శ్రమ- శ్రామికులు- పెట్టుబడుదారులు

ముందు మాట: ఈ శీర్షిక కేవలం నాలో నాకు కలిగిన సందేహాలను అక్షరరూపం లో పెట్టడం మాత్రమే కానీ ఎవరిని కించ పరచటానికో తక్కువ చేయటానికో ఉద్దేశించనది కాదు.

 

: అసలు పెట్టుబడిదారీ వ్యవస్థలో తప్పేవారిది.

: తమ శ్రమను తామే గౌరవించుకోని అవగాహాన లేని శ్రామికులదా, లేక కడుపు కొట్టే పెట్టుబడిదారులదా లేక ఒకరి శ్రమను ఇంకొకరు దోచుకు తినే తోటి శ్రామికులదా?

: అసలు నిజమైన శ్రామికుడంటే ఎవరు? తను సంపాదించిన సొమ్మును ఇంటికి కూడా తెస్సుకెళ్ళకుండా తాగి తందానాలు ఆడే వాడిని మనం శ్రామిక వర్గం లోకి పరిగణించాల లేక వ్యతిగత స్వేచ్చ పేరుతో మండలోకి తోసేయాలా..?

: పెట్టుబడిదారునిది  శ్రమ కాదా, పెట్టుబడి, మెదడు తన శ్రమ అన్నీ పెడితే ఒక పెట్టుబడి దారుడు అవుతాడు, నష్టానికి లాభానికి తండే పూర్తి బాద్యత తీసుకుంటాడు. ఇన్ని చేసిన ఆస్తాడు నిజమైన శ్రామికుడిని ఎందుకు గుర్తించలేడో మిలియన్ డాలర్స్ ప్రశ్న గానే మిగిలిపోతుంది.

:ఇక పోతే కాసేపు పూర్తిగా శ్రామ్కా శక్తి మీద 100 శాతం జాలి, దయ, హక్కుల దృస్టీ తో చూస్తే నిజంగా పెట్టుబడి దారుడు అంత రాక్షసుడా? ఎందుకంటే శ్రామికుడి చెమట బయటకు కనబడుతుంది, ఇతడి మానసిక కష్టం కనబడదు కాబట్టి.

శ్రామికుడు నిజంగా కష్ట జీవి ఒప్పుకోవాల్సిందే, తాను అగ్ని లో కాలిపోతూ తన యజమానిని, మలయా మారుతంలో విహరింప చేస్తాడు. మరి తాను నిప్పుల్లో కాలుతున్నందుకు ఎందుకు ముందుగానే యజమానితో చర్చించి తనకు కావల్సిన మొత్తం గురించి చర్చించడు. కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎక్కడైనా బతుకుతాడు, మరి మొహమాటం దేనికి, తన మీద తనకి నమ్మ్కమ్ లేదా, లేక నా వెంక జెండా పట్టుకున్నోళ్ళు ఉన్నారానా?

నిజంగా శ్రామికుల మీద ప్రేమ కారి పోయే ఈ రచయ్తలాంత ఎందుకని తమ వాదాన్ని రచనలతో ఆపి సొమ్ము చేసుకుంటున్నారు, మరో అడుగు  ముందుకు వేసి, పుస్తక పరిగ్యనమ్ లేని వారి కోసం కనీసం సంవ్త్సరానికి ఒక్క సారి అయిన శ్రామిక పెట్టుబడి గురించి అవగాహన సదస్సులు జరిపార, మరి ఇది కాదా పెట్టుబడి దారి వ్యవస్థ. సముద్రం దగ్గరకి మానవుడు వెళ్ళవాల్సిందే అన్నట్లు శ్రామిక పెట్టుబడి అనే సంద్రమంత గ్యానమ్ మనకు మన నిత్య జీవిత్మలో ఎందుకు అందుబాటులో లేదు, తన ఉరుకుల పరుగుల జీవిత్మలో, ఖర్చుల ఖాస్టమ్ రగిలే రోజుల్లో పుస్తకాలు పట్టుకుని కుటుంబాన్ని పక్కన ఎంత మండి పెట్టగలరు. అసలు ప్రభుత్వాలు ఎందుకు నిర్ధిస్ట్మైన చట్టాలు చేయటంలో నిరాశ్యం చూపిస్తుంది.

