కను విప్పు

“పెద్దయ్యాక ఏవరవరు ఏం అవుతారు” అడిగారు మాస్టారు గారు  విద్యార్ధులను ఉద్దేశించి.

“నేను డాక్టరు” అన్నాడు నందన్

“నేను ఇంజనీర్” అన్నాడు శశాంక్

“నేను మీ లాగే టీచర్ అవుతాను” అన్నది వర్ష…

“నేను ఆకు పసరులతో పెట్రోలు చేస్తాను” అన్నాడు ఉదయ్.

“ఒరేయ్  అడ్డాగాడిద, ఏం తెలివి తేటలు రా నీవి? ఆకులు ఏంటి పెట్రోలు ఏంటి ? మెడకాయ మీద తల కాయ లేని వెధవ.. రేపు డి.ఈ.ఓ గారు వస్తున్నారు . నువ్వు దయ చేసి బడికి రాకు అన్నాడు అగ్గి మీద్ గుగ్గిలం అయిపోతూ…

ఇంతలో వెనక నించి నందన్ లేచి సర్ మీరు పొరబడ్డారు, “నేను అన్నది ఆయ్ర్వేదిక డాక్టర్ అవుదాo అని. అయితే నేను కూడా రాకూడదా కదా బడికి “అన్నాడు సందేహంగా.

“మగ కోతులు  కాస్త పక్కన ఉండండి, ఆడ పిల్లలు మీరు చెప్పండమ్మా..”

ఝాన్సీ లేచి నిలబడి, “రాజకీయ నాయకురాలిని అవుదాo అనుకుంటున్నాను”,  అన్నది.

అవునా, “మీ అమ్మ మీ నాన్నకు విడాకులు ఇచ్చే సరికి ప్రపంచాన్ని జయించానని అనుకుంటోందా, కూతుర్ని ఇలా పెంచుతోంది, కూర్చో, అమ్మ శ్వేతా నువ్వు చెప్పు.”

“ఫాషన్ డిసైనర్”

“గుడ్డిలో మెల్ల, కూర్చో..”

“నువ్వు ప్రియాంక..”

“మోడల్ కమ్ ఏక్టర్ ”

“మళ్ళీ తప్పుడు మాట. అసలు  చదువు ఏం జ్ఞ్యానం నేర్పిస్తోంది మీకు. ఒరేయ్ శరత్ నువ్వు చెప్పు అందరిలోకి కాస్త పుస్తకాల పురుగువీ నువ్వే”

“వీరప్పన్ అవుతాను సర్”

“ఒరేయ్ గట్టిగా అనకురా, ఎవరన్నా వింటే నన్ను పుసుక్కున అపార్థం చేసుకొని జైల్ లో పెడతారు” అని నిదానించి “నీకు అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది”, అని అడిగాడు.

“మీరు చెప్పిన సుమతి శతకంలో ఒక పద్యం మొన్న మా ఇంటికి చుట్టాలొస్తే వాళ్ళ ముందు చెప్పమన్నది అమ్మ. నేను చెప్పాను, వాళ్ళ ముందే అమ్మ చావ కొట్టింది”

“ఏం చెప్పావురా అలాంటి పద్యం”?

అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు,మోహరమునఁదా నెక్కిన బాఱని గుఱ్ఱము, గ్రక్కున విడువంగవలయుఁ గదరా సుమతీ

“ఒరే ఆపారా.. ఈ పద్యం ఎప్పుడు వాడాలో తెలీక పోతే నాదా తప్పు??”.

“అది కాదు సార్, అసలు సంగతి, మరునాడు వీరప్పన్ గురించి  చెపితే మాత్రం అందరూ నాకు లోక జ్ఞానం ఉంది అని ముద్దు పెట్టుకున్నారు. పైగా ప్రతి మాగజీన్ కవర్ పేజీ మీద ఆయన బొమ్మ ఉంది మీ బొమ్మ లేదు. ప్రతి టి.వి లోనూ ఆయన వస్తాడు. టీచర్ వృత్తి కేవలం జోక్స్ లో మాత్రమే చూస్తున్నాను.”

