకాంత్ ఆపకుండా చెప్పుకు పోతున్నాడు. రేయ్ ఇంటికెళ్తే చాలు ఆఫీసులో “ఇంకా ఇన్ని పన్లు  పెండింగ్లో ఉన్నాయి అంటూ చావకొడుతుంది, లేదా దాని తరుపు బంధువుల పెళ్ళిళ్ళకి నన్ను కూడా రమ్మంటుంది. వాళ్ళంతా మేధావులు, నాకు ఊపిరి కూడా ఆడదు వాళ్ళ మధ్య, కనీసం రెండు బాటిల్స్ తాగే ఛాన్స్ ఇవ్వకుండా నా వెంటే డాబర్ మైనర్ కుక్కలా ‘ఆరోగ్యం’ అంటూ వెంట పడుతుంది. . ఇలాంటి జీవితంలో మేఘన ఒక ఎండమావిరా, పాపం ఇల్లు కొనివ్వమని అడిగింది, ఎక్కడ కొనగలను అన్నీ  ఆస్తులు  చండివి అయితే, పాపం ఒక ట్రిప్ అడిగింది ఎక్కడ తీసుకెళ్ళగలను అన్నీ చోట్ల ఈవిడ గారి భర్తగా పేరు మోశాను.”

“పోనీ వదిలేసి, ఆమెకి దూరంగా, మేఘన నువ్వు పారిపోన్డీ, సుఖంగా ఉండండి. ” అన్నాడు మిధున్

గతుక్కుమన్నాడు సుకాంత్. “ఎలారా? ఇన్ని రోజులు వాడుకున్నదిగా, విసిరికొడుతుందా ఉన్న పళంగా?”

“అంటే ఆమె డబ్బు కావాలి, సుఖానికి మేఘన కావాలి అంతేగా, దీని అచ్చమైన తెలుగులో ఏమంటారో తెల్సా……”

“ఏంట్రా, దాని సొమ్మ, నా కస్టo లేదా, ఆ గొడ్డుమోతు దానికి నేను కాబట్టి తాళి కట్టాను”

“నువ్వు పడ్డ కస్టo అంటూ ఉంటే తాళి కట్టటం ఒక్కటే, పాపం అప్పటి నించి ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులకు తను పెనాల్టీ కడుతూ, కనీసం ఎవరికి చెప్పకుండా తనలోనే దాచుకుంది. భార్యతో కూడా పార్టీలకు వెళ్ళటం కూడా బాధ అయితే, నువ్వు మేఘన లాంటి వాళ్ళకే కరెక్ట్, ఎందుకంటే మీకు సమాజం అక్కర్లేదు, చాటుమాటుగా బతకటానికి నాలుగు గోడలు ఉంటే చాలు, పరువు ఉన్న వాళ్ళకి నలుగురు కావాలి, నలుగురిలో తమ వారిని గర్వంగా పరిచయం చేసుకోవాలనిపిస్తుంది. అదే చండీ నిన్ను కాకుండా వేరే మగాడితో వెళ్ళిందనుకో, ఎలాగో నువ్వు ఆమె తెలివికి సరిపోవని, లేదా పెళ్ళికి వెళ్తూ పిల్లిని ఎందుకు చంకలో పెట్టుకోవాలని అనుకున్నది అనుకో, తనని నువ్వు బజారు మనిషి అని  అనుకోవా? పక్కన భార్య గాని భర్త గాని లేని కొద్ది సమయంలో వేరే వారితో మాట కలిపే ఈ  రోజుల్లో ఆమె నువ్వు మాత్రమే పక్కన ఉండాలని అనుకున్నది, అది నిజంగా తప్పే. కుక్క ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టింది”.

“ఏంట్రా, దాన్ని వెనకేసుకొస్తున్నావ్, ఇంటికి రాగానే మీద పడిపోతుందా, పెళ్ళాం అంటే”

“నువ్వు ఊర్లు తిరిగి మూడు రోజుల తర్వాత వెళితే పెళ్ళాం కాబట్టే తిడుతుంది, ఉంచుకున్నది నీ కోసం ఎదురు చూడదు, నిన్ను తిట్టదు కూడా. అయినా నీకు మేఘనకు అంత ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోండీ, చండీ కూడా విడాకులు ఇస్తానటోంది కదా, ఇంక లొల్లి ఏంది, ఏం చండీ డబ్బు లేనిదే పెళ్ళాన్ని పోషించలేవా?” అని ఎగతాళిగా నవ్వాడు  మిధున్.

