చిరుద్యోగి

“చెప్పండి పిలిచారట”

మిమ్మల్ని డిస్ట్రబ్ చేశాన?

“లేదు చెప్పండి”

“ఈ రోజు చివరి రోజు కదా, అందుకనే.. ఒక్క సారి”

“పర్లేదు చెప్పండి”

అతను చేప్పే లోపల ఆమె పి.ఏ వచ్చి, .”మాడమ్ క్యాబ్ వచ్చింది, మీరు బయలుదేరొచ్చు” అన్నది.

అలాగే అని తలూపి, “చెప్పండి” అని మరలా అతడి కేసి చూసింది.

“దీని మీద సంతకం పెట్టండి”

“పిచ్చా, తెల్ల కాగితం ఇచ్చి సంతకం పెట్టమని అడుగుతున్నారు”, అన్నది మృదువుగా నవ్వుతూ.

“మరి నేనంటే నమ్మకం అన్నారు కదా..”!

“అది వేరు,  పరుసా..”

“ఇంకెపుడు నన్ను పరుశా అని పిలవకండి, నమ్మకం ఉంటే పరుశా అని పిలవండి లేదంటే పరుశురామ్ అనండి”

ఆమె మారు ఆలోచించకుండా సంతకం పెట్టి బయలు దేరింది.

“నేను మోసం చేస్తే,” అన్నాడు నిష్కల్మషంగా నవ్వుతూ.

“అలాగే చేయి, సిద్ధంగా ఉండే సంతకం పెట్టాను” అని ఆమె క్యాబ్ ఎక్కింది.

అమెరికా వెళ్ళి 6 నెలలు అయింది, ఆమె నుండి అతడికి ఫోన్ రాలేదు, అతడు ఆమెకు ఫోనే చేయలేదు.

అకస్మాత్తుగా ఆమె మీద నిధుల దుర్వినియోగం చేసిందంటూ సొంత కంపెనీ వారు ఆమె మీద కేసు పెట్టి ఇండియా కి రప్పించారు.

పోలీసులు కంపెనీ కే వచ్చి 4 గంటలు విచారించారు.

ఆమెకే తెలీకుండా ఎవరో నిధులు దొంగ మార్గంలో కొట్టేశారు.ఆమె నుండి ‘తెలీదు’ అనే సమాధానం తప్ప మరొకటి లేదు, నిజంగా తెలీదు కదా మరి.

అప్పుడే పి‌.ఏ  వచ్చి “ఆ రోజు పరుశా మీతో ఏదో సంతకం చేయించుకున్నాడు గుర్తు ఉందా” అని అడిగింది.

అంతే ఆమె కూడా మరిచిపోయిన ఆ సంగతి గుర్తు రావటంతో ఒక్క సారిగా ముఖం లో నెత్తురు చుక్క  లేదు.

పోలీసులు ఆమె కాల్ డాటా మీద నిఘా పెట్టారు. ఎన్ని చెక్ చేసినా ఎక్కడ ఒక్క క్లూ దొరకలేదు.

కానీ ఆవిడ కి తప్ప ఇంకెవరి సంతకం చెల్లని డాక్యూమెంట్స్ మీదా కూడా సంతకాలు ఉన్నాయి, కాబట్టి ఇంటరాగేషన్ తప్పదని స్టేషన్ కి తీసుకెళ్ళారు.

కీలకమయిన షేర్ హోల్డర్స్ లో ఒకరు ఆత్మ హత్య చేసుకొని చనిపోయారు, “నీ మీద ఉన్న నమ్మకం తో సొంత ఆస్తులు అమ్మి కంపనిలో పెట్టుబడులు పెట్టాను, నువ్వే మోసం చేస్తే ఇక అర్థం లేదు నిజాయితికి” అంటూ ఉత్తరం వ్రాశాడు చనిపోతూ, ఆమెకు.

ఇక ఆరేస్ట్ చేసి ఆమెను జైలు లో కూర్చోపెట్టింది చట్టం.

అందరికీ తెల్సు ఆమె అలాంటి పని చేయ లేదని, అందరికీ తెల్సు ఆమె అంత కిరాతకురాలు కాదని.కానీ స్పస్టంగా సంతకాలు అమెవే, దుమ్మెత్తి పోసింది లోకం, తనను ఏ నోళ్ళు అయితే పొగిడాయో ఆ నోళ్లే దూషించ సాగాయి.

ఒక్క సారిగా అగాధం లో కూరుకు పోయిన అనుభూతి చెందిన ఆమెకు తన కంపెనీ షేర్ హోల్డర్ చనిపోయిన వార్త కుదిపేసింది, అది కూడా అకారణంగా.

టి‌.వి. లో వార్తలు .”ఒక చిరుద్యోగి తో కలిసి సి‌.ఈ‌.ఓ. కంపనీ ని ముంచేసిన నిర్వాకం” అంటూ స్క్రోల్ అవుతున్నాయి, కానీ ఆమెకి మాత్రం అవి చెవి కి ఎక్కటం లేదు. అతడికి కబురు పంపాలని ప్రయ్త్నించింది, ఆ తెల్ల కాగితాలు ఏం చేశాడో తెలుసుకుందామని. కానీ అతడు సంతకం పెట్టమన్నది తన మీద నమ్మకం ఉంటే అని, ఇప్పుడు అడిగితే ఆ నమ్మకo లేనట్లే కదా….అంతే చప్పున ఆగిపోయింది.

