సూక్ష్మ చరిత

ఫెళ్ళున తన కధల ఫైల్  తన మొహం మీద  విసిరివేయబడటంతో   అవమానంతో ఉలిక్కి పడ్డాడు విరించి.  ఆ పని చేసిన శ్యామల్రావ్ ను తీక్షణంగా చూస్తూ తమాయించుకుని ” మీరు పూర్తిగా నా కధను తెరిచి కూడా చూడలేదు” అన్నాడు.

“నీ చెమట తో తడిసిన జూబ్బ, పిచ్చుక గుళ్ళకు అనువుగా వున్న జుట్టు, తేజస్సు ఉట్టిపడే ముఖ వర్చస్సు చూస్తూనే అర్థం అవుతుంది, నువ్వే పాటి కధలు వ్రాస్తావో అని. మీ సంస్కారం మా పాఠకులకు అక్కరలేదు, ఇక వెళ్ళి రా!” అని ముక్కు చీదుకున్నాడు కర్చీఫ్లో చాలా చిరాగ్గా..

“పోనీ మీకెలాంటి కధలు కావాలో చెప్పండి, అది ఇందులో ఉందో లేదో చెప్తాను”

“నీకు అర్థం అవ్వదయ్య, నువ్వు మహా అయితే ఏం వ్రాస్తావు, దళితుడి దౌర్భాగ్యం, తల్లి రత్న గర్భ , బిడ్డలు  గర్భ దరిద్రులు అని, లేదా సామ్యవాదం, సమ సమాజం అని. ఇలాంటి కధలు ఎవరు చదువుతారు. నేను పల్లీలు అమ్ముకొనే వాడి కోసం పత్రిక పెట్టుకోలేదు” అంటూ మళ్ళా ముక్కు చీదాడు.

“పోనీ ఎలాంటివి వ్రాయలో చెప్పండి, వ్రాసి పట్టుకొస్తాను.”

“అలా అన్నవు బాగుంది, చూడు, వీరేశలింగం, గురజాడ పుస్తాకలు అమ్ముడుపోని ఈ రోజుల్లో నువ్వు అవే పట్టుకొస్తే నేనెలా సహకరించను. నీ రచనని మార్చు, ఒకడు మంచి చేస్తే దాన్ని నువ్వు ప్రమాదంగా చూబించాలి, మన పూర్వీకులు కేవలం తమ స్వార్ధం కోసం స్వతంత్రం తెచ్చారు కానీ మన బాగు కోసం కాదు అని నిరూపించాలి, అన్నిటి కన్నా ముందు ఈ పత్రిక ప్రజల కోసమే నిశ్వార్ధంగా పని చేస్తోందని నొక్కి వక్కాణించాలి.  ఒక పసి పిల్లను ఎలా అత్యాచారం చేసి నరక యాతన పెట్టి చంపారో, పక్కనే ఉండి చూసినట్లు ఫీలింగ్ నీ వర్ణన వల్ల పాఠకుడికి కలగాలి ?”

“దాని వల్ల ప్రయోజనం”

“చాలా ఉంది, పాఠకులకి ఇంతకు ముందు తెలియనిది, మన ద్వారా తెల్సింది అని, ఇన్ని రోజులు అందరూ తమను మోసం చేస్తే మనమే నిజాలు నిర్భయంగా వ్రాశామని అనుకుంటారు, తాము నయవంచనకు గురి అయినాము, అంతా పూర్వీకుల మాయ మాటల వల్ల అని బాధ పడతారు, తామే ఈ  జగత్తుని మార్చాలి ఇంక అనుకోని క్షణ కాలం హీరోలా ఫీల్ అవుతాడు. మనమే ముందు ఈ విషయాలు వారికి తెలియచేసామని, లేకుంటే గాఢాంధకారంలో వుండేవాళ్ళమని భావించి మనన్ని నవ సమాజ స్థాపకులుగా ఆరాధిస్తారు. ఇంకా కొంత మంది పసి పిల్ల అత్యాచారం శీర్షిక పూర్తిగా చదివి తమ సైకోయిసoను చల్లార్చుకుంటారు. పాఠకుడి నాడులు మన ఆధీనంలోకి తెచ్చుకున్నవాడే ఇక్కడ ఉండగలడు. ”

” పసి పిల్ల రేప్ శీర్షిక ఎవర్ని కంట తడి పెట్టనివ్వదా, ఒక్క సైకోలే చదువుతారా?