రేయ్ అంటూ తాగిన మత్తులో చేయి ఎత్తాడు సుకాంత్ మిధున్ మీద, “చాల్లే ఊరుకో రా, ఆస్తి ఇచ్చి, కార్ ఇచ్చి, బాద్యతగా ఉండరా అంటే నొప్పి అయింది రా నీకు, ఆమె మెళ్ళో తాళి కట్టేటప్పుడే చెప్పింది ఆమెకు పిల్లలు కారు అని, తనకి కొన్ని గోల్స్ ఉన్నాయి అని, నువ్వు అప్పుడు డబ్బు కోసం సరే అన్నవ్, ఇప్పుడు చిల్లర బుధ్ధి చూబిస్తున్నావ్, అయిన నీ దగ్గర ఏముంది వాడుకోటానికి, నువ్వు తెచ్చే సమస్యలు తప్ప. పైగా రోజుకి వంద సార్లు నువ్వు త్యాగం చేసావనీ వీలైనప్పుడల్లా గొడ్రాలని ఆడిపోసుకుంటావ్. ”

“అలుసురా మీకు నేనంటే అలుసు డబ్బు పెట్టకపోవచ్చు కానీ  సమయం పెట్టాను, నా విలువైన సమయం పెట్టాను” అంటూ తూలి అతని మీద పడ్డాడు సుకాంత్.

“రేయ్ ఇంక మందు ఎక్కువైంది కానీ ఇంటికి పో,” అని అతన్ని తరిమి తలుపేసేశాడు మిధున్.

పక్కనున్న కిటికీ లోంచి అరుస్తూ సుకాంత్ “రే నీ ఫెమినిశం కొంచెం పక్కన ఉంచి చెప్పరా , అది నన్ను వాడుకుందా, నేను దాన్ని భరించలేక వేరే దారి చూసుకున్నాన?  అంటూ అతడిని నిలదీశాడు.

మిధున్ తలుపు తీసి బయటకు వచ్చి ” చూడు పెళ్ళాయ్యాక బాద్యతలు ఉంటాయ్, ఫెమినిశం ఎడ కెళ్ళి వచ్చింది, చండీ నిన్ను అందలం ఎక్కించింది, నీ బుధ్ధి బురద వైపు మళ్లించింది. నన్ను ఎందుకు అడుగుతున్నావ్. రేపు నీ డబ్బు తిని నిన్ను మేఘన మోసం చేస్తే అప్పుడు నువ్వు కూడా పెద్ద మన్సుతో తప్పుకో ఆమె జీవితంలో నించి, ఎందుకంటే మీకు బంధాలు తియ్యటి కబురులు చెప్పినంత   వరకే, కష్టం వస్తే ఎగిరిపోవటానికే” అని అతని మొహం మీద తలుపేసి వెళ్ళిపోయాడు.

 

 

************************************************************************************

సుకాంత్ అక్కడ నించి  క్రోధంగా, నేరుగా రైల్వే కట్ట కింద ఉన్న మురికి వాడలకు వెళ్ళాడు. చుట్టూ చిమ్మ చీకటి, బురద రోడ్లు, భరించరాని దుర్గంధం. అప్పుడప్పుడు వచ్చి పోయే రైలు బండి చప్పుడుకి బురద నించి ఒక్క సారిగా లేస్తున్న దోమలు, సుమారు 3 కి.మీ. పొడవు వుంది ఆ ప్రదేశం.

