మూగ పోయిన కలం

“అయిపోయింది, అంతా  అయి పోయింది.

ఇహ అరణయాలను శరణు వేడుకోవాల్సిందే

వన్య ప్రాణులను కాదని మాకు కూసింత జాగా ఇమ్మని బతిమిలాడాను.

సింహా రాజు గర్జించాడు, మాతో మీరేలా ఉండగలరు, మేమెక్కడికి వెళ్ళాలి, అంటూ.

క్రూర మృగాలు అయిన మీకు, సాధువులా కనిపించే మాకు ఒకటే తేడా, మీరు, మీరున్న చోటు శుభ్రంగా ఉంచుకుంటారు, మేము ఉంచుకోము అంతే.”

మొదటి 6 లైన్లను చదివిన పత్రిక ఎడిటరు గారు, ఆ శీర్షికను సీతా మహాలక్ష్మి కి  తిరిగి అందిస్తూ ” రెండు రోజులు ఊరేళుతూ పత్రిక ఆఫీసును చూసుకోమంటే, మీ ఇస్టానికి  వ్రాసి పారేస్తారా..” అన్నాడు.

“సార్ నేను ఈ రాజ్కీయ నాయకులను, సినిమా వాళ్ళను, సోషల్ ఆక్టివిస్ట్ లని ఉద్దేశించి వ్రాయలేదు. సామాన్య ప్రజలకు కూడా నవ సమాజం నిర్మాణంలో పలు పన్హుకోవాలని, రేపటి తారాన్ని చైతన్య పరచాలని మాత్రమే వ్రాసాను. ”

“మీ సంజాయిషీ నేను వింటాను, కానీ పర్యావరణ మంత్రి గారు నా మాట వినరు, నేరుగా పారితోషక0 పంపుతారు. దయ చేసి వంటింటి శీర్షికలు మీరే చూసుకోండి మొత్తంగా, కానీ ఇలాంటివి వ్రాసి పత్రిక మూయించొద్దు.”

సీతా మహా లక్ష్మి నాలుగు రోజులు వంటింటి చిట్కాలు, బొద్దింకలు వాటి నివారణ, చిన్న మొత్తాల పొదుపు లాంటి గృహీణూలకు కావల్సిన శీర్షికలు వ్రాసింది.

క్యాంటీన్ లో నిస్తేజంగా కూర్చున్న ఆమెను చూసి ఎడిటరు గారు, “అమ్మ  సీతా, నువ్వు మన్సులో ఉన్నదంతా పత్రికలో కక్కెస్తే, రేపు మనము మన పత్రిక ఎవరు ఉండరు. అయినా గృహీణులను ఉత్తేజ పరిచే మంచి శీర్షకలు నీకు ఇచ్చాను, ఏo వారు నీ శీర్షికలౌ అర్హులు కారా? అన్నాడు గొప్పగా నన్ను ఉత్తేజ పరిచే ప్రయ్త్నమ్ చేస్తూ.

ఎందుకు సార్ హిపోక్రసి. మీకు పొట్టేలు కొండ కధ బాగా వంట పట్టింది అని చెప్పండి, అన్నది నిక్కచ్చిగా.

సరే మరో రోజులో ఒక గొప్ప శీర్షికతో రా, ఆలోచిస్తాను అన్నాడు కాస్త పోరుషంగా.

ఆమె హుషారుగా మునికిపాలిటీ – మారో గోలి అంటూ శీర్షిక తయారు చేసింది. అది నగరాల్లోని నాడీ బొడ్డు ప్రాంతాలు చమకాయిస్తూ, స్లమ్ ప్రాంతాలు మాత్రం ఎందుకు చమకాయించవు. స్లమ్ ప్రాంతాలలో శుభ్రత గూర్చి అవగాహన కల్పించే పని ప్రభుత్వానిద, లేక  రిటైర్ అయిన ప్రభ్త్వ ఉద్యోగులదా?” అంటూ మరో పిడి గుద్దు గుద్దింది.

ఎడిటర్ గారు శీర్షిక పూర్తిగా చదివి నీళ్ళు నవులుతూ ” మీ కంటికి మంచి తప్ప అన్నీ కనబడతాయా, లోటు బడ్జెట్లతో ప్రభుత్వ కస్టాలు నీకేం తెల్సు, ఒక రోజు వారి వైపు నుండి ఆలోచన చేయాలి కదా, బాద్యతాయుత్మైన పౌరులు తీర్చి దిద్దటామే  కాదు, రెచ్చ కొట్టే వ్యాఖ్యలు మీరు కూడా చేయకూడదు అన్నారు.

మీరన్నది  నిజమే, కానీ నాయకులు గల్లీ గల్లీ లోనూ తిరిగి చూడలేరు, కనుక వారి ఇంటి గడప ప్రతి తోజు తోక్కే మన పేపరు వారికి ఈ వార్త చేర వేస్తుంది . లేదంటే పౌరులు నేరుగా వారికి ఫోన్ చేసి సమస్యలు చెప్పుకొనే విధానం ఉన్నపుడు నేను బల్లులు వాటి నివారణ గూర్చి వ్రాస్తాను.