“చదువుతారు, సెంటిమెంటల్ ఆడాళ్ళు, వాళ్ళు  ఎడిస్తే మనకి లాభం,  ముక్కు చీది మళ్ళా వంటింట్లో వంటలు చేసుకుంటారు, మన్నని ఎదిరించే వాడు పుట్టడు.”

“సరే అయితే, మీరనుకున్నట్లుగానే ఈ కధ చాలా జుగుప్సాకరమైనది, దారూణమైనది గా వ్రాసాను, సొంత తండ్రే కూతురిని బజారు దాన్ని చేస్తాడు. వికృతానందం పొందుతాడు, కానీ ఒక రోజు నిజం తెల్సుకుంటాడు, అదే కధలో పెద్ద మలుపు. చదవండి, చివరి పేజిలో నా ఫోన్ నెంబర్ కూడా జత చేశాను,  నచ్చితే ఫోన్ చేయండి,” అని అక్కడ నించి వెళ్ళిపోయాడు విరించి.

సరిగ్గా గడియారం అప్పుడే ఠంగు ఠంగున ఆరు గంటలు కొట్టటంతో శ్యామలరావు అతడు ఇచ్చిన కధ ఫైల్‌ను కారు లో పడేసి ఇంటికి బయలు దేరాడు, “ఏమయి ఉంటుంది అంత జుగుప్సాకరమైనది, దారుణమైన కారణం, సొంత తండ్రే కూతుర్ని బజారు దాన్ని చేసే కారణం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది” అనుకుంటూ ఇంటికి చేరాడు.

తన రాత్రి భోజనం ముగుంచుకొని ఆతృతగా కధ ఫైల్‌ను ఓపెన్ చేశాడు, అక్షరాలు అన్నీ ముత్యాలు పొడగబడ్డట్లుగా చాలా అందంగా కనిపించాయి. నెమ్మదిగా కధలో లీనమైనాడు అతడు.

************************************************************************

“ఏం కూశావ్, మళ్ళా అదే మాట చదువుకుంటాను అన, ఏం ఇప్పుడు నువ్వు చదువుకోకపోతే, దేశానికి అరిస్టామా, లేక స్త్రీ సమాజం గాడి తప్పుతుందా?” ఆంటో 16 యేళ్ళ కూతురు అయిన సూక్ష్మ  మీద విరుచుకు పడ్డాడు వామన రావు.

“10 వ తరగతి లో నాకన్న తక్కువ మార్కులు వచ్చిన వారంతా కాలేజీలో చేరి పోయారు, నాకు 89 శాతం, ఎందుకు ఊరికేనే ఉండాలి”

“ఎందుకా, ఈ కాలేజేల్లో ఎవడో ముక్కు మొహం తెలీని వాడిని తీసుకు వచ్చి నా అల్లుడుగా చూబిస్తావేమోని మంట నాకు”

“నేను చదువుకుంటాను అన్నాను, నువ్వు నాకు లేని పోనీ ఆలోచనలు కలిగిస్తున్నావు నాన్న, నేను నీ పత్రికాకి తోడుగా వుండాలని ఆస పడుతున్నాను.” అన్నది అమాయకంగా సూక్ష్మ.

“.మరే ఆడ పెత్తనం తంబలదొరతనం అని ,ఇలాంటి కబురులు చెప్పే వాళ్ళే ముందు పరువులు తీసేది, పో !నీ గదికి”  అని గదమాయించాడు వామనరావు.

వెక్కి వస్తున్న ఏడుపుని అదిమి పెట్టుకొని తన గదికి చేరుకున్న సూక్ష్మ , తన తెలుగు టీచరు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నది, ‘ఆడవాళ్ళు  ఏడిస్తే ఓడిపోయినట్లే అని’  ఉక్రోషంతో  కిటికీ మీద  పడుతున్న సన్న జాజి తీగను చూసి అసూయగా,  “నీ లాగా పుట్టి వుంటే ఎలాంటి ఆశయాలు ఉండవు కదా అన్నది మౌనంగా”

“నీ లాగా డీలా పడిపోయి ఉంటే , సుకుమారమయిన మేము మీ  పొడుగాటి భవంతులను చుట్టుకొనగలమా” అంటూ నవ్వుతూ చల్లగాలికి తలలు ఊపాయి. తళుక్కున ఆమె మాదిలి ఒక ఉపాయం స్ఫురించింది, హాల్లోకి ఒక్క పరుగున వచ్చి వాలి, తండ్రి లేడని నిర్ధారించుకొని, ఆయన స్నేహితుడయిన  శల్య కు ఫోన్ చేసి తన బాధ చెప్పింది.

