శ్వేత నాగు

కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉంది …తన లక్ష్యాన్ని చేరుకోటానికి, పొత్తుల నియమిత సమయం ప్రకారం, ద్వారం తెరవటానికి. వరుణదేవ ఆ ఉత్ఖంఠతకు, తన నుదిటిన జారుతున్న  చెమటను తుడవటానికి సైతం చలించటం లేదు. తదేకంగా ముఖ ద్వారపు తాళాన్నే చూస్తున్నాడు.

ఎందుకంటే ఈ మూడు నిమిషాల్లో ఏదన్నా జరగొచ్చు.. రెప్ప పాటు కాలం చాలు- విష సర్పము వ్రిత్రి తన మీద దాడి చేయటానికి,  లేదా తన కన్నా ముందే గార్గి ముఖ ద్వారం ఛేదించి లోపలికి ప్రవేశించి తన లక్ష్యాన్ని, ఆమె కైవసం చేసుకోవటానికి,  తానుగా ఈ సాహసం చేసి తన సత్తా చాటుకోవాలనే అతని లక్ష్యం నీరు కారటానికి..

కేవలం 2 నిమిషాలు: ఊపిరి బిగపట్టి సమయం కోసం వేచి చూస్తున్నాడు.

ఒక్క నిమిషం: తన మనస్సులో తల్లిని తలుచుకొని ఒక్క వేటు వేశాడు తాళం కప్ప మీద, తాళం విరిగి కింద పడింది… ఆశ్చర్యం  ఎదురుగా తొలి ఉదయపు కిరణాల కాంతిలో, 25 అడుగుల విష సర్పాన్ని మెడ నుంచి నడుము వరకు చుట్టుకొని గార్గి దేవి దర్శనమిచ్చింది …..తన కన్నా ముందే చంద్ర గిరి కోటలోకి ప్రవేశించింది, వేసిన తాళం వేసినట్లు గానే వుంది.

అతడి చేతికి ఆమె తన వామ హస్తంతో “రాజు గారి ప్రత్యుత్తరం తీసుకోండి” అంటూ అందించింది. అచకితుడై చూస్తుండి పోయాడు… ఆమెను, వరుణ దేవుడు.

*******************************                                  ********************

“ఇది నీకు వెన్నతో పెట్టిన విద్య గార్గి దేవి, అందుకే మీ ముందు ఈ సమస్యను ఉంచుతున్నాను. నా నమ్మకం వమ్ము కాదు అని ఆశిస్తాను” అన్నాడు మహారాజ చతురేంద్ర వర్మ.

“ఆజ్ఞాపించండి మహా రాజా!” అన్నది స్థిరంగా గార్గి దేవి.

తూర్పు దిశ నున్న  అకుతల రాజ్యం వైపు నుండి మన వైపుగా యుద్ధ సూచనలు కనిపిస్తున్నాయి. ప్రమాదానికి పెద్దగా సమయం లేదనిపిస్తోంది. కేవలం నాలుగు రోజులలో ఏదో ఒకటి చేసి ఈ ఆగ్ర రాజ్య ఆక్రమణ బారి నుండి మన రాజ్యాన్ని కాపాడుకోవాలి”

“తూర్పు దిశ రాజ్యానికి మనకి మధ్యలో ఒక రాజ్యం విష్ణు వర్మది కదా! వారితో మైత్రి మన పనిని సులభం చేస్తుంది కదా మహా రాజ!”

“మనకు సమాచారం కొద్దిగా ఆలస్యంగా తెలిసింది, విష్ణు వర్మ అప్పటికే అకుతల సామ్రాజ్యానికి  సంధి మాట ఇచ్చేశాడు. అతడి సంగతి అందరికీ తెలిసిందే. ఆడిన మాట తప్పడు. అక్కడ నుంచి ఆశ వదులుకున్నట్లే ఇంక.”

“విష్ణు వర్మ రాజ్యం మన రాజ్యానికి ఎడమ వైపు ఉన్నది కదా!, మరి కుడి వైపున ఇంకో 5 రాజ్యాలు ఉన్నవి, అటు నించి ఎందుకు ప్రయత్నించ కూడదు  ప్రభు?”