మరునాడు కోర్టులో ఆమెను ప్రవేశ పెట్టారు, “నాకు తెలీదు” అనే సమాధాన0 తప్ప ఆమె దగ్గర మరోటి రాలేదు, కానీ సంతకం తనది  అయి ఉండటం వల్ల శిక్ష కి సిద్ధంగా ఉన్నాను అని స్వచ్చంధంగా ఒప్పుకున్నది.

ఆమె తన వ్యాపార లావా దేవీల కన్నా తన నిజాయితీ ద్వారా నే చాలా మందికి తెల్సు. కానీ చట్ట ప్రకరాo ఆమె దోషి, శిక్ష ఖరారు చేస్తూ, ఎలాంటి శిక్ష వేయాలో రెండు రోజుల తర్వాత ప్రకటిస్తామని న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది.

అప్పటి దాకా ఆ తీర్పు కోసం ఎదురు చూస్తున్న కళ్ళు చల్ల బడ్డాయి, ఎవరో కొందరు ఆమెను నమ్మిన వారు మాత్రం ” ఇది నిజం కాదుగా అంటూ” నోళ్ళు వెళ్ళబెట్టారు.

రెండు రోజుల తర్వాత ఆమె శిక్ష ఖరారు చేసే సమయం వచ్చింది, అన్నిటికి సిద్ధం గా ఉన్న ఆమెకు పెద్దగా తీర్పు మీద ఉత్సాహం లేదు. కానీ ఇంతలో కొన్ని పేపేర్లు జడ్జీ గారికి పరుశురామ్ అందించాడు.

అవి చూసిన జడ్జి గారు చదువుకొని, విజ్ఞత లేకుండా  కోర్టు సమయం వృధా చేసినందుకు మందలిస్తూ శిక్ష రద్దు చేశారు.

ఇన్ని రోజులు లేని పరుశురామ్ అకస్మాత్తుగా ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడని విడుదల చేశారనుకుంటూ బయటకు అడుగులు వేసింది.అతడు వచ్చి ఆమె ఎదురుగా నిలుచున్నా ఆమెకు మాట్లాడాలని మనస్కరించక మౌనంగా ఉన్నది.

“పరుశా!” అని పిలుస్తారా, లేక పరుశరామ్ అని పిలుస్తారా? అన్నాడు నవ్వుతూ.

ఆమె మరింత మౌన రూపాన్ని దాల్చటంతో అతడు  ” సరే వినండి, ఇవి మీరు నా పేరున పెట్టిన పవర్ ఆఫ్ అటార్నీ కాగితాలు, అంటే కొన్ని రోజులు మీరు లీగల్ విషయాలు పట్టించుకోరు, కనుక మీరు లేని సమయంలో ఆ భాద్యత నాకు అప్పగిస్తూ సంతకం చేసిన కాగితాలు అన్నాడు.

నేను నీకు ఇవ్వలేదు…

“తెల్సు, కానీ మీ అమెరికా ప్రయాణం కన్నా ముందు మీ వెనుక కుట్ర మీ పి.ఏ తో కలిసి కంపెనీ వాళ్ళు చేయటం  నాకు తెల్సింది.అవి కూడా ఇప్పుడే కోర్టులో ఇచ్చాను, మీరు నిశ్చింతగా వెళ్ళి రండి” అన్నాడు.

“వెళ్ళొస్తా పరుశా” అంటూ అక్కడ నుండి కదిలింది..ఆమె..

కారులో కూర్చున్న ఆమెకు పరుసా తో తన గత అనుభవం గుర్తుకు వచ్చింది.అతడికి ధైర్యం తప్ప మరోటి తెలీదు, ఒద్దికతనం తప్ప దౌర్జన్యం తెలీదు. ఏదో సాధించాలని వచ్చి ఏమి చాతకాక  కూర్చున్న అతడికి బతుకు బడి లో పాఠాలు నేర్పింది, పల్లె నించి వచ్చిన అతడికి పట్న వాసం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడింది, అమర్యాదస్తులకు దూరం చేసి ఒక చిన్న ఉద్యోగం ఎలా నిలబెట్టుకోవాలో నేర్పింది.  చేసిన చిరు సహాయం ఆమెకు కొండంత అండగా నిలిచింది…

రచయత్రి అంతరంగం: గుడ్డి నమ్మకం మోసం చేస్తుంది కానీ మన్స్పూర్తిగా నమ్మిన నమ్మకం వమ్ము కాదు.

అందరికీ అన్నీ అందించలేము కానీ, మన చేతిలో ఉన్నవి మనం చేయగలిగినవి ఉన్నప్పుడు,  ఆ అవకాశం మీకు వచ్చినపుడు అదృష్టం గా భావించండి.

ఎందుకంటే జీవితం మనదే అయినా అది మన సొంతం మాత్రమే కాదు, మన సాటి మనుషుల కోసం కూడా మనన్ని పుట్టిస్తాడు భగవంతుడు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s