“నువ్వు నిశ్చింతగా వుండు, నే చూసుకుంటా” అని ఫోన్ పెట్టేశాడు ఆయన.

20 రోజుల తర్వాత ఆమె, తమ పూర్వీక్కులు కట్టించిన కాలేజీలో చేరింది.  చదువులో ప్రతి అక్షరం సూత్రం ఆమెకు ఒక  ఉల్లాస గుళికలుగా  అబ్బుర పరుస్తున్నాయి. ఇక్కడ ఎలాంటి ఆంక్షలు లేవు, తనని నఖా శిఖ పర్యంతం పరీక్షించి, కట్టుదిట్టం చేసే వారు లేరు. కాకపోతే యజమాని కూతురు అనే భయం వల్ల అందరూ కాస్త మర్యాద ఎక్కువే ఇస్తున్నారు, అందుకు తాను యోగ్యురాలు కాదని ఆమె బాధ పడుతుంటుంది.

కొద్ది కాలానికి ట్యూషన్ అవసరం వచ్చింది. చదువు జటిలమవుతోంది, తండ్రికి చెప్పగానే అగ్గి మీద గుగ్గిలం అయినాడు. ట్యూషన్ అంటే తల్లి తండ్రులను మోసగించి బాయ్ ఫ్రెండ్ ను కలవటానికి అమ్మాయిలకు దొడ్డి దారి అని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఎంత చెప్పిన ససేమిరా అన్నాడు.

చేసేది లేక, ఎలాగో పరీక్షలు ముగుంచింది, కానీ అన్నిటిలోనూ పెద్దగా చెప్పుకో దగ్గ మార్కులు రాలేదు. తరగతిలో అందరిలో తానే కనీస మార్కులతో బయట పడింది. “లక్ష్మి పుత్రికలకు, సరస్వతి కటాక్షించదులే,” అంటూ కాలేజీ గోడల మీద వ్రాసారు, ఆమె ఎదురు పడి అనే ధైర్యం లేక.

కాలేజీ గ్రౌండ్లో కూర్చొని తనకు వేరే మార్గం ఎలా దొరుకుతుందా అని తీవ్రంగా ఆలోచిస్తుంటే ఒక స్మార్ట్‌గా ఉండే అబ్బాయి  ఆమె వద్దకు వచ్చి “నా పేరు విరించి, ప్రిన్సిపల్ గారు పంపారు, మీకు అర్థం కానీ పాఠాలు  చెప్పమని”  అన్నాడు.

మరలా తనకో మార్గం దొరికిందని ఎగిరి గంతేసినంత పని చేసింది. “ఇక్కడే కాలేజీ అయిపోయాక రోజు కలుద్దాం” అని వెళ్ళిపోయింది.

*************************************************************************

విరించి విధిగా రోజు పాఠాలు చెబుతున్నాడు, ఆమెకున్న శ్రద్ధ చూసి ఆశ్చర్యపోయే వాడు. తనకు అర్థం కాని అంశం వచ్చినప్పుడు తన మెదడు తో తాను చేసే సంఘర్షణ చూసి అతడు విస్తుపోయే వాడు. చివరికి ఒక రోజు ” ఎందుకొచ్చిన తిప్పలు, మీ నాన్నకి బోల్డు దబ్బున్దీ, హాయిగా పెళ్ళి చేసుకో, వంటోళ్లతో చాకిరీ చేయించుకో, క్లబ్బులు చుట్టూ తిరుగు.” అన్నాడు

ఆమె చిన్నగా నవ్వి, సంపద ఉంటే సరిపోదు, జ్ఞాన సంపద ఉండాలి, దేశాని ఉద్దరించలేను కానీ, మా నాన్న సొంత పత్రికను విలువలతో ఉద్దరించాలి” అన్నది.

“అదేంటి అంతా మాట అనేశారు”

“ఔను, మా నాన్న పత్రికలోని వ్రాతల వల్ల ఒక టీచరు కుటుంబం చితికిపోయింది. మా నాన్నకు కావల్సిన మనిషికి వ్యతిరేకంగా నిలబడ్డoదుకు  ఆమె పై వ్యభిచారి అనే ముద్రా వేసి ప్రచారం చేశాడు మా పత్రికలో. ఆమె అవమానం భరించలేక బిడ్డతో సహా ఊరి వేసుకున్నది.  ఆవిడ నే చేత అక్షారాలు దిద్దించిన టీచర్. విలువల విలువలు  నేర్పిన మహనీయురాలు” అంటూ గద్గద స్వరంతో ఆగిపోయింది.