“ఏం డాక్టరు మీద కూడా  జోక్స్ ఉన్నాయి కదా ?”

“కానీ టీచర్ మీద మరి ఎక్కువ సార్…”

ఆయన ఖంగు తిన్నాడు.

ఝాన్సి లేచి ” రోజు రాజకీయం అంటే అసహ్యం అంటారు, వోటు వేయటం మన బాద్యత అంటారు, అందుకే  రాజకీయాల్లో  చేరుతాను, పాత విధానాలను బాగు చేద్దాం అనుకున్నాను. కానీ మీరు మా అమ్మని తిట్టారు.” అన్నది.

ప్రియాంక లేచి, “సినిమా ఆక్టార్ అవ్వటం తప్పు అయితే మీరు హింది మాస్టారు తో ఆరు నెల్లకో సినిమా కు  కూడా నోచుకోలేదు, అని ఎందుకు అన్నారు. ఏక్టర్స్ లేనిదే సినిమా ఎక్కడిది? అన్నది.

సంజయ్ లేచాడు, “మీరు రోజు సికిల్ మీద వస్తారని మా నాన్నకి చెప్పాను, మీరు పెట్రోలు ధర భరించలేరు అని చెప్పారు, అందుకే ఆకు పసరుతో పెట్రోలు చేద్దామనుకున్నాను” అన్నాడు.

ఆయనకు కళ్ళ  నీళ్ళు తిరిగాయి.

చివరిగా వర్షా లేచి  ” మీకు ఇన్ని బాధలు ఉన్నాయని నాకు తెలీదు, అందుకే టీచర్ అవుతాను అన్నాను. ఇక నేను మా అమ్మ లాగా ఇంట్లో కూర్చుంటాను. అన్నది నిష్కల్మషంగా”.

బడి చివరి గంట కొట్టటంతో అందరూ వెళ్ళి పోయారు. మాస్టారు ఆలోచనలో పడ్డారు. నిజమే కదా.. పిల్లలు రోజు మన పాఠాలు వినటం కన్నా మన నడవడిక, మన కష్టాలు, మన బింకాలు, మన అభిరుచులు కూడా గమనిస్తూ ఉంటారు. వాటి నించే వారి జీవిత లక్ష్యాన్ని ఎంచుకుంటారు.

మనం వారికి మంచి చెప్తా0  కానీ నిజంగా వారు దానికి సంసిద్దులయితే ఏదో రకంగా తోక్కేస్తామ్. మన ఆక్రోసాన్ని , ఎక్కడ చెప్పాలో తెలీక వారి ముందు బహిర్గతం చేస్తాం. దానికి వారు సరి కొత్త మార్గాలు కూడా తెల్సుకుంటారు. కానీ మనం మాత్రం వాటిని తీసిపారేస్తాం. ఎందుకు?

మనం సాధించలేంది వారు సాధిస్తారనే భయమా? వారికి ఏదన్నా అవుతుందని భయమా? మన నిరాశ వారి మీద రుద్దటమా?

నా చేతిలోనే ఉంది, ఈ పిల్లల్ని మలచటం  అనే మహ్త్త్వరమైన శక్తి. వీరిని పేపరు చదివి పక్కకి విసిరేసే కుటుంబ రావుల లాగా తయారు చేయకూడదు.పేపరు చూసి, ఉవ్వెత్తున ఎగసి పడే కెరటాలను చేయాలి. ప్రతి దానికి ఒకరిని నిందించే మనస్తత్వం నించి బాద్యత తీసుకొనే పౌరులను చేయాలి.

*************************************************************************************

మరునాడు డి ఈ.ఓ గారు పిల్లల సమాధానాలకు ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు , ఆయన్ని మెచ్చుకొని “నిజమైన చదువు జీవితానికి , దేశానికి ఉపయోగ పడేది అని గొప్పగా చెప్పిచ్చారు మీ పిల్లల చేత” అని మెచ్చుకునాడు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s