రాజ దక్షత

“నా దారి విడువుము కన్యోత్తమా!నన్ను వెళ్ళనీ. నేను నడిచే దారి విభిన్నమైనది.మీకు అర్థం కానిది” అంటూ మిరమిట్లు గొలిపే ఆమె అందం అతడి చిత్తమును  చెదరనీయకుండా భృకుటి ముడి వేశాడు.

“మిమ్మలిని కలిసింది యధాలాపమైనా మా రాజ్యానికి మీ లాంటి వాళ్ళ అండ చాలా అవసరం. దయ ఉంచి మృడేశ్వర సామ్రాజ్యానికి వచ్చి మా ప్రజలను,  మీ సూక్తులతో చైతన్య వంతులను చేయవలసిందిగా నా మనవి సాధోత్తమా!” అన్నది రాణి వత్సలా దేవి.

“క్షమించండి, మీరు అనుకున్న అంత గొప్ప వాడిని కాను. పుట్టుకతో గంధర్వుడయిన నేను మానవాళి అభివృద్ధిని ఆశించి, నా మహిమలు విడచి భూలోక వాసిని అయినాను. కానీ అవివేకుల వల్ల వివిధ రాజ్యాలలో, నా పరువు భంగపరుచుకొని సన్యసించి కొన్ని సంవత్సరములు కూడా గడిచినవి. ఈ రాజ్య కాంక్షలు నాకు లేవు.”

“మీకు చేదు అనుభవం గుర్తు చేసినందుకు చింతిస్తున్నాము. మృడేశ్వర సాంరాజ్య ప్రజలు సాధువులను ఆదరిస్తారు. వివేకమైన జ్ఞ్యానమ్ కోసం పరితపిస్తారు. అయినా ప్రజలలో అవివేకం మామూలే, కానీ ఆ నెపంతో వారి మీద అలిగి విజ్ఞ్యానాన్ని అందించటం, మానివేయటం  వివేకవంతులకు సముచితం కాదు. ”

“నాకు నీ పలుకులు అమిత శ్రావ్యము గొలుపుతున్నవి. కానీ నా గతానుభవం మరింత పీడిస్తోంది.  అవివేకులతో వివేకులు పోరాడారు. అర్థం చేసుకొనే గుణం  స్త్రీ కి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం..”

“ఒప్పుకుంటాను. పోరాడమని కోరలేదు. మా ఆధ్వర్యంలో ప్రజలను వివేకవంతులు చేసి చైతన్య పరుస్తారని నా అభిలాష. అంతే కాక మీలో ఉన్న పాండిత్యము శిధిలాల పాలు కాకూడదు అని నా ఆకాంక్ష.”

“రాణీ సుమ వత్సలా దేవి, మీ ఔదార్యానికి చలించిపోతున్నాను. మీ అబిలాష ఈరేడుస్తాను. కానీ ఎప్పుడు మర్యాదకు భంగం కలిగినా మాట మాత్రం చెప్పక నిష్క్రమిస్తాను సుమా!” అన్నాడు సముద్ర శేనుడు.

“మృడేశ్వర సామ్రాజ్యం మీ వెన్నంటి వుంటుంది ఎలాంటి పరిస్ద్థితి లో అయినా” అని మాట ఇచ్చింది వత్సలా దేవి..

*************************************************************************

రాణి వత్సలా దేవి 11 రాజ్యాలను ఒక్క చేత్తో గెలిచి  కైవసం చేసుకున్నది అతి చిన్న వయస్సు లోనే.

పదునాలుగు సంవత్సరాలకే ఆమె తండ్రి ఆమెకు రాజ్యాధికారం కట్టబెట్టాడు, ఆమె పై విశ్వాసంతో.

అపురూపమైన లావణ్యం, అపారమైన తెలివి తేటలు, రణ తంత్రాలు, కవితా సాహిత్యం, చిత్ర లేఖనం ఆమె పుట్టుకతో పొందిన గుణాలు.

