Ctrl+c

“మధురిమా”!! ఇది నువ్వు అడగటం నూట ఒకటో సారి. నేను చెప్పినా అర్థం చేసుకొనే పరిస్డితి లో నువ్వు లేవు” అన్నాడు ఆరోహ్ ఆవేశంగా.

“చాలు, చాలు.. నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను అని, నీకు నీ మీద గొప్ప నమ్మకం. ఎంత చెడ్డా నువ్వూ ఒక మగాడివే అని, నీ మగ బుద్ధి కూడా అందరి లాగా గడ్డి తింటుందని తెలుసుకోలేక పోయాను” అన్నది ఆమె ఆక్రోశంగా.

“మంచిది. ఇక నిన్ను ఒప్పించను. నేను మంచి వాడిని అని నిన్ను ఒప్పించాలంటే,  నీకు నా మీద నమ్మకం లేదనే కదా! గుడ్ బై” అన్నాడు.

వెళ్ళి పోతున్న అతడిని ఆమె వెనక్కి పిలిచి “థాంక్స్! ఇంకెపుడూ నీ మొహం నాకు చూపించకు” అన్నది కోపాన్ని దిగమింగుతూ.

********************************************************************************

ఆరోహ్, ప్రజయ్ ఇరుగు పొరుగు కుటుంబాల్లో పెరిగారు. ఆరోహ్ తన  సొంత తెలివి తేటలతో ఫార్మసీ రంగంలో అడుగు పెట్టి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ప్రజయ్ కూడా ఆరోహ్ ని అనుకరించి అతడి స్థాయికి చేరుకున్నాడు. కాకపోతే ఆరోహ్ కల్తీ సరుకులు అమ్మడు, ప్రజయ్ అమ్ముతాడు.

కొంత కాలానికి ఆరోహ్ కాస్మటిక్స్, కొరియర్, ఇంటర్నెట్ రంగాలలో కూడా కాలు మోపి విజయం సాధించాడు. ప్రజయ్ అతడినే అనుసరిస్తూ అతడు కూడా అవే రంగాలలో పెట్టుబడులు పెట్టి అతడి ఫార్ములాస్ తోనే అతడి స్థాయికి చేరుకున్నాడు.

చూస్తుండగానే స్నేహితులు ఇద్దరు నలభైయ్యో వడిలో పడ్డారు. తెలిసిన వారు అందరూ, “ఇద్దరూ సంపాదనలో పడి పెళ్ళి మర్చిపోయారా?” అని అడగటం మొదలెట్టారు.

మొదట ప్రజయ్ ను అడిగారు, అతడు ఆరోహ్ సమాధానం కోసం ఎదురు చూశాడు, ఆరోహ్ రెండు రోజుల తర్వాత, “అవును కదా! మర్చిపోయాను, త్వరలోనే” అని ప్రకటించాడు.  ఒక గంట తర్వాత ప్రజయ్ కూడా  పొల్లు పోకుండా అలాగే సమాధానం  చెప్పాడు.

ఒక సారి పెళ్ళి అనుకున్నాక ఆరోహ్ కి వయస్సు గుర్తుకు వచ్చింది, ఇక క్షణం ఆలస్యం చేయకుండా తల్లి తో కలిసి ఎన్నో వెబ్సైట్లలో అమ్మాయిల బయోడాటా లను చూసాడు.కొంత మందిని స్వయంగా కలిశాడు.నలభై ఏళ్ల బ్రహ్మ చారికి పిల్ల దొరకటం కాస్త కష్టం అయింది. తన సొంత ఆఫీసులో అమ్మాయిలు ఎవరన్నా తనకు అనుకూలవతులు అయి ఉన్నారా అని కూడా కంచు కాగడా వేసి మరి వెతికి విసిగి పోయి, చివరికి తర్వాత చూద్దామనుకొని మళ్ళీ బిజినెస్ మీటింగ్ కి నేపాల్ వెళ్ళాడు.

