ఈ ప్రపంచానికి ఎవరు కావాలి??

“కారుణ్య గారు, మీరు ఒక కార్పెంటర్ కుటుంబం నించి వచ్చి., లాయరు వృత్తిలో కోట్లు సంపాదించారట, దానికి మీ లంచాలే కారణమని, జన నానుడి కూడా ఉంది. మరి మీరేం అంటారు?” అన్నాడు ఒక వెలేఖరి.

“మీకేం నచ్చితే అది వ్రాసుకోమంటున్నా” అని అన్నాడు లాయర్ కారుణ్య.

“అందరి తరుఫున అనర్గళంగా వాదించే మీరు, మీ గురించి మీరు ఎందుకు వాదించుకోరు?”

“అందరి తరుఫున వాదిస్తేనే కోట్లు గడించాను, నా తరుఫున నేను వాదిస్తే నయ పైసా రాదు, అందుకే ఆ సమయాన్ని కూడా వేరే ఒకరి కోసం వాదించి సంపాదిస్తాను” అన్నాడు.

*************************************************************

ఇది మనోడి పరిస్డితి, డబ్బు రాలదంటే కనీసం తన కోసం కూడా వాదించుకోడు.

తన తల్లిని తనకు పెళ్ళి కాక ముందే వృద్ధాశ్రమంలో పేట్టేశాడు. మళ్ళీ ఏ.సి. రూమ్ నుంచి  హోo ధీయేటర్ వరకు ఇచ్చాడు.  అదేమంటే “అమ్మ! నువ్వు నాకు అన్నీ ఇచ్చావు కానీ, ప్రేమ ఇవ్వలేదు గా” అంటాడు ఆవిడతో.

అతడికి పెళ్ళికి ముందు ఒక ప్రేయసి కూడా ఉంది, కానీ హోటల్ కి వెళ్ళినపుడు  ” ఒక రోజు నువ్వు, మరో రోజు నేను బిల్లు కట్టాలి అని నియమం పెట్టాడు. అంతే పిల్ల ఠారెత్తి, “రేపు పిల్లల్ని కనటానికి కూడా రెంట్ అడుగుతాడు” అని పారిపోయింది.

అయినా అతను తన తీరు మార్చుకోలేదు.ఒక రోజు కార్ లో వస్తుంటే తనను చిన్నప్పుడు పెంచిన ఆయమ్మ కనబడింది, రోడ్డు మీద నిలువ నీడ లేక. వెంటనే తన ఇంటికి తీసుకెళ్ళి ఆశ్రయం ఇచ్చాడు. కానీ ఆవిడ తాగే కాఫీలో రోజు సగం తీసేసుకుంటాడు, అదేంటి అంటే “నువ్వు చిన్నప్పుడు నా బూస్ట్ లో సగం తాగేసి, ఆపిల్ లో సగం తినేసి నాకు ఇచ్చావు గా” అంటాడు.

ఇతడు బాగా అర్థం అయ్యాడు కదా మీకు.

***********************************************************************

“కారుణ్య గారు, మా క్లైంటు మర్డర్ కేసు లో మీ సహాయం కావాలి” అన్నది తన జూనియర్ లాయర్ నయన.

“అతడు హత్య చేశాడని ఒప్పుకున్నాడా, ఒప్పుకుంటే అన్నీ సాక్ష్యాలు మాయం చేయమనండి” అన్నాడు.

“ఒప్పుకున్నాడు, కానీ ఆ ఇంటి ముందు  కొత్తగా  రోడ్ వేశారు, ఆ .తడి ఆరని సిమెంట్ రోడ్ మీద ఇతడి కాలి ముద్రలు పడ్డాయి. అసలే అతడి పెళ్ళి మరో మూడు వారాల్లో ఉందట”

“అయితే ఆ రోజు రాత్రే ఆ పిల్లని వర్జీనిటీ టెస్ట్ కోసం ఆసుపత్రి కి తీసుకెళ్లనాని చెప్ప మనండి”.

“అమ్మో, అలా అయితే ఆ పెళ్ళి ఆగిపోదా? అన్నిటి కన్నా ముందు అతడి పరువు పోదా?”