తన ఇద్దరి చెల్లళ్ళల్లో  కాత్యాయినీ దేవి  వివాహం చేసి, సరళా దేవిని తనకు దీటుగా పెంచుతున్నది ఆమె.

************************************************************************

మంత్రిణి విలాసిని ఆమెకు నమ్మిన బంటు. విలాసినికి, వత్సలా దేవి  అంతగా సముద్ర సేనుడిని ఒప్పించి ఎందుకు తమ రాజ్యానికి తీసుకు వచ్చిందో అర్ధం కాక, ఆమెను నేరుగా విపులీకరించమని కోరింది.

అందుకు వత్సలా దేవి వివరిస్తూ, ” ప్రస్తుతం మన మృడేశ్వర సామ్రాజ్యం 11 భాగాలైన , వైవిధ్యమైన సామ్రాజ్యాల సమ్మేళనం. ప్రజల లో ఒకరంటే ఒకరికి సరి అయిన అవగాహన లేదు. వారి జీవన శైలి, మనో భావాలు ఒకరి తో మరొకరికి పోలికలు లేవు. భిన్న వాద ప్రతి వాదనలతో రాజ్యం అట్టుడికి పోతోంది. ఒకరిని ఒకరు గౌరవించుకోలేకపోతున్నారు. ఇలాగే కొనసాగితే  మన రాజ్యం లో అశాంతి, అస్థిరత చోటు చేసుకుని, పొరుగు రాజ్యాల ముందు మనము మోకరిల్లే అవకాశం సమీపంలోనే పొంచి ఉంటుంది.

బాహ్య శత్రువులను నేను జయించగలను. కానీ ప్రజలలో ఉన్న అంత: వెభేదాలను తొలగించటం అంత సులువు కాదు.

సముద్ర శేనుడు ఎన్నో చోట్ల అవమానాలు పొందినా తిరిగి నిలబడిన ధైర్య శాలి. సంవత్సరాల నిరీక్షణ సైతం ఫలించనపుడు కూడా తాన సహనాన్ని కోల్పోని ఒక యోగి. తాను చవి చూసిన ప్రతి బాధను తన నాలుక  చివరి అమ్ముల పొదిలో శస్త్రాలుగా మార్చుకున్న యోధుడు.ప్రతి ఒక్క సంస్కృతిని అవపోసన పట్టాడు. ఎన్నో  అవమానాలు దిగ మింగి అడుసులో పద్మంలా వికసించాడు..

కనుక అతడే ఈ వైషమ్యాలను, ఎక్కువ తక్కువ అసమానతలను  రూపు మాపి సుస్థిరత ను స్థాపించ గల  సమర్ధుడు అని నా ప్రగాఢ విశ్వాసం” అన్నది భవిష్యత్తుని అంచనా వేస్తూ, వత్సలా దేవి.

****************************************************************************

సముద్ర సేనుడు, 6 మాసాల కాలంలో   ప్రజలందరిని, ఒక్క తాటి మీదకు దాదాపుగా తీసుకు వచ్చాడు. అందరికీ ఒకే నైజo అలవడింది, శాంతి నైజo.

*****************************************************************************

“11 రాజ్యాలను  ఒక్క ఆడది, వత్సలా దేవి,  ఏక చత్రాధిపత్యంగా పాలిస్తుంటే, రెండు, మూడు భాగాలను కాపాడుకోలేక సతమతమవుతున్నాం,”  అని ధూమకేతు చిందులు తొక్కసాగాడు.

అతడి గూఢ చారులు ” క్షమించండి ప్రభు, మృఢేశ్వర రాజ్యంలో అశాంతిని రగిల్చిన కొద్ది రోజుల్లోనే, సముద్ర సేనుడు తన సూక్తుల ద్వారా సుస్థిరతను స్థాపించాడు.” అని తలలు దించుకున్నారు.