ఆరోహ్ ప్రయాణంలో ఉండగా  ప్రజయ్ “నీకు ఎవరన్నా మ్యాచ్ అయ్యారా? నాకు ఇంకా అవ్వలేదు” అంటూ మెస్సెజ్ పెట్టాడు. అతడి  అనుకరణ బుద్ధి చిన్నప్పుడు “పరీక్షలకు నువ్వేం ప్రశ్నలు  చదువుతావ్” అన్నప్పుడు మొదలయి, ఇప్పటి పెళ్ళి దాకా వదల్లేదు” అనుకోని నవ్వుకొని ఊర్కున్నాడు ఆరోహ్.

కాన్ఫరెన్స్ లో తన తోటి కంపనీ జెనెరల్ మేనేజర్ మధురిమను చూసి ” తను నా కోసమే పుట్టిందా అనుకోని పరవశించిపోయాడు. కానీ తన వయస్సుకి, మనస్సుకి సరి జోడీనా కాదా? అని పరీక్షించ దలుచుకొని దూరం నించి గమనించ సాగాడు.

ఆమె మీటింగ్ లో ఉన్నప్పుడు,  పని మీద చాలా  శ్రధ్ద్ధగా వుండి, పని ఒత్తిడి అంతా మొఖంలో కనబరిచినా, లంచ్ బ్రేక్లో  అందుకు పూర్తి భిన్నంగా ఉన్న ఆమె తీరును గమనించి చాలా విస్తు పోయాడు. ఫోన్ లో గల గల మాట్లాడుతుంది. జుట్టు మొఖం మీద పడుతున్నా తొలగించుకోకుండా అలాగే నాన్ స్టాప్ గా తింటుంది. లాన్లో ప్రతి మొక్కను తాకీ పరవశించి వాటి తో కబురులు చెబుతోంది.

ఇక చాలు గమనించటం అనుకోని అతను ఆమె దగ్గరకు వెళ్ళి ” మీ ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తారా? ” అని అభ్యర్ధించాడు.

“మీరు సినిమాలు బాగా చూస్తారా? విషయం ఏంటి చెప్పండి, నేను మిమ్మల్ని మీటింగ్ లో చూసాను,” అన్నది క్లుప్తంగా.

“ఓకే, అసలు విషయం నేను  35 ఏళ్ళ ఘోటక బ్రహ్మ చారిని,  పెళ్ళికి అమ్మాయిని వెతుకుతున్నాను.” అన్నాడు  సూటిగా…

ఆమె ఫక్కున నవ్వి “అయితే మీరు రావాల్సిన చోటు ఇది కాదు, నాకు పెళ్ళి అయిపోయింది.” అన్నది.

అతడు నిరాశగా మీటింగ్ హాల్ కి వెళ్ళిపోయాడు. ఆమె ఒక పది నిమిషాల తర్వాత మీటింగ్ కి వెళ్ళింది. ‘ఈ అమ్మాయిలు నచ్చని వ్యక్తికి, తమకి పెళ్ళి అయిపోయిందని చెప్పి తప్పించుకుంటారు’ అని సందేహ పడ్డాడు  ఆరోహ్. ఎంత వద్దన్నా అతడి కళ్ళు ఆమె వైపే వెళుతున్నాయి. ఆ చూపులు గుచ్చుకున్నట్లు అయి, ఆమె అతడి కేసి చూడటం తో ఠక్కున లాప్ టాప్ లో తల దూర్చాడు. “వద్దురా బాబు తనని చూడకు, ఒక వేళ సెక్సుయల్ హెర్రాస్స్మెంట్ కేస్ పెడితే అధోగతి పాలు అవుతామ్” అనుకోని తనకు తాను నచ్చ చెప్పుకున్నాడు. 15 నిమిషాల తర్వాత మళ్ళా అతడి కళ్ళు ఆమెను వెతక సాగాయి. తన బుద్ధికి తానే తిట్టుకుంటూ ” ఈ అమ్మాయిని మీటింగ్ నించి బహిష్కరిస్తే బాగుండు, అప్పుడే రేపటి మీటింగ్ కూడా ఎట్టెండ్ అవ్వగలను” అని తిట్టుకున్నాడు.