“వారిని అందరినీ ఒప్పించి మెప్పించి ఒక తాటి మీదకు తీసుకు రావటానికి కావల్సిన సమయం లేదు మనకు…కేవలం నాలుగు రోజుల్లో ముప్పు ముంచుకొస్తోందని  గూఢచారుల సమాచారం. నేను రాజ్యాధిపతిని..  గార్గి దేవి. ఇలాంటివి తెలియవా నాకు?”

ఆమే ఒక్క చిరు నవ్వు నవ్వి సున్నితంగా, “అందుకు కూడా దిగులు లేదు ప్రభు, మన రాజ్యపు పొలిమేరల్లో మన రాజ్యం నిండి  చంద్రగిరి రాజ్యానికి ఒక రహస్య స్వరంగ మార్గం ఉంది. అది అక్కడున్నట్లు ఎవరికి తెలియదు, ఇప్పటి చంద్ర గిరి మహారాజు కి కూడా, ఇప్పుడు మనం చంద్రగిరి మహా రాజుకి మన పొత్తుల నియమం ప్రకారం చెప్పి వారి రాజ్యం లోకి  ప్రవేశిస్తాము. అటు పై  వారి పొరుగు రాజ్యమైన అకుతుల  మీద మనమే ముందుగా దండెత్తి వారిని అణిచి వేస్తాము. కాక పోతే ఈ వ్యూహాన్ని అంతా, సరిగ్గా చంద్రగిరి మహా రాజుకి  చేరవేసే వారు కావాలి, మూడో కంటికి తెలీకుండా. మనం విజ్రభించే వరకు చంద్రగిరి మహారాజు కిమ్మనకుండా ఉండాలి, అందుకు ప్రతిగా ఈ 5 దేశాలకు చూపబోయిన లాభాన్ని  వారికే ఇస్తాము.”

“మాకు కూడా తెలియని ఆ స్వరంగ మార్గం మీకెలా తెలుసు గార్గి దేవి”

“మీరు ప్రభువులు, మీ రాజ్యపు సరి హద్దులు, మూలాలు మీకు తెలిసినా తెలియక పోయినా, మీ కొలువులో తర తరాలుగా పని చేస్తున్న మాకు తెలియాలి, అది మా వృత్తి ధర్మం. అందుకే మా వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ, రాజ తంత్రాలను పూస గుచ్చినట్లు  ప్రతి విషయాన్ని మా తాతగారు మాతో పంచుకున్నారు”

“ఇక అసలు విషయానికి వస్తే ప్రభు!  అక్కడ వ్రిత్రి అనే దేవ జాతికి చెందిన విష సర్పాన్ని ఎదుర్కోవాలి, ఆ సర్పాన్ని చిన్నతనంలో మా తాతగారితో అక్కడున్న దేవాలయానికి వెళ్ళినపుడు కాపాడాను ఊరి ప్రజల నించి. ఆ తర్వాత ఆ సొరంగ మార్గంలో వదిలేసాను, ప్రతిగా సహాయము చేస్తాను అని అదే ప్రాధేయ పడింది , అప్పుడు తన మాట కాదన లేక ఆ స్వరంగ మార్గం కు తననే  రక్షణగా ఉండమని చెప్పాను. కానీ తర్వాత నేనెపుడు తిరిగి ఆ సర్పాన్ని చూడలేదు. కనుక ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను కూడా గుర్తించదు, లోపలికి అనుమతించదు,  ఆ జాతి సర్పాలు నిజాయితి కి మారు రూపాలు. పేరుకి విష సర్పాలైన తమను రక్షించిన వారిని, వారి వంశాన్ని అవి బతికున్నంత కాలం కాపాడుతాయి”.