“ఔరా! అదన్న మాట సంగతి, మూల స్థంభo, మనం కక్కిన కూడేనా, సముద్ర సేనుడేనా?” అని కళ్ళు ఎర్ర చేసి, “తక్షణం అతడితో రహస్య సమావేశం ఏర్పాటు చేయండి” అని ఆదేశించాడు  ధూమకేతు.

**********************************************************************************

యమునా తీరం, సంధ్యా సమయం.

ముందుగా వచ్చిన, సముద్రుడు అస్తమిస్తున్న ఎర్రటి సూర్యుని కేసి చూస్తూ ‘ నిన్ను పరి పూర్ణమయిన భాద్యతా వంతుడివి  అనుకోవాలా? లేక నువ్వు గొప్ప రాజువే అయినా, నీవు  లేని లోటు చూపాలని  వెళుతున్నావని అనుకోవాలా? అని అడిగాడు.

 

వెనక నించి వచ్చిన ధూమకేతు ” నిజం. తన లోటు తెలియాలనే, చీకటికి మనన్ని వదిలేస్తాడు.గొప్ప రాజులకి  మాత్రం ఉండదా కీర్తి కాంక్ష” అన్నాడు ధూమకేతు వెటకారంగా.

” కానీ నాకు మాత్రం ఆయన వేరే రాజ్యాలకు వెలుగులని అందించటానికి వెళ్ళినట్లు అనిపించింది” అన్నాడు అతడితో గతానుభవం గుర్తు చేసుకొని.

“అంటే మీరు వర్తమానంలో అత్యంత సంతుస్టులు అన్న మాట అవునా?” .

“గతం కంటే ఇప్పుడు మిన్న గానే ఉన్నాను” అన్నాడు అతడి దుర్భాషలు గుర్తు చేస్తూ…

“రాజులo,  ఏ కాలానికి తగ్గట్లు ఆ కాలం నిర్ణయాలు  తీసుకుంటాము, భవనాలు నిర్మిస్తుంటే చీమల పుట్టలు పెరికేయటం మామూలే కదా.. అపర పండితులకు  నేను విపులీకరించాల్సిన అగత్యమా?”

“మరి ఈ చీమలతో రహస్య మంతనాలు ఎందుకో?”

“వత్సలా దేవి మీకు ఏ లాభాన్ని ఎర వేసి తన రాజ్యం సుస్థిరం చేసుకుంది.”?

“నేను సన్యసించి కొన్ని సంవత్సరాలు  అయినది. నాకు లాభాపేక్ష లేదు. మానవాళికి సేవ చేసే ఉద్దేశ్యం తప్ప మరోటి లేదు.”

“అది ఒకప్పుడు.మీ దగ్గర ఏమి లేనప్పటి మాటలే మళ్ళీ మళ్ళీ ప్రస్థావించొద్దు. ఇప్పుడు మీ చేతిలో  మృడేశ్వర సామ్రాజ్యపు అధినేత ఉన్నది. ఉన్నది ఒక్క జన్మ, మీరు మీ బుధ్ధికే పెద్ద వారు, వయస్సుకి ఇంకా చిన్న వారే? ఆలోచించుకోండి”.

ధూమ కేతు, ఆలోచనలో పడిన సముద్రుడి భుజం మీద తట్టి, వెను  తిరుగుతూ “ఆమె రాజ తంత్రాలకు, వివాహం ఒక అడ్డు గోడ.  ఆమె ఒప్పుకోనేది లేదు, నువ్వు తప్పుకోక తప్పదు, అస్థిరత ప్రజ్వరిల్లక మానదు” అనుకోని తృప్తి పడి వెళ్ళిపోయాడు.