ఇంతలో ఆమె స్టేజీ  మీదకొచ్చి, తమ కంపనీ కొత్త తరహా పద్దతిలో, ఆర్గానిక్ కూర గాయాలను  నెల నెల, శాశ్వత ఖాతాదారులు అయి  ఉన్న వినియోగ దారులకు, హోమ్ డెలివరి కూడా చేయ తల పెట్టిందని, దానికి ఆరోహ్ కంపనీ సహకారం కావాలని కోరుతూ డెమో ఇచ్చింది.అతడు ఇబ్బందిగానే మీటింగ్ అంతా పూర్తి చేసి బయటకు వచ్చాడు.

అది గమనించిన ఆమె అతడికి ఎదురు వచ్చి తన ఫోన్ తెరిచి,  “నా పిల్లలు” అంటూ చూపి, “నమ్మండి నన్ను” అన్నది.

అతడు బింకం నటిస్తూ “నేను ఎపుడో మరిచిపోయాను, దారి వదలండి” అన్నాడు.

“తెలుసు ఎంత మరిచిపోయారో, మీటింగ్లో చూస్తూనే వున్నాను” అన్నది చిరు నవ్వుతో.

అతడు ఎలాగో తప్పించుకొని మరునాటి మీటింగ్ ని   వేరే ఒకరికి అప్పగించి, ఇంటికి చేరాడు.

ఇంటికి రాగానే ఆరోహ్ తల్లి 15 మంది అమ్మాయిల ఫోటోలను చూబించింది. అందరూ చాలా అందంగా కనిపించారు, కానీ మధురిమ లా అనిపించటం లేదు అతడికి.  ” నా మూర్ఖత్వం చూడు ఒక అమ్మాయిని వేరొక అమ్మాయిలో వెతకటం ఏమిటి” అనుకోని ఆఖరు ఫోటో కూడా చూశాడు. అది మధురిమ దే. ..

తను చూస్తున్నది నిజమా లేక ఆమె ఊహల ..ప్రభావమో తెలీక తిక మక పడ్డాడు. ఫోటో వెనక వున్న రేఫెరెన్సు నంబరు తో వెబ్సైట్లో చూశాడు. ఆమె బయో డేటా ను చూసి నోరు తెరిచాడు.

 

“Need companion not owner of mine,

Need life partner not only bed partner,

Need supporter not criticizer,

Need a person who can handle me at tough times and be with me heartfully, mindfully, soulfully, willfully, legally, permanently…cheerfully..”

“అబ్బో ఇన్ని ఆశలు ఉన్న దానివి నన్ను ఎందుకు వదిలేశావ్”,  అనుకోని వెంటనే  ఆమెకు ఫోన్ చేసి, “నేను ఆరోహ్” అన్నాడు.

ఆమె “మిమ్మల్ని సెలెక్ట్ చేయలేను, నా మాటల్లో అబద్దం గ్రహించలేదు- మీ తెలివి తేటలు” అన్నది

“ఇంత అహంకారమా?!! నేను కాక ఇంకెవరన్నా అయితే సంవత్సరం లో వదిలేస్తాడు” అన్నాడు గట్టిగా నవ్వుతూ.

ఆమె ఫక్కున నవ్వి “రేపోచ్చేయండి పెద్దాళ్లనేసుకొని” అని ఫోన్ పెట్టేసింది.

రెండు రోజుల్లో పెళ్ళి మాటలు అయిపోయి ‘ముహూర్తాలు రెండు నెలల తరవాత’ అని  నిశ్చయం చేశారు పెద్ద వాళ్ళు.

*************************************************************************************

ప్రజయ్ మధురిమ ఫోటో పట్టుకొని అతి కష్టం మీద, ఆమె పోలికలు ఉన్న పూర్ణిమ అనే అమ్మాయిని ఖాయం చేసుకున్నాడు. కానీ పోలికలు మధురిమవే అయినా ఆమె అభిరుచులు మధురిమ కి భిన్నంగా ఉన్నాయి. పూర్ణిమ కు భరత నాట్యం అంటే ప్రాణం. భారతీయ విలువలు అంటే ఎన లేని గౌరవం.చిత్ర లేఖనం ఆమె జీవితంలో సగ భాగం. ఎవరినీ అనుకరించదు, సాదా సీదా మనిషి.