“మీ నాన్నకి సొంత ఇంట్లోనే శత్రువు ఉంది అంటే ఊరుకుంటాడా”

“ఊరుకోడు, అయనా విలువలు తెలీని తండ్రిని నేను తండ్రిగా భావించనని ఆయనకు తెల్సే నాకు అడుగడుగున అడ్డుపడుతున్నాడు”

విరించి పుస్తకాలు అక్కడికక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఉన్న పాటుగా. తర్వాత మూడు రోజులు అతడు ఆమెకు పాఠాలు చెప్పటానికి కూడా రాలేదు, కాలేజీలో మాత్రం కనబడే వాడు, ఆమెకు అర్థం అయింది. వేరే ఇంకొకరు ఎలా దొరుకుతార అనుకుంటూ ఎదురు చూడ సాగింది.

” నా పేరు మిత్రా, మీ అమెరికా అంకుల్ పంపారు, మీకు పాఠాలు చెప్పటానికి” అంటూ నెల రోజులకు ఒక వ్యక్తి వచ్చాడు ఆమె వద్దకు. తిరిగి తన ప్రయాణం కొనసాగించింది ఆమె.

****************************************************************************

విరించి ఆమె పట్టుదల చూసి ఒకింత అసహ్యం పెంచుకున్నాడు. మిత్రా అనే వ్యక్తితోనూ, లేదా కాలేజీ  లెక్చరర్ల తోను తప్ప మరెవరితోనూ కనిపించేది కాదు ఆమె. ఒక సారి ఆమె వెనకాలే అనుసరిస్తూ వచ్చి “నీకెందుకు సహాయ పడాలో ఒక్క సారి చెప్పు.  జ్ఞ్యానమ్ కోసం చదివితే అది సంపద  కానీ ప్రతీకారం కోసం చదివితే దాన్ని ప్రతీకార వాంఛ అని అంటారు. పైగా తండ్రి మీద ప్రతీకారం తీసుకోమని ఏ చదువు చెప్పదు తెల్సుకో” అన్నాడు పరుషంగా.

ఆమె మౌనంగా కార్ ఎక్కి అతడి కళ్లలోకి చూస్తూ “చేసిన సహాయానికి కృతజ్ఞ్యతలు” అని వెళ్ళిపోయింది.

“పాముకు పాలు పోస్తున్నాడని పాపం మీ నాన్నకి ఇంకా తెలీదు” అని పెదవి విరిచి నిష్క్రమించాడు అతడు.

**********************************************************************************

సంవత్సరాలు దొర్లినాయి, వామన రావు పత్రికకు విపరీతమయిన వ్యతిరేకత మొదలయినది. తన పత్రిక తప్పుడు ప్రచారాల కోరు అని అన్నీ వైపుల నించి ఒత్తిడి వచ్చింది. సాక్షాలతో సహా ఒక స్త్రీ వెలుగులోకి తీసుకు వస్తోంది, మిగితా పత్రికల ద్వారా.  దొరికిందే అదునుగా, ప్రత్యర్ధులు మూకుమ్మడిగా విరుచుకు పడ్డారు అతడి మీద.

అతడికి మూల బీజం ఎక్కడ పడిందో అర్థం కావట్లేదు, పత్రిక రంగంలో తిరుగు లేని రాజులా వెలుగుతున్న దశలో ఇంత విప్లవం ముసలం లా తనని కబళించేస్తోంది అని తన మనషుల మీద విరిచుకు పడ్డాడు. వారు ఎంతో ప్రయత్నం చేశారు, కానీ పసికట్టలేకపోయారు, చివరికి ఒక విదేశీ సంస్థకు అప్పగించాడు వామన రావు ఆ పనిని.

రెండేళ్ళు  అతడి మనుషులకి సఖ్యం కానీ పని   ఆశ్చర్యపోయేలా 6 నెల్లల్లో ఆమెను కనిపెట్టింది ఆ సంస్థ.  వివరాలు మేల్ లో పెడతామని ఫోనే చేయగానే, ” ఇంక ఆలోచించొద్దు, పూర్తిగా మట్టు పెట్టి నాకు కబురు పంపండి ” అని ఫోన్ పెట్టేశాడు.