వచ్చిపోయే రైలు బండి చప్పుళ్ళకి  గూడు కట్టుకున్న నిస్సబ్ధం విచ్ఛిన్నమై మరలా పూర్వపు స్దితికి చేరుకుంటోంది. అతను ఒక గుడిసె దగ్గర ఆగి తలుపును తన  కాలి తో గట్టిగా తన్నాడు. ఆ చ్చప్పుడికి వచ్చ్చింది ఎవరో అర్థం అయి ఆ ఇంటిలో ఉన్న ముసలి ముతక, పిల్ల జెల్ల అందరూ మౌనంగా బయటకి నడిచారు, ఒక్క కుంటి పడుచు పిల్ల తప్ప. బాగా తప్ప తాగి కళ్ళు ఎర్రటి జీరలతో ఉన్న అతన్ని చూసి ఆమె భయంతో వణికి పోయింది, అతడు ఆమె మీద కామంతో విరుచుకు పడ్డాడు. తన పైశాచికం అంతా చూపి ఒక ఆట బొమ్మ లాగా సుమారు రెండు గంటలు  ఆమెతో ఆడుకున్నాడు, ఇక ఆమె భరించలేక తన వల్ల కాదని రెండు చేతులు ఎత్తి నమస్కరించాకే, ఆమెను వదిలి  చేతిలో 50 వేలు పెట్టి నీరసంగా బయటకు నడిచాడు.

ఆమెకు ఆ డబ్బు తీసుకొనే ఓపిక కూడా లేక అచేతనంగా చాప మీద పడి ఉంది.

*************************************************************************************

ఇంటికెళ్ళి షవర్ బాత్ చేసి ఏమి ఎరగనట్లు చండీ ఉన్న బెడ్ మీద, ఆమె పక్కన కూర్చొని “చండీ! మన్స్పర్ధలు అందరికీ వస్తాయి, అంతా మాత్రాన శాశ్వత బంధాలు తెంచుకోకూడడు” అన్నాడు  ఒక ప్రవక్తలా మొహం పెట్టి.

ఆమె బెడ్ కి అడుగు దూరంలో ఉన్న సొరుగులోంచి తన ఫోన్ తీసి వీడియో చూపింది, అది అతడి మురికి వాడలో చేసిన కరాళ భాగోతం. “కనీసం కుంటి పిల్లనే జాలి కూడా లేదా నీకు” అన్నది తడి కళ్ళతో.

“సొ నా మీద నిఘా పెట్టావన్నమాట”?

“నీ పాపాలకీ నా ఎకౌంట్లో నించి డ్రా చేసిన డబ్బు 50 వేలు” అని ప్రతిఘటించింది ఆమె.

“నాకు కోరికలు ఎక్కువ, నేను వయస్సులో ఉన్నాను, పైగా మగాడ్ని. కావాలంటే మా అక్కని అడుగు. నీకెంత సేపు డబ్బు, బిజినెస్స్, భవిష్యత్తు. పిల్లలే లేరు ఎక్కడుందే నీకు అసలు భవిష్యత్తు” అని ఆమెను రెట్టించాడు అతడు.

ఎంత మంది ఒడిలో సేద తీరితే నీ కోరికలకీ, వయస్సుకి, మగ తనానికి న్యాయం జరుగుతుంది. ఊళ్ళో చాలా మంది వయస్సులో ఉన్నారు, నీ లాగా కుక్కల్లా వ్య్వహరిస్తున్నారా? లేదే! ఎందుకంటే వాళ్ళకి సంస్కారం ఉంది కనుక” అంటూనే అతడి అక్కకి ఆమె ఫోన్ చేయటం, “అవును నా తమ్ముడు కోరికలు గలవాడు, నీ కోసమే ఎదురు చూడాలని రూల్ ఏమి లేదు, మగాడు, ఎక్కడ కావాలన్న సుఖ పడగలడు” అనటం చక చక జరిగి పోయినాయి. చండీ నేరుగా అతడు రేప్ చేసిన  వీడియోను పోలీసులకి అందించింది.

 

మరునాడు పేపర్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త భర్త, దళిత యువతి మీద అత్యాచారo చేస్తూ పట్టుబడ్డాడు అంటూ వార్తల్లోకెక్కాడు సుకాంత్.

