పరివర్తన

“చిన్న అనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను తప్ప ఎవరిని కల్లో కూడా చూడనని మాట ఇస్తున్నాను.” అంటూ గట్టిగా అరుస్తుంటే ప్రతి ధ్వని మరలా మరలా వినబడి కిల కిల నవ్వుతోంది శశి, ఐ‌ఏ‌ఎస్ ఆఫీసర్.

“సొ, ఇవాళ నా ప్రమాణ స్వీకారానికి వచ్చావన్న మాట” అన్నది చిన్నా కేసి చూస్తూ.

రాకపోతే? ముక్కు మొహం తెలీని వాళ్ళ ముందు ప్రమాణం చేస్తే అర్థం ఎముటుంది అని  నేను పక్కన ఉండి నిన్ను ప్రమాణం చేయిద్దామని వచ్చాను , కానీ ఎక్కడ? మాడమ్ స్టేజీ మీద, మనం జనoలో, ఒక మూల…”

“సరే , ఒప్పుకుంటాను తప్పు అయిపోయింది అని, రేపు వస్తున్నారు కదా సార్, మా నాన్న ని కలవటానికి.”

“అయ్యో ఎంత మాట, ఇంత బతుకు బతికింది, ఆయన చేతిలో కూడా నాలుగు తిట్టించుకుందామనే కదా?”

“చిన్న, నిన్నూ.. be serious ok, చెప్పు వస్తున్నావ్ కదా!?”

“మాడమ్ మీరు నిశ్చింతగా వెళ్ళండి.”

“అది సరే మీ అమ్మ గారికి ఏ కలర్ అంటే ఇస్టమ్, కొత్త చీర రేపటకి రెడీ చేయాలి కదా..?”

“చూడు ఐ‌ఏ‌ఎస్సు! నేను ఇంటికెళ్ళి నీకు ఫోన్ చేస్తాను. ఈ లోపు నువ్వు మీ నాన్న దగ్గర నా గురించి కాస్త డబ్బా కొట్టాలి, ఉన్నవి లేనివి కల్పించి.”

“డబ్బానా? , నీకేంటి అవసరం, నువ్వు బంగారానివి. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడివి, తల్లి అంటే అభిమానం. మా నాన్నకు ఇవే కావాలి.డబ్బు ను నమ్మరు, నన్ను బాగా చూసుకుంటావా లేదా అని మాత్రమే ఆయన చూస్తారు. ఆయన రిటైర్డ్ జడ్జి, నీకు తెల్సు కదా…”

“నువ్వు ఆ మాత్రం నమ్మకం ఇవ్వు, నేను చూసుకుంటా మిగితాది”

****************************************************************

చిన్న వస్తున్నాడని శశి చేస్తున్న హడావిడికి వాళ్ళ  నాన్నకి  కాళ్ళు  చేతులు ఆడలేదు, ” నా కూతురు ఎప్పుడు ఏ చుట్టం వచ్చినా బుక్ పట్టుకు కూర్చుంటుంది, అంటే చిన్న అనే దొంగ, నా కూతురిని నా నించి లాగేసుకున్నాడన్న మాట” అంటూ అశూయ వ్యక్త పరిచాడు శశి తండ్రి రామ నాధం గారు.

“నాన్న! కాబోయే అల్లుడిని దొంగ అంటారా?! ఎంత జడ్జి అయితే మాత్రం, అతడు చాలా ఉత్తముడు, ఎంతైనా మీ కూతురి సెలెక్షన్. నమ్మి తీరాలిసిందే.”

“నా కంటేనా అన్నాడు ఆయన కళ్ల లో నీళ్ళతో.”

“My dear jealous boy, u r my first hero” అన్నది చిరు నవ్వులతో..తండ్రిని బుజ్జగిస్తూ..

“ఆ అబ్బాయి వచ్చాక ఇదే మాట చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాను”  అన్నాడు ఆయన ఆనందం పడుతూ.

చిన్న వచ్చాడు ఇంతలో ..వారి ఇద్దరి సంభాషణ మధ్యలో, “సారీ, డిస్ట్రబ్ చేసినందుకు అన్నాడు” చాలా పొలైట్గా.

“మీ అమ్మ, నాన్న గారు ఎక్కడ? కార్ లో నే ఉన్నారా? నేను వెళ్ళి పిలుచుకు వస్తా..” అంటూ ఆమె పరుగెత్తపోయింది.