***************************************************************

సముద్ర సేనుడు తన శయిన మందిరంలో పచారులు చేసి అలసి, ” అవునా! నేను నా ముందు ఉన్న బహుమానం అందుకోలేని  వెర్రి వాడినా?” అనుకోని వత్సలా దేవి ఆంతరంగిక మందిరం వైపు  వడి వడిగా అడుగులు వేసి ఆమె పరి చారికల్తో  ” వత్సలా దేవిని తక్షణమే కలవాలని ” ఆదేశించాడు.

సమయం కానీ సమయంలో అతడు రావటం ఆమెకు ఒక అపశకునంగా తోచింది. అయినా విజ్ఞత తో మరియాద పూర్వకంగా ప్రణమిల్లింది.

నేరుగా అసలు విషయానికి వస్తూ సముద్రుడు “వత్సలా దేవీ! నా సహాయం మీకు, మీ సామ్రాజ్యానికి ఉపకరించింది అని భావిస్తున్నాను” అన్నాడు .

“నిస్సందేహంగా” అన్నది ఆమె.

” మరి మేము కూడా మీ నించి ఆశించుటలో తప్పు లేదని భావిస్తున్నాను. ”

“నిస్సంకోచంగా అడగండి”

“కేవలం రేండే రెండు కావాలి మీ నించి:

మొదటిది : మీరు నన్ను పరిణయం ఆడాలి

రెండవది : నన్ను పట్టాభిషిక్తుడను చేయాలి:”

ఆమె నివ్వెరపోయింది.

“ముని వర్యా! మీకు ఏ గాలో శోక లేదు కదా! మీ పాండిత్యం ముందు నేను ధూళి రేణువు తో సమానం. మీ విజ్ఞ్యత అంటే గౌరవం తప్ప మరోటి లేదు నా దృష్టి లో. మీకు జరిగిన అవమానాల వల్ల నా హృదయం కలచి వేసింది కానీ , ప్రేమ కలగ లేదు మీ పట్ల.

మీ పాండిత్యం శిధిలాల పాలు కాకూడదని పిలిచానే తప్ప రాజ్య దక్షత లేక కాదు, నన్ను క్షమించండి”.

“పోనీ రాజ్య పాలన మీరే చూసుకోండి, నన్ను వివాహమాడి గర్వ భంగం అయిన చోట నా పేరు నిలబడనివ్వండి.”

” ముని వర్యా! మీ హృదయ ఘోష నా చెవులను తాకినది. మిమ్మలిని నేనే ఇక్కడకు ఆహ్వానించాను. కానీ మీ గర్వ భంగాలకు నా భర్త అవ్వటం సమాధానం కాదు, రాజ్య పాలన ఎదురు లేకుండా చేయటమే మీరు వారికిచ్చే అరుదైన సమాధానం. ”

“వత్సలా దేవి! రాజ్యాధికారం కన్నా, మీ లాంటి వీరోచితమయిన స్త్రీ ని పొందటమే నేను వారికి ఇచ్చే సరయిన సమాధానం.”

“క్షమించండి! సనాత ధర్మమయిన వివాహ బంధాన్ని మీ పరపతి కోసం కల్మషం చేయకండి.”

“నన్ను క్షమించండి వత్సలా దేవి, మీ మనస్సును నొప్పిస్తే..నా విజ్ఞ్యత ఎటు వెళ్ళిన్దో కొన్ని ఘడియలు.”

“మృడేశ్వర సామ్రాజ్యం మీకు అన్నీ వేళలలో తోడు ఉంటుందని ఎన్నాడో మాట ఇచ్చాము. సందేహాలను నివృత్తిని చేసుకోవటం నిజమైన పాలక దక్షత. ఇక మీరు విశ్రమించండి.”

*********************************************************************************

సముద్ర సేనుడికి దొరికిన సమాధానాలు అతడిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మబ్బుల్లా కొన్ని సందేహాలు కరిగి పోయాయి. తిరిగి రాజ్య ప్రజలకు దేశభక్తిని నూరి పోయ సాగాడు.