*********************************************************************************

సుకాంత్ ని అరెస్ట్ చేయించినందుకు చండి తృప్తీ పడుతుంటే స్నేహితురాలు స్నిగ్ద దగ్గర మాత్రమ్ “ఒక కుంటి దళిత యువతిని హింసిస్తుంటే వీడియో తీయిస్తూ కూర్చున్నావా, రక్షించకుండా?” అంటూ విమర్శలు చవి చూసింది. “నాకు మాత్రం తెల్సా, ఎవరో వీడియో పంపే దాకా, తెల్సిన మరు క్షణం ఫిర్యాదు చేసానని తెలీదా” అంటూ చెప్పుకొచ్చినా ఆమెను తృప్తి పరచలేకపోయింది. “అదంతా వదిలేయ్ ఆ దుర్మార్గుడి నించి విడాకులు ఎప్పుడు వస్తాయి” అంటూ తొందర పెట్టింది. ఆమెకు చండీ “ఎవరికన్నా మాట ఇచ్చిందా”? అనే అనుమానం కలిగి చుర చుర చూసింది. “దరిద్రం వదిలించుకోవాలంటే తొందర పడాలి” అంటూ ప్రసన్నం చేసుకుంది మరు క్షణంలో చండీ.

ఆమె కొంచెం చల్లబడి, “ఆ కుంటి పిల్ల కుటుంబం ఆమెనే బలి ఇచ్చి, ఆమె కాలు బాగు చేయించాలి అనుకున్నదంట, కోర్టులో చెప్తుంటే వాళ్ళ అమాయకత్వానికి చంపేయాలన్నంత కోపం వచ్చిందే” అంటూ తన కోపానికి కారణం చెప్పుకొచ్చింది లాయరు స్నిగ్ధ.

*********************************************************************************

“రేయ్ నాకు బేల్ కావాలి, ఆ చండిని ముక్కలు ముక్కలుగా కోసి విసిరేసేయాలి. త్వరగా పని చూడు “అంటూ జైలు గోడల మధ్యలో ప్రాధేయ పడుతున్నాడు, సుకాంత్  స్నేహితుడైన మిధున్ ని.మిధున్ చాలా ప్రశాంతంగా “ఈ తొందరే నీ కొంప ముంచింది, ఆమె సంతకం చేసిన విడాకుల పత్రాలు నాతో పంపింది, సంతకం చేస్తే విడిపిస్తానని చెప్పమన్నది”  అంటూ కాగితాలు చేతిలో పెట్టాడు.

“నేనివ్వను రా, నన్ను కాదని వేరే వాడిని చేసుకొని సుఖంగా ఉంటుంది, ఇన్నేళ్లు దాని అడుగులకు మడుగులు ఎత్తింది ఎవడికో ఒప్పచెప్పటానికి కాదు” అంటూ పళ్ళు నూరాడు.

“అదేంట్ర! మరి మేఘన, మీ ఇద్దరి గొడవల్లో నలిగిపోవట్లేదా, నీ సంతోషం పోగొట్టుకోకు, వెళ్ళి ఏదో నీకు దగ్గ ఉద్యోగం చూసుకొని ఆమెతో హాయిగా ఉండు” అంటూ హితవు చెప్పాడు అనునయిస్తూ.

“ఏంట్రా మేఘన? తిండి పెడితే పడుండేది కుక్క పిల్లలు కానీ ఆడ పిల్లలు కారు. వారిని మెప్పించాలి, మురిపించాలి,  ట్రిప్పులకు తీసు కెళ్ళాలి, తాజ్ మహాళ్ళు కట్టాలి, చీమిడి కారితే మన చేత్తో తుడవలేదంటారు కర్చీఫ్ ఇచ్చినా. ఇవన్నీ చేయల్న్టే నా జన్మ మొత్తం దేకినా చాలదు.”

“పాపం రా మేఘన, నీ ఆలోచనలు ఆమె మీద రుద్దకు, బహుశా నీ కోసం అవన్నీ వదులుకుంటుందేమో అడిగి చూడు, ఒక వేళ ఆమె ఒప్పుకోకపోతే నువ్వు  సంపాదించు, ప్రేమించిన ఆడ దానికోసం ఆ మాత్రం కష్ట పడలిగా మరి.”