ప్రజయ్ ను ఆమె త్వరగా ఒప్పుకోలేదు, కానీ అతడు ఆమె కాళ్లా వేళ్లా పడి ఒప్పించాడు. మధురిమ-ఆరోహ్, ప్రజయ్-పూర్ణిమ పెళ్ళి వేడుకల్లో మునిగిపోయారు. పెదాళ్ళకు చెప్పి లాంగ్ ట్రిప్ కు బయలు దేరారు నలుగురు.

ఆరోహ్ మధురిమ   స్మార్ట్ ఫోన్ – ఇంటర్నెట్ లా కలిసిపోయారు. ఆమె అడుగు వేస్తే అతడికి కూచిపొడి నాట్యం చేసిందా అన్నంత అపురూపంగా చూస్తున్నాడు. ఆరోహ్ చిరు నవ్వు నవ్వినా ఆమె ఒక కావ్యంలా తన హృదయం లో రచించుకుంటోంది.

ప్రజయ్ వీరిని దూరం నించి చూసి అనుకరించి , పూర్ణిమను అలాగే ప్రేమిస్తున్నాడు . ఆమెను మధురిమలా ఉండమని శాసిస్తున్నాడు. ఆమె ఆర్ట్ గాలరీకి  వెళదామ్ అంటే “మధురిమ పబ్ కి వెళుతుంది, నువ్వు కూడా అలాగే అలవాటు చేసుకో, అమ్మమ్మ లాగా ఉండకు” అన్నాడు. “మధురిమ ఫోక్ స్పూన్ తో తింటుంది, నువ్వు చేత్తో  తినకు” అన్నాడు. “వాళ్ళు నిద్ర పోయారు, మనం ఎందుకు వెన్నెల్లో కూర్చోవాలి” అంటాడు. మొత్తానికి ఆమెకు నరకం చూపించాడు వారిని అనుకరిస్తూ.

ఆలశ్యంగా అతడి గురించి తెలుసుకున్న పూర్ణిమ “క్షమించండి” అని ఉత్తరం వ్రాసి రెసార్ట్స్ నించే వెళ్ళి పోయింది.

అవమానం భరించలేని ప్రజయ్, ఆరోహ్ కి చెప్పి అతడి పెళ్ళి కూడా వాయిదా వేసుకోమని కోరాడు.

అతడు ప్రజయ్ ను తొందర పడొద్దని, పూర్ణిమను తను ఒప్పిస్తానని చెప్పి, మధురిమ తో కలిసి ఆమె ఇంటికి వెళ్ళాడు.

“పూర్ణిమ! నన్ను అనుకరించటం వాడికి చిన్నప్పటి  నించి అలవాటు. నువ్వు భార్యగా వాడిని మార్చుకోవాలి” అన్నాడు ఆరోహ్.

అప్పుడు ఆమె మధురిమ చేయి తన చేతిలోకి తీసుకొని ” నిన్ను నాలా అయిపోమని ఆరోహ్ అంటే ఒప్పుకోగలవా? నాకు శరీరం ప్రజయ్ ది, మెదడు ఆరోహ్ ది అనిపిస్తోంది. ప్రతి దానికి ఆరోహ్ ఏం చేస్తాడో చూసి అనుకరిస్తాడు. అపుడు ఆరోహ్ నే చేసుకోవచ్చుగా నేను ? రేపు నా పిల్లల్ని కూడా మీ పిల్లలను అనుకరించమంటాడు. నా జీవితం నీకు జిరాక్స్ కాపీ కూకూడదు. ఇది అసూయ కాదు, ఆత్మాభిమానం” అన్నది.