“భళా! గార్గి దేవి. ఇక ఉపేక్షణకు తావు లేదు. నాకు మీ మీద నమ్మకం ఉంది, కాక పోతే పట్టపు రాణి అయిన ముకుళా దేవి సహోదరడడు అయిన వరుణ దేవను  కూడా ఈ పని కోసం నియమిస్తున్నాము”

“వ్రిత్రి ని వరుణ దేవ నించి  రక్షించటం నాకు …”

“సర్ప దోషాలకు మేము కూడా సిద్ధంగా లేము గార్గి, అతడికి  మా మాటగా ఆజ్ఞాపిస్తాము, మీరు సంతోషమైన కబురు తో తిరిగి రండి.”

గౌరవ పూర్వకంగా ఆయన ముందు తన శిరస్సును, ఖడ్గాన్ని వంచి నమస్కరించి నిష్క్రమించింది గార్గి దేవి.

ఆకు పచ్చని అరణ్యం, పొగ మంచుతో మసక కమ్మి ఎవరూ పట్టించుకోకపోయినా ఎండిపోయి రాలిన ఆకులతో అందంగా ముస్తాబు అయింది.

దారికిరు  ప్రక్కల గుబురయిన చెట్లతో నిండిపోయి ఉన్న అడవిలో, నెమ్మదిగా ఒక్కో కొమ్మని అడ్డు తొలగించుకుంటూ స్వరంగం వద్దకు చేరింది గార్గి దేవి. పురుగులు, చీమలు కదిలినట్లు సరు సర్రున రక రకాల పాములు కదులుతున్నాయి.. తన కాలికిరు వైపులా. స్వరంగంలోకి ప్రవేశించిన మరు క్షణంలో ఆమెకు, గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది, వడి వడిగా అటు కేసి నడిచింది.

వరుణ దేవుడు ఖడ్గాన్ని ధరించి స్వరంగం ముఖ ద్వారం కేసి దూసుకుపోతున్నాడు. ఆమె తన అశ్వం మీద అతడిని అతి వేగంగా చేరుకుని అతడి దారికి అడ్డుగా నిలబడి  “ ఈ స్వరంగ మార్గ ముఖ ద్వారం మూడు రోజుల్లో వచ్చే అమావాస్య రోజున, 3.45 నిమిషాలకు మాత్రమే తెరవ వలసి ఉంది” అన్నది

ఈ సర్పాల మధ్యలో, చీకటి పుంతలలో ఒక స్త్రీ ఉన్నది అంటే,  ఈమె ఖచ్చితంగా ‘గార్గి దేవి’ అయి ఉంటుంది, అని భావించి “కారణం” !? అని అడిగాడు ఆశ్చర్యంగా .

“పక్క రాజ్యపు పొత్తుల నిభందనల ప్రకారo, అనుకున్న సమయం కన్నా ముందే వారి రాజ్యములోకి ప్రవేశము నిషిద్ధము.”

“కానీ ఈ లోపు ముప్పు ముంచుకొస్తే”?

“మన ప్రమాదాలను  మనమే ఎదుర్కోవాలి కానీ పొరుగు రాజ్యాలతో ఉన్న పొత్తుల నియమాలను  ఉల్లంఘించి వారిని చిక్కుల్లో పడేయకూడదు”

“మీరు స్త్రీలు, మిమ్మల్ని గౌరవిస్తున్నాను, కానీ నా కర్తవ్యానికి అడ్డు పడకండి, మీన మేషాలు లెక్క పెట్టె సమయం కాదు ఇది, గార్గి దేవి!”

“మీరు పురుషోత్తములు, మీకు శిరస్సు వంచి ప్రణమిల్లుతాను, కానీ రాజ్యాన్ని అపఖ్యాతి పాలు చేస్తే సహించలేను, సహకరించగలరని ఆశిస్తున్నాను.”

అతని అహంభావము దెబ్బ తిని, “ వ్రిత్రి ని మీరు ఒక్కరే సంభాళించగలరు, అని రాణి గారి ద్వారా తెలిసింది, కనుక మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహించి, మా మార్గాన్ని సుగమం చేయమని అర్థిస్తున్నాను” అన్నాడు కఠినంగా.