“నువ్వు నన్ను ఎంత రెచ్చ కొట్టినా చెండి చండాలమే, మేఘన చండాలమే, కానీ …కానీ…”

“ఆ చెప్పు, చండాలం వాళ్ళది  కాదురా నీ బుద్ధిది.  డబ్బు ఇచ్చిన ఆడదాన్ని గౌరవం    ఇవ్వలేదంటావ్ ,  గౌరవం  ఇచ్చిన ఆడదానకి డబ్బు లేదంటావ్. నువ్వు మాత్రమే మంచోడివి, అందరూ నిన్ను అర్థం చేసుకోవాలంటావ్, ఉన్న నాలుగు డబ్బులు మురికి వాడల్లో చెత్త పనలకు ధార పోస్తావ్. ఇప్పుడు నా వెనక బడతావ్”  అంటూ ఆవేశంగా విరుచుకు పడ్డాడు.

అతని కోపానికి కొంచెంగా ఆలోచనలో పడ్డాడు. “సరే సంతకం చేస్తాను, కానీ ఏదన్నా డబ్బు వచ్చే ఏర్పాటు చేయమని అడగరా” అంటూ దీనంగా అడిగాడు. అతడు ఇంకేదో చెప్పే లోపు  “అన్నట్లు మేఘన     కు  జైలు విషయం చెప్పకూ, ఒక వేళ తెల్సి నన్ను అసహ్యించుకుంటే మా ఇద్దరి సన్నిహితపు ఫోటోస్ నెట్లో పెట్టు, అప్పుడు నా కోసం చచ్చినట్లు ప్రేమ చూపిస్తుంది. ఇంత చేసింది దాని కోసమే అయితే అది మాత్రం పారిపోతే ఎలా?”

మిధున్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక, “సరే సంతకం పెట్టు” అని పెట్టించుకొని అక్కడ నించి అతడి మీద జాలి పడుతూ వెళ్ళిపోయాడు.

అలా వెళ్ళిన మిధున్ తిరిగి చండీతో పెళ్ళి తనకు కుదిరిందని, శుభ  లేఖతో కనిపించాడు సుకాంత్ కి. మతి చెలించినట్లు క్షణకాలం వెర్రి చూపులు చూశాడు సుకాంత్. “అరేయ్ నేను నీ స్నేహితుడ్ని రా, డబ్బులిప్పిస్తానని కదా సంతకం పెట్టించుకొని వెళ్ళావ్, 3 నెల్ల తర్వాత శుభ లేఖతో కనబడతావా?” అంటూ గట్టిగా అడిగాడు మిధున్ ని చొక్కా పట్టుకొని నిలువునా ఊపేస్తూ.

“చాల్లేరా! నువ్వు తాళి కట్టిన భార్యను మోసం చేయొచ్చు, నీ స్నేహితుడు మాత్రం నీకు నమ్మకంగా ఉండాలా? అయిన నీకు మీ ఆవిడని అర్థం చేసుకోకపోవటం రాకపోతే  నాదా తప్పు. ఎప్పట్నించో మేమందరం నీ అదృష్టం చూసి ఏడుస్తుంటే, నీ కాంతా- ఏకాంతాల ప్రహసనం మా కడుపు మంటలు చల్లార్చాయి.ఎక్కడన్న అడుక్కో కానీ  పాత పెళ్ళాం కొత్త మొగుడి దగ్గర అడుక్కోకూడదు , తెల్సిందా ” అంటూ వెళ్ళిపోయాడు.

************************************************************************

మిధున్ నేరుగా చండీ ఆఫీసు కెళ్ళాడు, “మీరు చెప్పినట్లు దొంగ శుభలేఖ చూపి నమ్మించాను. మీరు జాగ్రత్తగా ఉండాలి” అన్నాడు.

“చాలా మేలు చేశారు, కొంచెం ముందే చెప్తే ఇంకా బాగుండేది, పర్వాలేదు, అయిన అలాంటి వాడిని విడిపిస్తానని ఎలా నమ్మాడు” అంటూ రెండు లక్షలు అతని చేతిలో పెట్టింది.