“హత్య చేసిన వాడు బతికి బయట పడటమే ఒక అదృస్టమ్, వాడికి పరువు ఉంటే అసలు హత్య ఎందుకు చేస్తాడు? ఆ పిల్ల నిజంగా ప్రేమిస్తే వీడికి అనుగుణంగా చెప్తుంది, లేదంటే చెప్పి పారిపోతుంది, బుద్ధిమంతురాలు అయితే.” అన్నాడు తీరిగ్గా.

అతడి చావు తెలివి తేటలకు నిర్ఘాంత పోయింది నయన.

***********************************************************************

“మీరు హత్య చేశారా వాసు గారు”? అని అడిగింది, నయన.

“లేదు, నా కాబోయే భార్య మీద అనుమానం తో,  ఆ రోజు రాత్రి ఆసుపత్రి కి వెళ్ళాను, కావాలంటే ఆమెనే అడగండి, పెళ్ళి కూడా ఆగిపోయింది. ”

నయన అతడి ఫియాంసిని పిలిపించింది. ” వాసు గారు మీ మీద అనుమానంతో ఆసుపత్రికి తీసుకెళ్ళారా?”

“అవును. అక్కడికి వెళ్ళాక అతడు అసలు విషయం చెప్పాడు, అందుకే పెళ్ళి ఆపేశాను.”

సాక్ష్యం లేనందున అతడిని నిరపరాధిగా పరిగణించి కోర్టు వదిలేసింది.

కోర్టు  మెట్ల మీద నయనను ఆపిన, వాసు ” మీరు నన్ను కాపాడారు, అనుకున్నదానికంటే రెట్టింపు డబ్బు ఈ కవరులో ఉంది, మీ ఫీస్ గా తీసుకోండి” అన్నాడు.

ఆమె ఆ కవరు అందుకొని ” అది సరే, మీ పియాన్సీ , పెళ్ళి ఆపేసింది కానీ,  మీకు అనుగుణంగా ఎలా చెప్పింది సాక్ష్యం?”

” పిల్ల చిన్నది, హత్య అనగానే భయపడింది. ఇక నా జోలికి రాకు అని నియమం పెట్టి పారిపోయింది. నాకు ఇంకో పిల్ల దొరుకుతుంది, నిజం తెల్సిన అమ్మాయి మంచి భార్య కాలేదు.” అన్నాడు చాలా ప్రశాంతంగా, ఒక యోగి ప్రవచనం చెప్పినట్లు.

**************************************************************************

నయన బస్ ఎక్కినా, వాసు గురించే ఆలోచిస్తోంది. “నిజం తెలిసిన పిల్ల,  మంచి భార్య కాలేదు” ఎంత క్రూరుడు. అయినా కూడా తన జీవితాన్ని అందంగా మలుచుకుంటున్నాడు.

బస్ దిగి నేరుగా ఆసుపత్రి బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి మొత్తం డబ్బు కట్టేసింది. “ఇంకా ఎన్ని రోజులు అవుతుంది, ఆశ్రిత డిశ్చార్గ్జ్ కి” అని అడిగింది నయన.

“రిపోర్ట్ బట్టి ఆవిడకు వెన్నుపూస గాయాల వల్ల, మరో మూడు నెలలు విశ్రాంతి కావాలి”  అన్నది కౌంటర్ లో గుమాస్తా.

ఆశ్రిత, నయన ప్రాణ స్నేహితులు. ఒకరికి ఒకరు తప్ప మరొకరు లేరు. ఆశ్రిత వృత్తి రీత్యా ఐ.పి.ఎస్. ఆఫీసర్. నిజాయితీ కి సాంపాల్ ముక్క అని చెప్పొచ్చు. అందుకే నెల జీతం తప్ప పక్క రాబడి లేదు. రెండేళ్ల క్రితం నయిట్ డ్యూటీలో  హంతకులని పట్టుకోబోతే వారు కట్టేసి రాడ్ తో బలంగా కొట్టారు. భవనం పై నించి కిందకు తోసేశారు ఆమెను.

అందరూ చూసి “మేమున్నాము దిగులు పడకు” అన్నారు కానీ, ఆసుపత్రి బిల్ మాత్రం నయనకే వదిలేశారు.