“ఇక్కడ వ్రిత్రి ని సంభాళించటమే క్లిస్టమయిన పని, లేదంటే ఆ ముఖ ద్వారం ఒక పసి పాపడు కూడా బ్రద్దలు చేయగలడు” అన్నది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ.

“రాజు గారి క్షేమం, మీ ధర్మం గార్గి దేవి! నేను గుర్తు చేయవలసిన అగత్యం లేదు మీకు..”

“రాజ్య క్షేమమే రాజు గారి ప్రధానోద్దేశ్యము, మరవకండి వరుణ దేవ” అని వ్రిత్రిని వెతికే పనిలో నిమగ్నమయినది ఆమె.

ఆమె రాజ్య క్షేమము, రాజ క్షేమము పై ఉన్న  ఆలోచనా ధోరణికి  విస్మయుడియానాడు వరుణ దేవ.

స్వరంగం అంతా బూజులు, పురుగులు, చీకటి, భరించ రాని దుర్గంధంతో నిండి పోయి ఉంది. ఆ దేవ సర్పం తనను గుర్తు పడితే తన పని సులువు అవుతుంది కానీ గుర్తించని పక్షంలో ఎటు నించి అయినా మాటు వేసి కాటు వేయగలదు. ఆమె ఊపిరి బిగించి నలు వైపులా వెతకనారభంచింది. రెండు గంటల కృషి తో వ్రిత్రి ని చేరింది ఆమె, ఒక చీకటి గదిలో పాల జున్నును పోలిన త్వచముతో, శ్వేత వర్ణముతో మిల మిలా మెరిసిపోతోంది. ఈ జాతి సర్పాలు 25 అడుగులు ఉంటాయి. “ఒక్క సారి శత్రు జాడ పసి కట్టాయో చంపే వరకు వదలవు. కానీ నేను శత్రువు కానీ శత్రువుని సర్పానికి ,తను నన్ను ఎలా గుర్తు పట్టగలదు?” అనుకోని లోపలికి అడుగులు వేసింది. ఆ అడుగుల సవ్వడికి ఒక్క సారిగా సర్పం బుసలు కొడుతూ లేచింది. అది చూసిన గార్గి అడుగులు వెనక్కి వేసింది.

ఆదే సమయములో వరుణ దేవుడు వ్రిత్రి ని  వెతుకుతూ అక్కడికి చేరుకున్నాడు. అప్పుడే అతని కళ్ల ముందు పడ్డది ఆ భయంకర మైన దృశ్యం ‘ఆ సర్పం గార్గి దేవి ని ఉప్పెనలా కబళించపోతోంది’. అతను ఒక్క క్షణం ఆలోచించకుండా, ఒక్క సారిగా విరుచుకు పడి గదికి  పై నున్న ఉక్కు తలుపులను కిందకు దించి వేసి, గార్గి దేవిని గది బయటకు లాగేశాడు . ఆమె మీద పడాల్సిన వేటు ఉక్కు తలుపులకు తగిలి ప్రతి చర్యగా వెనక్కి పడి పోయింది ఆ సర్పం. ఆ ఊహించని పరిణామానికి అది మరింత ఉగ్రంగా విలయ తాండవం చేయనారంభించింది. అది పెట్టె రోదనలకు స్వరంగం దద్దరిల్లి పోయింది.

అప్పుడర్థమయింది అతడికి ఆ వ్రిత్రి ఎంత బలమయిన సర్పమో, “దీనిని వధించటo తప్ప మనకు గత్యంతరo లేదు గార్గి” అన్నాడు.

ఆమె మాత్రము “మీ కంటికి అది బలమయిన విష సర్పము, నాకు ఒక నిజాయితీ గల స్నేహితురాలు, కాలమనే శిధిలాలో నన్ను మరిచి పోయింది కానీ , ఇప్పుడు అది చేసిన దాడి కేవలం, నేను అప్పగించిన బాధ్యత కోసమే” అన్నది నిశ్చలంగా.