ఆరోహ్ కి  ఒక మధ్య తరగతి అమ్మాయి, ముప్పదుల వయస్సు దాటినా ఏమాత్రం ఆలోచించకుండా  ప్రజయ్ లాంటి ధనవంతుడిని ‘వద్దు’ అనుకున్నదంటే, తన ఆత్మాభిమానo  ఎంత దెబ్బ తిన్నదో అర్థం అయి, ” నువ్వు నువ్వులా ఉండాలని కోరుకోవటం, నీకు భవంతుడు ఇచ్చిన గొప్ప బహుమతి, దాన్ని ఎవరి కోసమో త్యాగం  చేయకు” అని మధురిమ తో సహా వెళ్ళిపోయాడు.

*************************************************************************

ఇంటి కొచ్చిన ఆరోహ్, తన తల్లితో ప్రజయ్ సమస్య చెప్పి, పెళ్ళి కొన్ని రోజులు వాయిదా వేయమని అడిగాడు. కానీ అతడి తల్లి, మధురిమ అందుకు ససేమిరా అన్నారు. అతడి తల్లి శాంతించి నిదానంగా ” స్నేహితుల పట్ల బాద్యతగా ఉండొచ్చు కానీ వాడి స్వయంకృతాపరాధాలకి, నువ్వు నీ సమయం వృధా చేసుకోనక్కర్లేదు. పైగా ఇప్పుడు మధురిమకు  నేను ఎంత ముఖ్యమో నీకు ఆమె తల్లి తండ్రులు అంతే ముఖ్యం.  వారిని ఈ సమయంలో కంగారు పెట్టకు” అని నచ్చ చెప్పింది.

చేసేది లేక ప్రజయ్ కు హడావిడిగా వేరే సంబంధాలు వెతక నారంభించాడు ఆరోహ్, కానీ ప్రజయ్ కు ఏ  అమ్మాయిని చూసినా మదురిమతో సరి తూగినట్లు అనిపించట్లేదు. అసూయతో రగిలిపోయి మధురిమను తానే చేసుకుందామని దుర్బుద్ధితో వారిని విడ దీయటానికి పధకాలు వేశాడు.

ఆరోహ్ ఫోన్ నించి పూర్ణిమకు పదే పదే ఫోన్లు చేసాడు. ఆరోహ్ కి  తను పూర్ణిమను మర్చిపోలేక పోతున్నాడని చెప్పి ,  ఆమెని ఎవరికీ తెలీకుండా మళ్ళీ పెళ్లి కి ఒప్పించమని కోరాడు. వారిద్దరు ఒంటరిగా కలిసేలా ఏర్పాటు చేసి, ఆ ఫోటోలు తీసి మధురిమకు చూపించాడు. మధురిమ, ఆరోహ్ కలిసే సమయానికే , పూర్ణిమ వద్దకు వెళ్ళమని ఆరోహ్ ని బలవంతంగా పంపించేవాడు. ఇది ఎవరికి చెప్పొద్దని అనటం వల్ల, ఆరోహ్ మధురిమకు కూడా చెప్పకుండా విషయం దాచి ఉంచాడు.

మంచి సమయo చూసి, ప్రజయ్ మధురిమ ను పిలిచి , ” కొన్ని రోజుల నించి గమనిస్తున్నాను. ఆరోహ్ కి పూర్ణిమ అంటే ఇష్టం, అందుకే మమ్మల్ని విడదీశాడు. కానీ ఇప్పుడు నీ పరిస్డితి ఏంటి? మూహూర్తం రోజు దగ్గర పడింది, నేను నిన్ను చేసుకుంటాను, నీకు అభ్యంతరం  లేకపోతే” అని అడిగాడు.

ఆమె కొన్ని బలమైన ఉదాహరణలు చూసి పెళ్ళి రద్దు చేస్తూ ” నీకు పూర్ణిమ అంటే ఇష్టం, నేనoటే  ప్రజయ్ కు ప్రాణం. పెళ్ళి విధి లిఖితమ్, తప్పకుండా రావాలి” అంటూ మెస్సేజ్ పెట్టింది.