కానీ అతడు ఆమె చేయి పట్టుకుని ఆపేశాడు. “అవశరం లేదు, వాళ్ళు రారు” అన్నాడు స్పస్టంగా…

రామనాధం గారు చిన్నా మొహం చూసి కంగారూ పడిపోయి, “నేను జడ్జి నని కట్నాలు ఇవ్వనని బాధ అక్కర్లేదు బాబు, నాకున్నది ఒక్కత్తే కూతురు, దాని సంతోషమే నా సంతోషం” అన్నాడు.

“నన్ను క్షమించండి. ఇందులో కట్న కానుకల ప్రసక్తి లేదు, నాకు తల్లి, తండ్రి ఎవరు లేరు, నేనొక వీధి రౌడీ ని, శశి ప్రేమకు ఎక్కడ దూరం అవుతానో అని మాత్రమే ఆమెకు అబద్దాలు చెప్పాను, నేను 5 వ తరగతి వరకే చదివాను. కానీ శశి వచ్చాక మారటానికి నా సాయ శక్తుల ప్రయత్నిస్తున్నాను. ఆమెకు అబద్దం చెప్ప గలిగాను కానీ, ఇందాక మీ ఇద్దరి సంభాషణ విన్నాక మిమ్మల్ని  మోసం చేయాలనిపించలేదు. ”

రామనాధం గారు అవాక్కయిపోయి ” నా కూతురు ఐఏస్ పాస్ అయిందంటే తెలివి కలదని అనుకున్నాను” అని మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు.

శశి జరిగిన మోసానికి నమ్మలేనట్లుగా నిల్చుండిపోయింది.

” శశి నిన్ను నమ్మించటానికి ప్రయత్నించను  ఇప్పటి నించి.  శశి, మంచి భర్తగా ఎలా ఉండాలో నాకు చెప్పే వాళ్ళు  ఎవరు లేరు. అందుకే అలా చేశాను, కానీ అసలు తండ్రి ప్రేమ అంటే ఏన్టో, ఇందాకటి ఆయన మాటల్లోని అసూయలో చూశాను, నీ కోసం మొత్తం ఆస్తి ఇస్తాను అని ఆయన పడే కంగారులో చూశాను.మోసం చేసి పెళ్ళి చేసుకొనే ఖర్మ నాకు పట్టలేదు, నా గురించి నువ్వు నిజంగా గర్వంగా చెప్పుకొనే రోజు వస్తుంది. నువ్వు, మీ నాన్న ఎదురు చూడగలిగితే… నా కోసం” అన్నాడు చిన్నా.

“ఎదురు చూడను. నువ్వు దెబ్బ తీసింది నా నమ్మకం కాదు, నా మీద మా నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని.” అన్నది నిక్కచ్చిగా.

“నీ  కోపంలో అర్థం ఉంది, నువ్వు మంచి దానివి కాబట్టి నాకు సమాధానం ఇచ్చావు, అదే నేను నీ స్థానంలో ఉంటే నే పెరిగిన వాతావరణానికి పొడిచేసే వాడిని, వస్తాను మళ్ళీ.” అంటూ వెళ్ళి పోయాడు అతడు.

***********************************************************************

చిన్న శశి మీద పెంచుకున్న ఆశలు ఎంత పెద్దవో, ఆమెను అందుకోవాలంటే తను పడాల్సిన కస్టమ్ కూడా అంతే పెద్దది. మేడ మీద నిల్చోని అస్తమిస్తున్న సూర్యూడిని చూస్తున్నాడు అతడు.

వెనక నించి తన జాన్ జీగ్రి దోస్త్ అమృత్ వచ్చి, ” మామ! పెళ్ళి కి మామగారు ఒప్పలే అంట గదనే, నే చెప్పలా, మన లాంటి వాళ్ళకి  అవి పడవు అని. అబ్బో సూట్ వేసుకున్నా ఒప్పలేదా? కానీ నువ్ మస్తుగా కొడ్తున్నవ్ ఇందులో. జల్ది వాపస్ ఇవ్వు లేదంటే కిరాయ్ ఎక్కువ అవుతుంది,” అని గట్టిగా నవ్వుతున్నాడు. .ఎగతాళిగా.