******************************************************************************

ఆ మరునాడు వామన రావు కూతురు ఆక్సిడెంట్ లో పోయిందని, బూడిద ని తీసుకొచ్చి ఇచ్చారు పోలీసులు. వెంటనే  విదేశాల  నించి ఫోను వచ్చింది,  “ఆ స్త్రీ గగన కుసుమం అయింది” అని

ఒక వైపు శుభ వార్త మరో వైపు దుర్వార్త, ఇంతలోనే పరామర్శకులందరూ  ఇంటికి చేరి అతడి కన్నా ఎక్కువ రోదిస్తున్నారు. అతడికి మాత్రం తన పత్రిక కు పట్టిన చీడ పోయిందని చాలా ప్రశాంతంగా ఉంది, మరో పక్క కాస్త బాధగాను ఉంది కూతురి మరణం వల్ల. “నీకెందుకే ఈ జర్నలిశo, హాయిగా ఇంటి పట్టున ఉండు, వేలకు తిను, పెళ్ళి చేసుకో అని చెప్పాను, వినలేదు, ఇలా దేశ సేవలో చనిపోయింది అంటూ భళ్ళున ఎడ్చాడు అందరి ముందు.

అతడి మనుషులు అతడిని పక్కకి తీసుకెళ్ళి  “మరి ఆమె పని అయిపోయింది, ఇక చేసేదేమీ లేదు కదా” అన్నారు.

“అప్పుడే ఎక్కడ, అది నన్ను ఎన్ని ముప్ప తిప్పలు పెట్టింది, దాని ఫోటో పక్కన ఇలా వ్రాయండి, ‘సొంత తండ్రి చేతిలో  మాన భంగానికి గురి అయిన స్త్రీ, పోనిలే అని పెళ్ళాడిన భర్తను ప్రియునితో కలిసి చంపి, చివరికి వాడి చేతిలో కూడా మోసపోయి తనువు చాలించింది’ అని ముగించి మళ్ళా పరామర్సుకుల వద్ద చేరాడు.

ఫైల్ మూసేసిన శ్యామల్రావ్ కళ్ళు ఎర్రటి జీరలతో తడిసిపోయి ధారాపాతకంగా కన్నీళ్ళు కారుతున్డగా ” అంటే నా కూతుర్ని నేనే ….” అంటూ ఫైల్ విసిరేశాడు.

అందులోంచి ఒక లేఖ బయట పడింది.

విరించి,

ప్రపంచంలో ఏ అమ్మాయి తండ్రిని మించి ప్రేమించలేదు, మొదటి గురువు, స్నేహితుడు తానే కాబట్టి. కానీ నేను ద్వేషిస్తాను. కారణం ప్రతి అమ్మాయి నా లాంటిదే అని ఆయన అనుకోలేదు కాబట్టి. ప్రతి ఆడ దాన్ని, ప్రతి సమస్యని, ప్రతి మనిషిని సమిధగా చేసి నేను మాత్రమే బాగుండాలనుకున్నాడు. ద్వేషానికి ఇంత కన్నా పెద్ద కారణాలు కావాలా?

నువ్వు నాకు ఎందుకు సహాయ పాడాలంటే కారణం అడిగావు,  ‘ఇంకెవ్వరు తమ పిల్లల బాగు పేరుతో మరో కుటుంబాన్ని నాశనం చేయకూడదు.’ బహుశా ఇప్పుడు నీకు నేను అర్థం అయ్యుంటాను.

ఈ ఉత్తరం నీకే ఎందుకు వ్రాస్తున్నా అంటే నా భావ జాలంతో, భవిష్యత్తులో నువ్వు నీ కూతుర్ని అనుమానించకూడదు అని, ఇది కేవలం ‘సూక్ష్మ చరిత్ర’ మాత్రమే అని నువ్వు తెల్సుకోవాలి.

నేను చనిపోయాకే  ఈ ఉత్తరం నీకు అందచేయాలని మా లాయరు గారిని అడిగాను.

సెలవు.

సూక్ష్మ.

************************************************************************************

 

శ్యామలరావు తన లాయరు ను పిలిచి ఉన్న ఆస్తిని అనాధ శరణాలయానికి వ్రాసి, దస్తా వీజులు అందచేయమన్నాడు. ఆ తర్వాత నెల రోజులకు లాయరు చిన్న బుచ్చుకున్న మొహంతో వచ్చి, ” మీ పాపపు సొమ్ముకి,  మమ్మల్ని c/0 అడ్డ్రెస్స్ చేయొద్దన్టూ ఆస్తి తిప్పి  కొట్టారు, అనాధ శరణాలయం వారు” అంటూ అతడి ముందు నిలబడ్డాడు.

 

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s