ఇక్కడ నిజంగా పెరుగుతున్న ఖర్చులకు, వస్తున్న జీతానికి మధ్య నలిగేది శ్రామికుడే కాదు ఆ శ్రామికుని నమ్ముకున్న కుటుంబం కూడా. ఎన్నో అవరోధాలు దాటితే ఒక శ్రామికుడు తన పని స్థలాని చేరుకోగలదూ, ఒక ఉద్యోగం సంపాదించగలదూ, తన కుటుంబం ముఖ్య పాత్ర ఏంటో వహిస్తుంది, మరి మనం కేవలం భీమా పధకాల్లో తప్ప అతడి కుటుంబాన్ని ఎందులో పరిగణిస్తున్నాం. ( కొన్ని కార్పొరేట్ సంస్థలు వార్షిక ఉత్సవాల్లో నే కాక ప్ర్తెయ్కంగా వారిని పిలిచి సత్కరిస్తారు, అయితే కొన్ని కంపెనీలు మాత్రమే) ఇంత చేస్తే యజమానికి నష్టం వాటిల్లగానే కార్మికుడు ముందుగా తీసేవేయబడతాడు. మరి అతడి కుటుంబం కూడా శ్రామికులే పరోక్షంగా, ఈ యజమానికి. ఇది కూడా శ్రామిక వర్గంలో రాదా?

అలాగే పెట్టుబడి దారునికి లాభం వస్తే తనకు వాటా పంచాడు కాబట్టి , శ్రామికుడు ఒక్క నెల ముందస్తు నోటీసుతో ఎంతో పరిగ్యానాన్ని ఆర్జించి తనకు అవకాశం ఇచ్చిన సంస్థను వదిలి వెళ్ళిపోతాడు, ఇది ఒక్క  సంఖ్యలో ఉంటే పర్వాలేదు, కానీ 10 లు, వందల్లో ఉంటే ఆ ఆయజమాని పరిస్డితి ఏం కాను. అతడికి తన సంస్థను విడిచి వేరే చోట చేరే అవకాశం కూడా లేదు కదా?  దీనిని మనం పెద్దగా పరిగణించమ్ కూడా ఎందుకంటే ఇలాంటి పెట్టుబడుదారులు చాలా అరుదు, ఎక్కువగా బాడ్త వర్గం శ్రామికుల వర్గం వారే కనుక. అలాగాని తీసిపారేసిడి కూడా కాదు. మరి అల్లా నెలకో కంపనీ మ్రే వారు శ్రామిక వర్గం వారు అవుతారా, కంపనీలో చేరే సమయ్మ్లో వారికి టీకనే చేరేది. ( వీరికి అన్నీ సదుపాయాలు లబించవు, కానీ కంపనీ తర్ఫీదు పేరుతో సమయ్మ్ వృధా చేసుకోవాలి) .

ఇక పోతే పెట్టుబడి దారుడు, తననే తన సంస్థను నమ్ముకున్న నిజ్మైన శ్రామిక వర్గాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తాడో అసలు అంటూ పట్టని ప్రశ్న,  వదిలి వెళ్ళిపోయే వారిని శత్రువులుగానో, తాననే నమ్మిన వారిని వేరే చోట వృత్తి సదుపాయం లేని చాత గాని వారిగానో పరిగణిస్తారు. ఎందుకని?

పెట్టుబడి దారులు, శ్రామికుల మధ్య రోజు రోజుకు, మారుతున్న కాలానికి తగ్గట్లు పెరుగుతున్న అగాధం దేని వల్ల పూడుతుంది, పెట్టుబడి-శ్రమ మద్య  అసమాంత ను ఎలా అధిగమించగలము.  ఆర్దిక అసమానతలను తొలగించాల్నటే ఎవరు ఎక్కువ భూమిక పోషించాలి, శ్రామికుడ, పెట్టుబడి దారుడా? ప్రభుత్వామా.