“అతడు మళ్ళీ అవసరం వస్తే నన్నే పిలవండి” అని దండం పెట్టి వెళ్ళిపోయాడు.

ఇంతలో సుకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అని మెస్సేజ్ వచ్చింది, “నా సహాయం అందదని శుభలేఖ ద్వారా చెప్తే, ఇలా చచ్చిపోయావా” అంటూ నవ్వుకుంది ఆమె.

***************************************************************************

రెండు నెలల తర్వాత ఒక చల్లటి సాయంత్రం ఎర్రటి నులివెచ్చని సూర్య కిరణాలు ఆస్వాదిస్తున్న చండికి అంతరాయం కలిగిస్తూ బిల బిల మంటూ పోలీసులు వచ్చారు. అనుకోని సంఘటనకు విస్తుపోయి చూసేంతలో ఆమెను చుట్టిముట్టి  “మీ హోటల్ లో మీ మాజీ భర్తను హత్య చేయించినందుకు అర్రెస్ట్  చేస్తున్నాము, సాక్షాలు దొరికాయి స్టేషన్కు  రావాలి” అని హూంకరించారు.

“అతను నిన్న చనిపోవటం ఏంటి? ఎప్పుడో  ఆత్మహత్య చేసుకన్నాడు” అంటూ మొరాయించింది ఆమె. “సాక్షాలు గట్టిగా ఉన్నాయి, మీరు తప్పించుకోలేరు అంటూ ఆఫీసరు  ఆమె జబ్బ పట్టి ఈడ్చా పక్కనే లేడి కాన్స్టెబెల్స్               ఉన్నా కూడా       అంతే, ఒక్కో సారి, ఎంత డబ్బు పరపతి ఉన్నా,  ఈ సమాజం మనన్ని అనవసరంగా అనుమానిస్తుంది, అవమానిస్తుంది, అక్కడితో ఊరుకోక తనకి అనుమానం కలిగింది కనుక మనన్ని వేధిoచి హింసిస్తుంది.

*****************************************************************************

మిధున్ కి ఎన్ని సార్లు స్నిగ్ధ చేత ఫోన్ చేయించినా సమాధానం రాలేదు, సుకాంత్ చనిపోయాడని మెస్సెజు పంపింది పోలీసులే అనుకోని తిరిగి ఆ నంబరు సేవ్ కూడా చేసుకోలేదు ఆమె. జీవితం లో ఒకే ఒక్క సారి నిర్దయగా ప్రవర్తించింది అది కూడా అతని హింస ధోరణి వల్ల మాత్రమే, అయినా కూడా చేసిన పుణ్యాలు ఎటు పోయాయో, ఒకే  ఒక్క నిర్దయ చర్య పీకకి చుట్టుకుందని అల్లాడిపోతోంది జైలు గోడల మధ్య చండీ. అతడి మీద కోపంతో శవాన్ని కూడా చూడాలని అనుకోలేదు తీర చూస్తే  అతడు ఆ రోజు చావనే లేదు, రెండు నెల్ల తర్వాత తన హోటల్లోనే చంపబడ్డాడు.  ఒకటి మాత్రం నిజం ఎవరో తనని ఇరికించారు, కనిపెట్టాలి, అని కృత నిశ్చయం చేసుకుందో లేదో పక్కనున్న ఖైదీ ఈమె భుజం మీద చేయి వేసింది. తన స్థాయికి ఒక ఖైదీ సమీపంగా నిల్చోవటం ఆమెకు నచ్చలేదు. దూరంగా జరిగి ఏమిటన్నట్లు చూసింది ఆమె వంక. ఆమె “నాకు నిద్ర రావట్లేదు మరి నీకు” అన్నది అదో రకంగా చూస్తూ.

చండికి అర్థం అయింది, ఇంకా ఎన్ని అవస్థలు పడాలో ఈ జీవితంలో ఆ దరిద్రుడి వల్ల అనుకుంటూ , “రేపు నన్ను విడుదల చేస్తున్నారు, నాకు పెద్ద పెద్ద మంత్రులు తెల్సు జాగ్రత్త” అని హెచ్చరించింది .