“రే, ఇక్కడ శశి గురించి టెన్షన్ రా నాకు . నీకు మజా గా ఉందా..?”

“చాల్లే ఆపరా, నిజంగా నీ మీద మసుంటే, నీ కోసం ఎదురు చూడ, పో !అంటదా? ”

“ఆరే నీ అసలు పేరేంటి. అమృతానంద చారి. అన్నీ బాగుంటే శశి తో సమానంగా ఉండే వాడివి. నాతో ఎందుకు కలిశావ్, లంచం తీస్కోని నీకు రావలసిన జాబ్ వేరొకడికి ఇచ్చినందుకు. సంఘం మీద కసితో  మాలో చేరావ్, కానీ ఇది నీకు నిజంగా నచ్చిందా. నువ్వే తన అల్లుడని నీకు పదేళ్లప్పటినించి చెప్పిన మావయ్య, ఇప్పుడు నిన్ను మీ అమ్మని పండగలకు కూడా పిలవడు. ఎందుకు? నువ్వు రౌడీ అయిపోయినందుకు. తప్పులు అందరం చేస్తాం రా, కానీ మారాలనుకుంటే ఎందుకురా వెనక్కి లాగుతారు?

“అబ్బో నీకో పోరి దొరికిందని, మేమంతా మారాల?”

“నీ పోరి నిన్ను కాదన్నదని, నేను రౌడీగా ఉండి పోవాలా?”

“మామ! ఏం మాట్లాడుతున్నావ్, విడ్సిపెట్టు, ఈ పోరులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, మన దోస్తానీ లైఫ్ టైమ్ గారెంటీ.”

“అమృతా ! ఆపు.  నీకున్న లోకం మీద కసి తో, మారాలనుకున్న నన్ను కూడా నీ జీవితం చూబించి వెనక్కి లాగకు. నాకు శశి కావాలి, ఆమె కుటుంబంలో నేను ఒక భాగం కావాలి. కావాలంటే నువ్వు నాతో కల్సిపో. ”

“ఈ మాటలు ఆ రోజు చావపోతున్న నన్ను రక్షించినపుడు చెప్పలేదే? ఇదే కుటుంబం గురించి పట్టించుకోవద్దని, కత్తి నా చేతికి ఇచ్చి ఆ ఆఫీసర్ని పొడిచి పొడిచి చంపినపుడు చెప్పలేదే.?

“అప్పుడు శశి లేదు నా జీవితంలో… నాకు జీవితం విలువ తెలియలేదు”.

“నేను అమ్మని, పిల్ల నిచ్చే మామని కాదని నీ దగ్గరకొచ్చా మామ. ఇల్లొదిలి నీతో పాటు ఫుట్పాత్ మీద పండినా. తులసి తీర్థం తాగే నేను మందు కొట్టిన. ఇప్పుడు పోరి కోసం అన్నీ వదిలిపోతావ.”

“రేయ్ నేను నిన్ను వదలను, నా వృత్తిని వదిలేస్తాను.”

“ఓహ్! ఆవిడ పెద్ద ఆఫీసరు, నిన్ను రక్షించుకుంటుంది, మరి మా గురించి ఎవరు ఆలోచిస్తారు.”

“రేయ్ ఆ అమ్మాయి అందరికీ ఉద్యోగాలు ఇవ్వటానికి కల్ప తరువు కాదు. మనం కస్ట పడదాం. సొంతంగా వ్యాపారం పెడదాం”.

“ఏమన్నావ్, వ్యాపారమా. ఒక చేయి పోయింది, మొన్నటి బంద్ లో, నీ మీద కాల్పులు జరిపితే అడ్డు పడ్డందుకు.  నాకు ఐ‌ఏ‌ఎస్ కూడా వద్దు. వ్యాపారం కూడా వద్దు. మోసం చేసే సమాజాన్ని కాలుకి  కాలు కీలుకి కీలు తీస్తేనే తృప్తీ గా నిద్ర పడుతుంది,  32 యేళ్ళు చదివిన చదువు, ఏ నాడు అన్నం పెట్టలా, నాకు.”

“అమృత్, నీ బాధ నాకు అర్థ అయింది. జరిగింది మర్చిపో. నీకు నేను తోడుగా ఉంటాను.”