ఆరోహ్  జరిగింది అర్థం అయ్యేలా చెప్పమని పూర్ణిమను ఆమె వద్దకు పంపాడు. కానీ మధురిమ ఆమెను కలవకుండానే తిప్పి పంపింది. చివరికి అతడే వెళ్ళి ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు.

“చాలు, చాలు.. నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను అని నీకు నీ మీద గొప్ప నమ్మకం. ఎంత చెడ్డా నువ్వూ ఒక మగాడివే అని, నీ మగ బుద్ధి కూడా అందరి లాగా గడ్డి తింటుందని తెలుసుకోలేక పోయాను” అన్నది ఆమె ఆక్రోశంగా.

“మంచిది ఇక నిన్ను ఒప్పించను. నేను మంచి వాడిని అని నిన్ను ఒప్పించాలంటే,  నీకు నా మీద నమ్మకం లేదనే కదా! గుడ్ బై” అన్నాడు.

వెళ్ళి పోతున్న అతడిని ఆమె వెనక్కి పిలిచి “థాంక్స్! ఇంకెపుడూ నీ మొహం నాకు చూపించకు” అన్నది కోపాన్ని దిగమింగుతూ.

************************************************************************************

పెళ్ళి మండపం లో ప్రజయ్, మధురిమ  పూజలో కూర్చున్నారు.

ప్రజయ్ తల్లికి ఆరోహ్ ఎక్కడా కనిపించకపోవటం తో , నేరుగా అతడి ఇంటికి వెళ్ళింది. ఆరోహ్ ఇల్లంతా చీకటి చేసుకొని కూర్చున్నాడు. పక్కనే అతని తల్లి శూన్యంలోకి చూస్తూ ఉన్నది.

ఆవిడని చూసిన ప్రజయ్ తల్లి, “ఇన్ని రోజులు నీ కొడుకును నా కొడుకు అనుకరిస్తున్నాడని ఎంతో కుమిలిపోయేదాన్ని, కానీ ఇవాళ వీడిని కాదని ఒక తెలివైన, సమర్ధురాలు  అయిన పిల్ల వాడిని వరించింది. ఇంత కన్నా నాకు ఏం కావాలి”? అన్నది.

ఆరోహ్ తల్లి లేచి నిలబడి  “పెళ్ళి అయ్యాక, వీలు అయితే మీ కోడలిని తీసుకొని మా ఇంటికి రా” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఆరోహ్ ఆమె కాళ్ళకు దండం పెట్టి “నేను కూడా మీ కొడుకు లాంటి వాడినే” అన్నాడు చిరునవ్వుతో.

ఆవిడ పెళ్ళి మండపానికి చేరుకొని పీటల మీద కూర్చొని ఉన్న ప్రజయ్ చెంప చెళ్లుమనిపించి, ” జీవితాంతం ఆరోహ్ కి నకలుగా బతకటానికి సిగ్గుగా లేదా? నీ భార్యను వాడి భార్యతో పోల్చి దూరం చేసుకొని, మళ్ళీ వాడికి  కావల్సిన అమ్మాయిని తెచ్చుకుంటావా? నన్ను చంపి వాడి తల్లిని కూడా తెచ్చుకో, మీ నాన్నను చంపి , వాడి నాన్నను తెచ్చుకో” అన్నది భోరున విలపిస్తూ….

పూర్ణిమ పీటల మీదున్న మధురిమకు  జరిగింది చెప్పింది. వెంటనే మధురిమ ఆరోహ్ కి ఫోన్ చేసి, “నేను నీకు ముందే చెప్పాను, “u r unfit to handle me” అని  అన్నది ఏడుస్తూ.

అతడు ప్రశాంతంగా నవ్వేస్తూ ” పది నిమిషాల్లో అక్కడ ఉంటాను, ప్రజయ్ గాడు తాళి బొట్టు ను డూప్లికేట్ చేసేస్తాడు, జాగ్రత్తగా వుంచు” అని ఫోన్ పేట్టేశాడు.

*************************************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s