“రేపు కదా విడుదల, మంత్రులుకేం తెల్సు మా బాధలు” అంటూ అడుగులు ముందుకు వేసింది. చండికి పై ప్రాణాలు పైనే పోయినాయి. ఆమె చూడటానికే ఘటోత్కచ్కుడిలా ఉంది, తన బక్క పలచని శరీరం సహకరిస్తుందో లేదో, ప్రతిఘటించటానికి  అనుకుంటూ అడుగులు వెనక్కి వేసింది. ఆమె మరింత ముందుకు రాగానే పక్కనున్న నీళ్ళ కుండతో ఆమె తల మీద కొట్టింది. ఆమెకు గాయాలు అయినాయి, అందరూ లేచారు, చండిని జైలు సూపెర్దెంటెంట్ ఆఫీసుకి పిలిపించింది. జరిగినదంతా  వినే ఓపిక ఆమెకు వినే ఓపిక  ఉందో లేదో అనుకుంటూ ఆమె గదిలోకి ప్రవేశించింది.

“రండి కూర్చోండి” అన్నది ఆమె సాదరంగా. చండీ మౌనంగా కూర్చొని “ఇప్పుడు ఈ నేరానికి ఎన్ని రోజుల శిక్ష పెరిగింది” అన్నది అనుమానంగా.

ఆమె చిన్నగా నవ్వి, “మీరు కొట్టటంలో తప్పు లేదు, ఆత్మ రక్షణ లోకే వస్తుంది, మీ గది మారుస్తున్నాము, ఇక మీరు ఒంటరిగా ఉండొచ్చు. స్నిగ్ధ మేడమ్ బైలుకి ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పమన్నారు”  అని భరోసా ఇచ్చింది.

*******************************************************************************

మరునాడు  చండీ జైలరు పిలుపు కోసం ఉదయమే లేచి కూర్చుంది. 10 గంటలు అయినా ఎవరు రాలేదు. పైగా జైలంతా ఎవరో కొత్త అధికారి వస్తున్నారని హడావిడి. ఆమెకు సహనం నశించి నేరుగా జైలరు వద్దకు వెళ్ళింది. ఈమెను చూస్తూనే ఆవిడ రెండురోజుల్లో వస్తోందని చెప్పమన్నది, నేనే కబురు పామపుదామని అనుకుంటున్న అన్నది. నీరు కారిపోయిన ఆమె తిరిగి తన గదికి చేరుకున్నది. ఆడ ఘటోత్కాచురాలు ఈమె గాడి ముందే తచ్చాడుతూ  ఉరిమి ఉరిమి చూస్తోంది. భగవంతుడా రెండు రోజులా? ఇక్కడా? ఇంత కంటే ఉరే వేసేయకపోయావా అనుకుంటూ మిటికలు విరుస్తోంది కంగారుగా.

*********************************************************************************

“కష్టం స్నిగ్ధ, చండీ ని రక్షించటం మన వల్ల కాదు, ఆమె భర్త మీద నిఘా పెట్టి వేటాడింది. వేడిఓ తన ఫోన్ నించే పంపింది. ఎవరు పంపారో చెప్పమంటే తెలీదంటుంది. మోసం చేశాడనే కాశీతో తానే చ్ంపించున్టుందని అందరూ నమ్ముతునారు” అంటూ పెదవి విరిచాడు ఆమె భర్త వేదాంత్.

అది అలాంటిది కాదని మీకు మాత్రం తెలీదు అంటూ అతడు తింటున్న కంచం లాగేసింది ఆమె. అతడు నిదానంగా తిరిగి తీసుకొని తెల్సుసు కానీ సాక్షామ్ లేదు. నువ్వే చెప్పు ఆమెకు తెలీకుండా ఆమె సొంత హోటల్లో రూమ్ ఇచ్చిందా.

ఎలా ఇచ్చింది, అది ఇవ్వలేదు, రెస్ప్శానిస్టు ఇచ్చింది, దానికి విడకులయ్యినట్లు ఇంకా ఎక్కడ చెప్పి చావక గోప్యం వహించింది. అది స్టాఫ్ఫ్ కి తెలీక యజమానిగా భావించి ఇచ్చి దాని పీకాల మీదకి తెచ్చారు.