దయ చేసి మీరు వంటింటి శీర్షికల మీద దృస్టి పెట్టండి. మన పత్రిక మనుగడకు అడ్డుపడకండి అన్నాడు కనుబొమలు మూడేస్తూ.

ఇంటికెళ్ళే దారి పొడువునా అతడిని తిట్టుకుంటూ ఇంటికి చేరింది సీత.పిల్లల్ని నిద్ర పుచ్చాక తను కూడా నిద్రకు ఉపక్రమించింది కానీ ఆమెను సమ సమాజం పిలిచింది.మళ్ళీ కలం పట్టింది.

చీకటి రాజులకు , రాజ్యాలకు బంట్రోతులు ఎవరు. పెడ్డోళ్ళకు తెలీకుండా నే స్కూళ వరకు డ్రగ్స్ వచ్చాయ? చిన్నోళ్ళని  కూడా ఏమీ చేయలేని వాళ్ళు  పెద్దోళ్ళు ఎలా అవుతారు, అంటూ.

ఆ శీర్షిక చూడగానే గ్లాసు దించకుండా గట గట నీళ్ళు తాగేసి “నువ్వు ఉప్మాలో కారేపకులు మోతాదు మించి వేస్తే వాటి ప్రయవసానం వ్రాసి పట్టుకురామ్మ, దీన్ని నేను క్షుణ్ణం గా పరిశీలించి చెప్తాను. అన్నాడు.

దానితో సీతకు బేతాళుడు చెట్టెక్కాడని అర్థం అయింది.  చేసేది లేక ఆయుర్వేద చిట్కా వైద్యాలు, గుళ్ళు, చైన్ స్నాచారస్ జీవిత గాధలు  వాటి మీద శీర్షికలు వ్రాసి తృప్తి పడింది.కొద్ది కాలానికి ఆమెలో ఒక నిర్లిప్తత చోటు చేసుకుంది.

మనదీ ఒక బ్రతుకేన, కుక్కల వలె నక్కల వలె…అంటూ శ్రీ శ్రీ గారి కవితలు గురుతు చేసుకొని  నవ్వుకునేది.

ఒక రోజు ఎడిటర్ గారిని కొంత మండి గుర్తు తెలీని దుండగులు అటకాయించి చావ బాదారు. తీవ్రంగా గాయ్లు అవ్వటం తో ఆసుపత్రిలో చేర్చారు. మా స్టాఫ్ అంతా ఒక రెండు రోజులు పోనిచ్చి ఆయనను పరామర్శించటానికి వెళ్ళము.

” ఎవరు కొట్టారో తెలీదమ్మ సీత. అందరూ ముసుగుల్లో ఉన్నారు, పైగా చీకటి. ఎవరితో గొడవలు రాకూడదని ఎంతో ఆచ్చి తూచి శీర్షికలు వేస్తాను పత్రికలో. అయినా ఇలా పగ బట్టారు. ఇక ఊరుకొని లాభం లేదు. రేపు మన పత్రిక హెడ్ లైంస్లో , ‘కలం పీక నొక్కితే’,  ‘స్వేచ్చా భంగం’, ‘ఇదెక్కడి న్యాయం’ ఆంటూ దద్దరిల్లిపోవాలి, అంటూ విరుచుకు పడ్డాడు.

అందరం నిస్సబ్ధంగా ఉన్నాము. ఆయన “ఏం మాట్లాడరే? మీకు హక్కులు నేను ఇస్తున్నాను…” అన్నాడు ఆవేశంగా..

మాకు నవ్వు వచ్కింది, “ఇంత కాలం మీరు మా కలాల పీక నొక్కరని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు” అని  చెప్పాము.

“ఉప్మాలో కారెపాకు పాళ్ళు చూసుకొనే నాకు, అంత పెద్ద పని అప్పచెప్తే అలవాటు పోయింది సార్, అన్నది సీత.

మా సహోద్యోగి కిషోర్ పెట్రోల్ పెరుగుదల మీద వ్రాస్తే, శీర్షిక తగలు బెట్టారు నా ముందే, అప్పుడే శాశ్వతంగా నా నోరు మూసేసుకున్నాను సర్, అన్నాడు.

మరో అమ్మాయి, ” నాకు రేప్ కేసులు తప్ప మరొకటి తెలీదా, అని ద్వంద్వార్థంతో అన్న మాటలు ఇంకా నా చెవిలో మారుమ్రోగుతున్నాయి సర్” అన్నది.

అందరం కసిగా స్వేచ్చగా మొదటి సారి మాట్లాడి బయటకు వచ్చేశామ్.

మేమంతా కలిసి ఒక పత్రిక స్థాపించాం “సమ సమాజ నిర్మాణం సాధ్యమేనా?” అనే పేరుతో, స్వేచ్చ అనే కలముతో….

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s