ఆశ్రిత గదిలోకి ప్రవేశించిన నయనకు, ఇదివరకటి కంటే బలంగా అడుగులు వేస్తున్న ఆమెను చూసి సంతోషం వేసింది. “సారి రా! మూడు రోజుల నించి ఒకటే కేసులు, కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. నిన్ను చూసేందుకు సమయం సరిపోలేదు” అన్నది ఎంతో బాధ తో.

“ఆ పని అంతా నా కోసమే అని నాకు తెలుసు” అన్నది చిరునవ్వుతో ఆశ్రిత.

“ఇంకెంత? ఒక్క మూడు నెలల్లో, నువ్వు- నేను మళ్ళీ మన రూం లో ఉండొచ్చు, ఇది వరకటి లాగా. రెండేళ్ల నించి ఒక్క దాన్ని ఎలా గడిపానో తెలీదు” అన్నది చాలా సంతోషంతో.

ఆమె నుదుటి చెమటను తుడుస్తూ ఆశ్రిత ” నయన, నా కోసం నువ్వు ఎలాంటి తప్పుడు కేసులు వాదించట్లేదు కదా? నీకు ఇది వరకు కూడా చెప్పాను” అన్నది.

“ఎందుకు వచ్చింది అనుమానం నా మీద.”?

“ఇంత డబ్బు ఎలా కట్టావు, ఒక్క చేతి సంపాదనతో”? అని అడిగింది ఆశ్రిత.

“నీకు అన్నీ అనుమానాలే, నేను అసలే అలసిపోయి వస్తే.. నీ ఇంటరాగేషన్ ఏంటి. నేను రేపు మళ్ళీ వస్తాను” అని కోపంగా బయటకు వచ్చేసి మళ్ళీ బస్ ఎక్కి ఆశ్రిత గురించి ఆలోచనలో పడింది నయన.

” ఏంటి తన మూర్ఖత్వం? తన మొహం ఎవరూ చూడలేదు, దారుణమయిన స్దితిలో కూడా. రెండేళ్ళు తన సంపాదన లేదు మంచం లో పడుంటే, నాకు దిక్కు లేదు. ఒక చెట్టు కింద ప్లీడరుని. దాని రక్షించుకోటానికి నానా గడ్డి కరిస్తే, నాకే నీతులు చెప్తోంది. వదిలేస్తే, ఇంకా మంచంలోనే ఉండేది” అని కసిగా తిట్టుకున్నది స్నేహితురాలిని.

*************************************************************************************”నయన గారు, నా ఫీసు ఇవ్వలేదు మీరు, వాసు కేసులో నేను ఇచ్చిన సలహాకీ ” అన్నాడు కారుణ్య కోర్టు గదిలో

“చిన్న సలహాకీ ఫీస్ అడుగుతారా? మీకు చాలా దబ్బున్దీ అని విన్నాను. ఇలా నా లాంటి చిన్న లాయరు ముందు చేయి  చాచటానికి సిగ్గు లేదా?”

“మాడమ్ మాట శుద్ది ఉండాలి. ఇలా అందరికీ ఉచితంగా సలహాలు ఇస్తే కోట్లు ఎలా వెనకేసే వాడిని?”

” ఒక చిన్న సలహా కోసం పీడిస్తారా?”

“హవ్వ! ఫీస్ అడిగితే  పీడించటం అంటారా? ఈ సారి మళ్ళీ సలహా కోసం రండి చెప్తాను” అని వెళ్ళి పోయాడు కారుణ్య.

అతడి  స్వభావానికి అతడినే చూస్తూ ఉండిపోయింది ఏవగింపుగా నయన.

**************************************************************

ఆశ్రిత బాధ పడ్డట్లే నయనను  అపరాధులు అయిన క్లైంట్లే కలిసి ఆమె ద్వారా గెలిచారు.  నయనకు ఒక పక్క బాధగా వున్న నిజాయితీ గా ఉన్న వాళ్ళను గెలిపిస్తే ఆశ్రిత ఆశయాలు మాత్రమే బతుకుతాయి, కానీ అపరాధులని గెలిపిస్తే ఆశ్రిత, ఆశ్రిత ద్వారా ఆమె ఆశయాలు కూడా బతుకుతాయి అని,  అన్యాయాన్ని శ్రమించి మరి గెలిపించింది నయన.