కొన్ని రోజులకే మరలా ధూమకేతు అతడిని అనుసరించి వచ్చి పదే పదే హేళన చేయ సాగాడు

” పేరుకు పాండిత్య పురస్కారం- బంటులతో సమానాంగా ఛీత్కారం” అంటూ

అప్పటి దాకా ధూమకేతు మీద వున్న కోపం ఒక్క సారిగా ప్రజ్వరిల్లి తన విజ్ఞ్యత మరిచి సముద్రుడు అతడిని గాయ పరిచాడు.

రాజ్య ధర్మం ప్రకారం సముద్రుడిని చెరసాలలో బంధించింది మృడేశ్వర సైన్యం. కానీ పరిస్డితి మానవీయతా ధృక్పధంతో యోచించి అతడిని విడిచి పెట్టి పూర్వపు పదవిలో కోన సాగామని కోరింది వత్సలా దేవి.

ఆమె, దక్షతకు, విజ్ఞ్యతకు, దయకు అతడు సమ్మోహితుడు అయినాడు. “ఏమైనా సరే మీరు నన్ను పరిణయం ఆడక తప్పదు” అని వేడుకున్నాడు కాళ్ళ మీద పడి.

చకితురాలు అయిన ఆమె ” మీ పాండిత్యం ఆవిరి అయిపోవటం కడు శోచనీయం” అని చింతించింది .

ఆ మాటలు అతడికి ఆమె మీద మరింత అభిమానాన్ని పెంచాయి.

ప్రజలలో మునుపెన్నడూ లేని రాజ భక్తిని నూరి పోసాడు సముద్రుడు తన సొంత రాజ్యంగా భావించి.

 

ఆమె కీర్తి వేనోళ్ల పొగడ సాగారు, రాజ్య ప్రజలు. అతడి కస్టo గుర్తించిన ఆమె అతడి దగ్గరకు వెళ్ళి ” మీకు మా రాజ్యంలోకి రాగానే మీ వయస్సు గుర్తుకు రావటం, అతి సాధారణ పురుషుని  వలె ప్రవర్తించటం విడ్డూరముగా ఉన్నది. అయిననూ మీ నిజాయితీ మాకు నచ్చింది. అందుకే మా సహోదరి సరళా దేవిని మీకిచ్చి వివాహం చేస్తాం, అర్ధ రాజ్యం అప్పజెప్తాం, అంతోషమేనా” అన్నది.

“నా ఒక్క హృదయం మీ మీద ఉన్న ప్రేమను చూపటానికి సరిపోక, ప్రజల హృదయాల ద్వారా కూడా మీకు నా ప్రేమను అందిస్తున్నాను. ఇక్కడ నాకు ఒక స్త్రీ అవసరo కాదు కావాల్సింది,  వత్సలా దేవి మీద వాత్సల్యం మాత్రమే, సరళా దేవి మాట అప్రస్తుతము.

ఆమె విస్సురుగా ఒరలో ఉన్న  ఖడ్గము తీసి ” మీరు పండితులు అని నాకు మాత్రమే తెల్సు, నా ఖడ్గానికి కాదు అన్నది  హూంకరిస్తూ.చిరునవ్వుతో ..తనకు తానే శాంతిస్తూ .. “ఏమైపోయినవి మీ పరిణితి, సాధు జీవనం” అన్నది

“మీ చిరునవ్వుల తాకిడికి చితికిపోయినయాయి” అన్నాడు ఘంభీరంగా.

“ఒక ఆడ దాని అందానికి దాసోహం అనే కొన్ని సంవత్సరాల కృషి, పాండిత్యం మరియాదకు నోచుకోవు అని గుర్తించన్డి. .”