ఇందులో బార్టర్ సిస్టమ్ ఎంత వరకు సహాయ పడగలదు, అసలు శ్రమకు విలువ కట్టడం పెట్టుబడి దారునికి నిజంగా అంతా పెద్ద సమస్య? ఎందుకని తీసుకున్న పనికి పూర్తి మూల్యం చెల్లించకుండా శ్రమకు విలువ లేదంటాడు. ఎక్కువ మండి శ్రామికులు వుండటం, తక్కువ మండి పెట్టుబడిదారులు వుండటం చేత, అందుకే కాదా.

అలాంటప్పుడు ఇది శ్రామికుడికి ఎంత గొప్ప వారం, కొద్దిగా అళోచిస్తే, నలుగురు కలిసి ఆలోచిస్తే, పెట్టుబడి దారి వ్యవస్థ కూలిపోతుంది మరుక్ష్ణం. పెట్టుబడిదారుడు శ్రామికుని ఆకలి విలువ పసి కట్టి తన క్మప్నీలో పని చేసే ఇద్దరి వ్యక్తుల మధ్య వ్యాపార్ వైరం సృస్టిశాడు, కానీ వారిద్దరు అది గ్రహించకుండా తాను ముందుగా యజమాని మెప్పు పొందాలని, ఒకరి మీద ఒకరు పన్నాగలు పాన్నుకుని తేలేవీ మీరీ ప్రవర్తించి సాటి శ్రామికుని పొట్ట కొడతారు. మరి ఇది శ్రామికుని తేలేవీ వెహీనత తప్ప, ప్రభుత్వ లోపం అన లేము కదా, పెట్టుబడి దారుని తెలివి అనగలమే తప్ప, శ్రమ దోపిడి అనలేము కదా! ఒక శ్రామికుడ్ని మరో శ్రామికుడు దోచుకుంటుంటే అందులో పెట్టుబడిదారుని తప్పేముంది. మీలో ఐకమత్య లోపం ఉంది. నా తోటి వాడి కడుపు నేను కొట్టాను అని నువ్వాన్న్టే అక్కడే కూలిపోయింది కదా పునాడులతో సహ పెట్టుబడి దారి వ్యవస్థ. దీనికి ఇన్ని పుస్తకాలు రచనలు అవసరమా?

మన లో ఉన్న మానవతా దృక్పధం అలాంటిది, పక్క వాడిని తోక్కేసి అయిన పైకి రావాలి అనే భావనా, శ్రామికుల్లో ఉన్నంత కాలం కళ్ళెం పెట్టుబడిదారుని చేతుల్లోనే ఉంటుంది. శ్రామిక వర్గం శ్రామిక వర్గం అంటూ మొసలి కన్నీరు కార్చి ఆ తర్వాత పెట్టుబడి దారుల్లో దూరిపోయే రచయతలు మామూలు గానే ఉంటారు.

నిజమయిన శ్రేయాఓభిలాషి మీకు హక్కులు మాత్రమే గుతూ చేయాడు, బాద్య్తలు కూడా అప్పగిస్తాడు కదా? ఒప్పుకుంటారా?

శ్రామికుల బాద్యత మానవతా ధృక్పధం పాటించటమే. తన శ్రమకి ఎంత విలువ ఉందో అంటే విలువ తోటి శ్రామికుంది అని గుర్తించాలి, పెట్టుబడి దారుల వల లో చిక్కుకోకుండా సమయం వచ్చినప్పుడు మాంవత కోనంతో ఆలోచించగలగాలి. ఇవాళ అతడితో నన్ను పోల్చి అతడిని అన్యామ్ చేస్తే రేపు నాకు ఆ గేట్ పట్టించడ అనే చిన్న ఆలోచన … శ్రామికుల శక్తి ని చాటి చెప్తుంది తప్ప, మీ వెంక ఉండే జెండా కర్రలు కావు…..

ఇలా అల్లోచిస్తే పెట్టుబడిదారునికి మేలు జరుగుతుంది నమ్మకస్తులు శ్రమను పెట్టుబడిగా పెట్టె పార్త్నెర్స్ దొరికినందుకు,  అంతే కాదు నిజంగా శ్రమ దోపిడి చేసే వ్యవస్థ మెదడుకు మేత లేక దిగి రాదా, మీ కోసం…

 

ఒక  శ్రామికురాలు.

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s