ఔను, కొంచెం పెరుగు వేయి అన్నాడు అతను వేళ్ళు నాకుతూ.

నాకింది అప్పి ముంది సమాధానం చెప్పు అని మొట్టికాయలు వేసింది ఆమె. వస్తున్న ఆ పాయింట్కే, విడాకులు అయిపోయాక గోప్యంగా వుంచుకోవటం ఆమె ఇష్టం అలాగే ఆమె హోటల్ లో ఎవరి హత్య జరిగిన ఆమేడే బాద్యత అవ్వటం చట్టం ఇష్టం, అంటూ అతడు పెరుగు ఇంకొంచెం వేయి అన్నాడు..

ఆమె అమాంతం అతడి తల మీద గిన్నె బోర్లించి వెళ్ళిపోయింది కోపంగా.

********************************************************************************

“నా పేరు చేబ్రోలు, మీకు బైలు ఇచ్చారు పదండి” అన్నాడు ఒక ఆరు అడుగుల మనిషి ఆమె జైలు గది దగ్గర. మనిషి మంచి అందగాడులా ఉన్నాడు శ్రీ కృష్ణుడిని  పోలే చిరునవ్వుతో మరింత ఉల్లాసంగా కనిపిస్తున్నాడు.

“వచ్చింది బైలేగా, దానికా రొమాంటిక్ నవ్వు ఎందుకో” అంటూ విసుక్కుంది ఆమె.

“నా నవ్వే అంతా, ఏమైనా రొమాంటిక్ అని మెచ్చుకున్నందుకు, ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు ఇక వెళ్దామ” అన్నాడు దారి చూబిస్తూ.

“మీతో నేను రావలా, స్నిగ్ధ ఎక్కడ”?

“ఇద్దరు హనీమూన్ కి వెళ్ళిపోయారు”

“ఏంటి నేనింత కష్టంలో వుంటే హనీమూన్ కి  వెళ్ళిందా” అది.

“లేకపోతే మీరు కష్టంలో వుంటే అందరూ పెళ్ళిళ్ళు శుభరాత్రులు వదులుకుంటారా?”

“చావమనండి, నన్ను మర్చిపోమనండి”

“మర్చిపోయింది. అయినా మొగుడు హనీమూన్  ట్రిప్కి పిలిస్తే ఏ మొద్దు మొహంది వద్దు అంటుంది, ఎంత లాయరు అయినా ముందు పెళ్ళాం కదా..!!”

ఆమెకు గుడ్ల నీరు తిరిగాయి, మొహం అంతా కందగడ్డలా మారింది, ఆమె కోపోద్రిక్తమైన ఉచ్వాస నిచ్వాసలు చూసి వైజాగ్ బీచ్ లో  ఎగసి పడే అలలు గుర్తుకు వచ్చాయి అతడికి. పచ్చని పసిమి చాయ జైలు గోడల మధ్య మాసినా కూడా ఒకింత మెర్తున్నదే అనుకుంటూ “వెళ్దామా  మరి “?అన్నాడు.

ఆమెకు రోషం పొడుచుకు వచ్చి బయటకు పరుగులు పెట్టినట్లు నడిచింది,  ఆమె నడుస్తున్నా కోపంతో ఎగసి పడుతున్న ఆమె వక్షస్థలం గమనిస్తూనే ఉన్నాడు అతడు. స్నిగ్ధ కార్ దగ్గర పూల బొకెతో నిల్చున్నది పతి సమేతంగా. వాళ్ళ పని అమ్మాయి  దిస్టీ తీస్తుంటే “ఇక్కడ నిల్చోని ఆ వెధవని లోపలికి పంపుతావా” అని గట్టిగా  ఎడ్చి కౌగలించుకుంది.

“హే కేదార, మీ ఇద్దరు స్నేహితులకి మేమే దొరికామ” అంటూ కోపంగా చూసింది స్నిగ్ధ”

*********************************************************************************

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s