ఆరు నెలల తరవాత ఆశ్రిత తిరిగి తన ఉద్యోగంలో చేరింది. రెండేళ్ల కేసులు దుమ్ము దులిపి తిరగ తోడింది. పులి పంజా వేసినట్లు గుంట నక్కలు బెదిరి పోయాయి. అందరి కూశాలు కదిలినాయి. చివరిగా వాసుదేవ కేసు కూడా ఆమె బయటకు తీసుకొచ్చింది.అన్నీ కేసులను కారుణ్యకు అప్పగించింది ఆశ్రిత, ఎందుకంటే అతను అన్యాయమైన, న్యాయమైన ఒక సారి పని ఒప్పుకుంటే ఓడిపోయిన దాఖలాలు లేవు. అందుకే కాస్త ఖర్చు ఎక్కువ అయినా, పై ఆఫీశర్స్ ను ఒప్పించి మరీ అతడినే ఎన్నుకున్నది. కానీ ఇందులో నయన కూడా ఇరుక్కు పోయింది.

తనను తల్లి లాగా సాకిన స్నేహితురాలిని ఎలా కాపాడుకోవాలో తెలీక కారుణ్య ను కలిసింది ఆశ్రిత.

“మాడమ్ మీకో రూలు, ఊరికో రూలు… ఏంటి ఇది..పద్దతిగా లేదు”  అన్నాడు కారుణ్య.

“నయనకు సలహా ఇచ్చింది మీరే అని నాకు తెలుసు” అన్నది సూటిగా అతడి కళ్లలోకి చూస్తూ.

*************************************************************************************

“అమ్మ ఆశ్రిత, నువ్వు ఇవాళ బతికి నా ముందు నిల్చున్నవంటే అది నీ స్నేహితురాలి చలువ, నువ్వు చెప్పు ఆమెను వదిలేసేలా ఏర్పాటు చేస్తాను” అన్నారు జడ్జీ గారు ఫోనే చేసి.

“మీరు మీ ధర్మం నిర్వర్తించన్డి, నేను రాజీనామా చేస్తున్నాను, తనని పెరోల్ మీద విడిపించుకుంటాను. ”

“అలా చేస్తే డిపార్ట్మెంట్ ఒక నిజాయితీ గల ఆఫీసర్ ను కోల్పోతుంది. తన – మన తేడా ఉండాలి అమ్మ. నాకు నువ్వు ఏంటో తెలుసు, వదిలేయ్ ఆ పిల్లని.”

“న్యాయాన్ని, న్యాయంగానే రక్షించుకోవాలి. మరి నన్ను నా డెపార్ట్మెంట్ మర్చిపోయింది. కనుక నయన ఆ పని చేసింది, నన్ను రక్షించినందుకు నయనకు శిక్ష పడుతోంది. నా స్నేహితురాలిని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు, దయ చేసి ఇక్కడితో వదిలేయండి.” అని ఫోన్ పెట్టేసింది.”

************************************************************************************

నయన, వాసు, అతని మాజీ ప్రియురాలు, ఆసుపత్రి డాక్టరు అందరినీ కోర్టులో ప్రవేశపెట్టారు.

ముందుగా కారుణ్య వాసు  మాజీ ప్రియురాలిని, “కన్యత్వ పరీక్ష నిజమేనా” అని అడిగాడు, .

“లేదు, నన్ను వదిలేస్తాను, అలా చెప్తే అని అన్నాడు ” అన్నది.

తిరిగి డాక్టరు గారిని అడిగాడు “నిజమా ఆ అమ్మాయి చెప్పేది ?”

“అవును, ఆ అమ్మాయిని ఇప్పుడే చూస్తున్నాను, నన్ను బెదిరించి క్రితం సారి సాక్ష్యం చెప్పించుకున్నాడు.”

కారుణ్య వాసు కేసి చూస్తూ, హత్య, నేరం అని తెలుసు, దానిని కప్పి పుచ్చటం కూడా ఒక నేరం తెలుసా?” అని నిలదీశాడు.