“వద్దు మామ, ఐఏస్ చదివి ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయాలనుకున్న, కానీ దానికి పరీక్షలు, తెలివితేటలు, లంచాలు, కాళ్ళు పట్టుకోవటాలు ఉన్నాయి. నాకు అంత కన్నా రౌడీ గిరి చేసేది సులువుగా వుంది. అన్న! అని ఎవరన్నా పోరి సహాయానికి పిలిస్తే, ఆ నీచుడ్ని గల్లా పట్టి గుంజి రోడ్డు మీదకు ఈడ్వచ్చు. కానీ గౌరవం అనే చట్రపు జీవితం లో అట్లా చేయలేం మామ. భయపడాలి. చివరికి మన సిద్ధాంతాలు వదులుకోవాలి.”

“అందులో ఒక నీతి ఉంది, నీకే బాగా తెల్సు అమృత, నా కన్నా ఎక్కువ నువ్వే చదువుకున్నావ్.”

“ఈ దోవ నువ్వే చూపినావ్ మామ, నాకు ఇదే సులువుగా ఉంది. ఇంక కస్ట పడలేను.అలాగే నిన్ను వదులుకోలేను. కావాలంటే ఆ సైదులు గాడు మోసం చేసిన పిల్ల ఉంది కదా, దానికి ఇప్పుడు నువ్వన్టే మనసంటా.. ఆ పిల్లకి బతుకును ఇవ్వు, అంతే గాని శశి తో జీవితం మర్చిపో.”

“చాల్లే ఆపారా, ప్రేమ అంటే వీడిని కాకపోతే, వాడిని పొడిచి పని అయిపోగొట్టటం లాంటిది అనుకున్నావా?”

“అంటే మాతో కలవను అంటవ్.”

“మీరు నాతో కలవండీ అంటున్నాను”.

“మర్చిపో మామ, మమ్మల్ని. నయం ఇంకా నేను పోరి లెక్క పుట్టలే. లేదంటే నిన్ను నేను కూడా ప్రేమించి మోసపోయేటోడ్ని.”

వదిలి పోతున్న పాత మిత్రుడి మూర్ఖత్వం చూసి నిట్టూరుస్తూ తన ముందు జీవితం గురించి ఆలోచనలు మొదలెట్టాడు చిన్న.

*****************************************************************************

శశి కాన్వాయ్ వెళుతున్న వీధిలోనే ఒక పాత కూరలు,పేపర్లు, చాక్లెట్లు అమ్ముకొనే కొట్టు పెట్టుకున్నాడు చిన్న.

చాలా కస్టపడితే గాని డబ్బు రాదు. తన పాత అలవాటు ప్రకారం కోపంతో, రెండు సార్లు బేరాలాడిన కస్టమర్ల పై చేయి చేసుకోబోయి తమాయించుకున్నాడు. అసలు అతని పాత జీవితం చూసి పిల్లలు, ఆడవారు అతని కొట్టు వైపు  రావటానికే జంకుతున్నారు. కొందరు పాత శత్రువులు నిజంగా, మారావా? లేక పాత పేపర్లలో గన్నులు రవాణా చేస్తున్నావా” అని రెచ్చగొట్టినట్లు మాట్లాడారు. వ్యాపార పని భారం కన్నా తను మారాలంటే మారనివ్వని జనం వ్యతిరేకత అతనికి చాలా కష్టంగా వుంది. అన్నిటి కన్నా శశి కాన్వాయ్ లో నించి చూసి కూడా తెలీనట్లు వెళ్ళిపోవటం మరింత బాధగా వుంది.

సైదులు మాజీ ప్రియురాలు, జరీనా రోజు వచ్చి అతనికి టిఫిన్ బాక్స్ ఇస్తోంది.. అతను సున్నితంగా తిరస్కరిస్తున్నాడు. ఆమె, అతడితో “అమృత నీకు నా గురించి తప్పుగా చెప్పాడు, నాకు నువ్వు అన్న లాన్టోడివి, నీ లాగానే నాకు ప్రేమ అంటే గౌరవం, సైదులు తిరిగి వస్తాడని నా నమ్మకం, అని బాక్స్ అతని ముందు వుంచటంతో అతడు స్వీకరించాడు.అప్పటి నించి  జరీనా ను తన చెల్లిగా తనతోనే తన వ్యాపారంలో కలుపుకున్నాడు.