“క్షమించండి. నా పాండిత్యం, కొన్ని సంవత్సరాల కృషి, మనో నిబ్బరం దాసోహం అయినది ఒక స్త్రీ అందానికి అనుకుంటే మీరు పొర బడ్డారు. ఒకే జీవంలో కలగలిసిన దయ, పాలనా దక్షత, మనో నిబ్బరం అనే రసాలకు మాత్రమే సుమా! దాసోహం అన్నది, కాకపోతే చివరిలో  ‘స్త్రీత్వం’ అనే రసం కూడా జోడించబడి మరింత రసవత్తరం అయినది అంతే…”

వత్సలా దేవి చకితురాలయి  అతడిని చూస్తుండిపోయింది.

***********************************************************************************

రోజులు గడుస్తున్నాయి. వత్సలా దేవి మనస్సులో తన స్థానం సుస్థిరం కాలేదని మనో వ్యధకు గురి అయి మత్తు పానీయాలకు అలవాటు పడ్డాడు సముద్రుడు.

ఇదే అదును గా చూసి ధూమ కేతువు కుటిల పన్నాగాలు పన్నీ, అర్ధ రాత్రి మృడేశ్వర సామ్రాజ్యం పై దండెత్తాడు.

వత్సలా దేవి తన  అంగ బలంతో, భుజ బలంతో, అశ్వ, గజ బలాలతో విరుచుకుపడింది వారి మీద.

అర్ధ రాత్రిలో కూడా ఇంత అప్రమత్తంగా ఉన్న ఆమెను చూసి ధూమకేతు బెంబేలు ఎత్తిపోయాడు.

తెల్ల వారి మూడు గంటలు అయినా హోరాహోరీ భీకర పోరాటం జరిగుతోంది. శక్తి సన్నగిల్లుతున్నా పళ్ల బిగువునా కదన రంగాన్ని ఎలుతోంది ఆమె.

ఇదంతా తెలియని సముద్రుడు మత్తు పానీయాలతో తూగుతున్నాడు అతడి మందిరంలో.

ప్రజలకు తమ రాణి యొక్క విపత్కర పరిస్డితి చూసి కలత చెంది, చేటీ కందిన ఆయుధాల్తో శత్రు మూకల పై దాడి చేసి తమ రాజ భక్తిని చాటుకున్నారు. ధూమ కేతు చివరకు వెన్ను చూపి పారి పోయాడు.

అప్పుడు వత్సలా దేవి కి సముద్రుని మాటలు జ్ఞ్యప్తికి వచ్చాయి. ” మీ మీద ప్రేమ ను చూపటానికి నా ఒక్క హృదయం సరిపోక,  ప్రజల హృదయాల ద్వారా కూడా నేను  ప్రేమను అందిస్తున్నాను” అని.

ప్రజల ఎన లేని అభిమానానికి చలించిపోయిన వత్సలా దేవి వారి ముందు మోకరిల్లి తల వంచి అభివాదంచేసి, “మీ అభిమానo, ఇలాంటి రాజ భక్తులను  పొందటానికి పూర్వ జన్మ సుకృతం చేసుకొని ఉండాలి, మీ సేవకై నిరంతరం కృషి చేస్తాము” అన్నది  విజయ పతాకం ఎగుర వేస్తూ .

************************************************************************************

పరుగున సముద్రుడి  శయన మందిరం చేరుకొని వత్సలా దేవి  ” మీరు త్వరగా మామూలు మనిషి అవ్వాలి. ప్రజలకు మీరే సరి అయిన నిర్దేశకులు” అని వేడుకున్నది.

“నా ప్రాణాలు మీ చేతిలో పెట్టుకొని, ప్రజలకు ఊపిరి పోయమంటే ఎలా?” అని పిచ్చి పట్టినట్లూ నవ్వ సాగాడు సముద్రుడు.

***********************************************************************************

శ్రీ రామ నవమి రోజున వత్సలా దేవి సముద్రుడు పరిణయం ఆడి, సామ్రాజ్యాన్ని సుభిక్షంగా ఇరువురూ పాలించారు.

*************************************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s