అలాగే నయనను,  “ఒక భాద్యతాయుతమైన వృత్తిలో ఉండి, డబ్బు కోసం ఏదైనా చేస్తారా?” అని అడిగాడు.

అతడికి తెల్సు, నయన తన పేరు చెప్తుందని.  అయినా కేసు గెలవటమే అతడికి కావాలి, చివరికి తానే దోషి అయినా సరే, ఎందుకంటే ఆశ్రిత దగ్గర గెలుస్తానని మాట ఇచ్చి డబ్బు తీసుకున్నాడు.

నయన, ఆశ్రిత ఒకరిని ఒకరు మౌనంగా చూసుకున్నారు. కారుణ్య నయన దగ్గరకు వెళ్ళి చిన్నగా, “”ఆశ్రిత కోసం చేశానని చెప్పు, అది కూడా నేను చెప్పిన సలహా మేరకు” అని సలహా ఇచ్చాడు.

“కానీ ఆమె నేరం ఒప్పుకుంటాను, ఈ ప్రపంచానికి ఆశ్రిత లాంటి వాళ్ళ అవసరం చాలా వుంది. నా లాంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు” అన్నది స్తిరంగా.

అతడు స్థాణువు అయిపోయాడు. స్నేహితురాలిని కూడా న్యాయం కోసం వదలని ఆశ్రిత గొప్పదా, తన సహాయంతో  బతికి, మళ్ళీ తనకే శిక్ష వేసినా భరిస్తున్న నయన గొప్పదా.. అతడికి అర్థం కాలేదు.

“నా పేరు చెప్పు పోనీ..” అన్నాడు గుస గుసగా ఆమెతో.

“తీగ లాగితే డొంక కదిలి ఆశ్రిత ఉద్యోగం పోతుంది, నేను నేరం చేసింది తనను మళ్ళీ ఆ యూనిఫార్మ్ లో చూడాలని” అన్నది నిశ్చలంగా నయన.

ఇక అతనికి తన గెలుపు తధ్యం అని అర్థమయింది. కానీ ఎందుకో తృప్తిగా లేదు. తన నల్ల కోటు బల్ల మీద పెట్టి, బోనులోకి ఎక్కి, “నయన నా జూనియరు లాయరు, తను నా సలహా మేరకు మాత్రమే ఇలా చేసింది, కాబట్టి నాకు శిక్ష వేయండి ఆమెను తప్పుడు దోవలో నడిపినందుకు” అన్నాడు.

అతడిలో జీవితంలో మొట్టమొదటి సారి విజయం చవి చూసినట్లు అనిపించింది.

వాసును, కారుణ్యను రిమాండ్ కు పంపింది కోర్టు.

నయన కు అతడు అర్థం కాక అతడి వెంట పరిగెత్తి “ఆ రోజు ఫీస్ అడిగితే కసురుకున్నాను, కానీ నా శిక్ష మాత్రం నువ్వు తీసుకున్నావ్, ఇది న్యాయం కాదు” అన్నది.

అతడు నయన అమాయక్త్వానికి మురిసిపోతు, “ఫీసు వదిలేసి చాలా బాధ పడ్డాను, కానీ శిక్ష వేయించుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో అన్యాయాలు చేశాను, ఎక్కడో అక్కడ పట్టు బడాల్సిందే. అది నీ లాంటి వాళ్ళ కోసం, ఆశ్రిత లాంటి వాళ్ళ కోసం అయితే కాస్త ఎక్కువ తృప్తీ. ఈ ప్రపంచానికి మీ లాంటి వాళ్ళే  కావాలి” అన్నాడు.

“కానీ…” అని ఆమె ఏదో చేప్పెంతలో

“చూడు నయన! తప్పు చేసే వాడికి ఎప్పుడు ఒకటి తెల్సు, ఒక రోజు పట్టు బడాలని, అయినా తప్పు చేస్తాం. ఈ చట్టం కూడా ఏమి చేయలేదు, కానీ మాకు ఒక అంతరాత్మ అనే కోర్టు ఉంది, దాని ముందు తప్పించుకోలేము.”

కారుణ్య జీపు కదిలింది.

**************************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s