అమృత్ కు , చిన్న వెళ్ళటమే కాకుండా తనతో పాటు జరీనా ను మార్చేయటం చాలా బాధగా అనిపించింది. “కాస్త వండి పెట్టె మనిషి మా రౌడీ మూకలకి, ఇప్పుడు మా వైపు చూడట్లేదు” అని , చిన్న  మీద విరిచుకు పడ్డాడు షాప్ దగ్గర.

చిన్న మాట్లాడకుండా తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. జరీనా,  “నా చేతి కూడు తినాలంటే అందరూ చిన్న అన్నయ్య లాగా మారండి”, అన్నది పేపర్లు అన్నీ సర్దుతూ.

“మార్చేశావా? ఈమెను కూడా? అందరినీ మార్చేస్తావా? చిన్నా? నువ్వు రౌడీ అయిపో అంటే అయిపోవాలి, ఇవాళ నీ పోరి కోసం మంచిగా మారిపో అంటే అందరం మారిపోవాలి, లేదంటే మా నోటి కాడా కూడు లాగేస్తావు అంతే కదా!” అని చిన్న కేసి రెచ్చకొట్టినట్లు మాట్లాడాడు అమృత.

” అరే!మాట్లాడుతోంది నేను, మధ్యలో అన్నతో ఎందుకు గలాటా, పో ఇక్కడి నించి” అని అరిచింది జరీనా.”

వాళ్ళు వెళ్ళటంతోనే చిన్న పూర్వపు శత్రువు, గణేష్ వచ్చి, “నువ్వు ఎందుకు మారినవ్రా? మా అమ్మ, పోరి, అందరూ మమ్మల్ని మారమని పరేషాన్ చేస్తున్నారు. సరే, ఏం చేయాల్నో చెప్పు, ఎంత పెట్టుబడి పెట్టాలో చెప్పు” అన్నాడు.

“నిజంగా చేస్తావా? నమ్మి చెప్తాను” అన్నాడు

“చేస్తాను చెప్పు, ఇంక  రౌడీశమ్ వద్దు మనకి. రోజు ఎవడు ఎక్కడి నించి చంపుతాడో అని బిక్కు బిక్కు మంటూ బతికే జీవితం వద్దు, అమ్మకి గర్వంగా  సంపాదించిన పైసలు ఇవ్వలేము, పోరితో కాసేపు ప్రశాంతంగా మాట్లాడలేo.. నాన్న గర్వంగా చెప్పుకోలేడు, ఏం చేస్తాడు నే కొడుకు అంటే.  చెల్లికి మంచి ఇంటి నించి సంబంధాలు రావు మన వల్ల. అందుకే నీ బాటే నా బాట.” అన్నాడు.

“పెట్టుబడి- కాసింత మానవత్వం,  పని- మారాలనుకొనే వారికి చేయూత నివ్వు. ”

అంతేనా?

“అంతేనా కాదు, మారి తిరిగి పాత జీవితం వైపు చూడకూడదు.”

“అలాగే చిన్న, ఆ పాపపు సొమ్ము ఇందులో పెట్టను, పొలం చూసుకుంటాను, నాన్నకి వెల్డింగ్ షాప్ లో సాయం చేస్తాను. నీ లాంటి వాళ్ళు మాకు కావాలి భయ్యా” అని పశ్చాత్తాపం తో కన్నీరు పెట్టాడు.

సరిగ్గా అదే సమయానికి శశి వారిని చూసింది, కానీ మౌనంగా వెళ్లిపోయింది.

**************************************************************************

జోరున వర్షం పడుతోంది. చిన్నా షాప్ దగ్గరకు వచ్చి  అమృత ” మామ! ఇవాళ శశి పెళ్ళి అంట కదా, నడిచిపోతోంది అక్కడ, రా! అని హడావిడిగా కార్ ఎక్కిచ్చుకొని తీసుకెళ్ళాడు, చిన్నాని. జరీనకి అనుమానం వచ్చి శశి ఇంటి వైపు పరుగు తీసింది చేతిలో పని వదిలి పెట్టి.

కొంత దూరం తర్వాత దారి మళ్ళించి చిన్నాని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్ళి “మరియాదగా మళ్ళీ మాతో చేతులు కలుపు. అందరినీ మార్చేస్తే, సుఖానికి అలవాటు పడ్డ మా లాంటి వాళ్ళు ఎక్కడికి పోవల,” అని హింసించాడు చిన్నాని.

“నేను మారిపోయాను, నువ్వు చంపినా తిరిగి ఆ బురదలోకి రాను” అని ఖచ్చితంగా చెప్పేశాడు చిన్న.

అమృత పక్కనే తనతో గతంలో లావా దేవీలు జరిపిన ఎస్.ఐ., చిన్న చేయిని షూ కాలితో తొక్కుతూ, “మారటమేన, లేక మా విషయాలు కూడా శశికి చెపుతావా?” అంటూ బెదిరించాడు.

“సర్, ఇప్పటి వరకు జరిగింది మర్చిపోయి, ఇక్కడి నించి అయినా మనం మారిపోదమ్, మనుషుల్లా బతుకుదాము.”

“నువ్వు రెండు సార్లు జైలుకేళితే, నా ఉద్యోగం పణంగా పెట్టి నిన్ను విడుదల చేయించింది, నీతో పాటు పాత పేపర్లు అమ్ముకోటానికి  కాదు. శశి చాలా స్ట్రిక్ట్, నీ దగ్గర నించి అందరి విషయాలు రాబట్టి మమ్మల్ని ఇరికిస్తుంది.నోర్మూస్కోని పాత దంధాలోకి దిగు, అమృత గాడు నీ మీద ఒక కన్ను వేసి ఉంచుతాడు,” అని హెచ్చరించాడు.

“ఒక్క సారి చెప్తే వినబడదా మీకు” అన్న చిన్నా ని,” పాయింట్ బ్లాంక్ రేంజీ లో గన్ పెట్టి కాల్చటానికి సిధ్ధ పడ్డాడు, ఎస్.ఐ.

సరిగ్గా అప్పుడే అతడి చేతి మీద బుల్లెట్ తగిలి నెత్తురు చిమ్ముతూ అవతలకి పడ్డాడు ఎస్.ఐ.

ఆశ్చర్యపోయిన చిన్న, అమృత, బుల్లెట్ సౌండ్ వచ్కిన వైపు చూడగా అక్కడ రామనాధం గారు, డెప్యూటీ కమీషనరు గారు, జరీనా పోలీసు వ్యాను పక్కన నుంచోని ఉన్నారు.

డి.సి. గారు, ఎస్.ఐ ని చూసి ” ఒక వ్యక్తి మారాను మొర్రో వదిలేయండి, అంటే చంపటానికి సిధ్ధపడ్డ నిన్ను డిస్మిస్ చేస్తున్న”  అని ఆంబులెన్స్ కి  ఫోన్ చేసి, చిన్న ని, ఎస్.ఐ. ని అందులో పంపాడు. అమృతను చూసి “చదువుకొని అక్షర జ్ఞ్యానమ్ లేని  వాడి కన్న హీనంగా,  సులభ సంపాదాన కోసం నిన్ను కాపాడిన వాడినే చంపటానికి ప్రయత్నిస్తావా” అని జైలు లో పెట్టాడు.

*********************************************************************

రామనాధం గారు చిన్నా తో  “నువ్వు, నా కూతురి కోసం మారావు అనలేను. నువ్వు నిజంగా పరివర్తన చెంది జీవితం విలువ తెల్సుకున్నావ్, మరొకరిని మార్చావ్. మా జడ్జీలు, ఐఏఎస్ లూ కూడా సమాజ పరివర్తన కోసమే పాటు పడతామ్. నీకు డిగ్రీ పట్టా లేదని ఒదులుకోలేను” అని “శశి నీ భార్య అని” మాట ఇచ్చాడు.

చిన్నా మాత్రం ” శశి, నన్ను తన భర్త అని చెప్పుకొనే స్థాయి వచ్చిన నాడే ఆమెను భార్యా గా స్వీకరిస్తాను” అని శశి వైపు చూసి వెళ్ళబోయాడు.

శశి అతడిని చూస్తూ  “నేను ఎందుకు ఎదురు చూడాలి” అన్నది చిరు కోపంగా…

అతను “చిన్నాలా ప్రేమించే వాడు దొరకడు కనుక” అని వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి చూడకుండా.

**********************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s