ఆ సర్పము గది లోపల నించి బలంగా ఉక్కు ద్వారపు తలుపులను తన తలతో మోదుతోంది. ఆ బాధ భరించలేక తానే గట్టిగా అరుస్తోంది, ఆ సబ్ధాలకు రాళ్లు విరిగి కింద పడుతున్నాయి,  కానీ వదలటం లేదు.

“ఇక ఈ రోజుకి, ఈ సర్పమును  సంబాళించలేము” అని అనుకోని వారు అక్కడి నించి వెళ్ళి ముఖ ద్వారం వెతక నారంభించారు.

ఒక్క రాత్రి అంతా వెతికాక వారికి అక్కడికి దగ్గరలోనే ఉందని కనుగొన్నారు, కానీ తెరిచేందుకు ప్రయ్త్నిస్తే, సర్ప బారిన పడాల్సి వస్తుంది, ఇక ఎప్పటికీ పగ పట్టి వదలదు ఆ జాతి, అందుకే తానుగా వ్రిత్రి ని ఒప్పించాలని  తిరిగి సర్పం ఉన్న చోటుకీ  బయలుదేరింది.

గార్గి, సర్పమున్న గదిలోకి కిటికీ ద్వారా తొంగి చూసింది, అక్కడ ఆమెకు వంగి ఉన్న కిటికీ చువ్వలు, రక్త సిక్తమయిన గోడలు కనబడ్డాయి. అనుకున్నట్లే సర్పo తప్పించుకున్నది, ముఖద్వారం  వద్దకు చేరుకొని ఉంటుoది అని ఆమె అటు కేసి పరుగులెట్టింది.

అప్పటికే వరుణ దేవ అక్కడికి చేరుకొని ముఖ ద్వారపు తలుపులను స్పృశించాడు. అంతే ఒక్క సారిగా  పై నుండి బలంగా అతడిని చుట్టి వేసింది సర్పము. అతడి ఖడ్గము కూడా ఆ విసురుకి ఎక్కడో మూలన పడి పోయింది . సర్పాన్ని వదిలించుకోటానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు అతడు, చివరికి చేసేది లేక దానిని గాయ పరిచి అక్కడి గోడల కున్న మేకులకు దాని తోకను గుచ్చాడు కదలకుండా. రక్తం కారిపోతున్న దాని తల భాగంతో  అతడిని చుట్టి విసిరేసింది బలంగా స్వరంగం  అవతలకి. అతడు స్వరంగం  అవతల పడ్డాడు కాబట్టి, సర్పము తన గోడలను దాటి బయటకు రాలేదు నియమము ప్రకారం, కనుక అతడిని వదిలేసింది.

మేకులు గుచ్చుకుని విల విల లాడుతున్న సర్పం దగ్గరకు గార్గి పరుగున వచ్చింది, దాని బాధ చూడలేక నచ్చ చెప్పబోయింది. కానీ అది అందుకు తావు ఇవ్వకుండా ఆమె మీదకు దాడి చేసింది. ఆమె తప్పించుకుని తన బాల్యపు చిత్రాన్ని చూపించింది. కానీ అప్పటికే శత్రువు అని స్థిర నిర్ణయంతో ఉన్న సర్పం, ఆమె మీదకు దాడికి సిద్దమయినది. కానీ గార్గికి  మాత్రం ముందు తనను బంధ విముక్తురాలిని చేయాలని అనుకోని, ఆ మేకులని తొలగించి, నెమ్మదిగా లేపనం అద్దింది. ఆమె చేతి స్పర్శ, సర్పానికి గతంలో చిన్ని పాప గార్గి స్పర్శను గుర్తు చేశాయి. సర్పం ఒక్క సారిగా ఆమె ముందు మోకరిల్లింది.

గాయాల నుండి స్పృహలోకి వచ్చిన వరుణ దేవ మరలా ముఖ ద్వారం వద్దకు వచ్చాడు. అక్కడున్న రక్తపు మరకలు చూసి గార్గిని వెతికి, చివరికి సర్పాన్ని చంపవలసి వచ్చింది కాబోలు అనుకున్నాడు. తిరిగి సమయం గుర్తొచ్చి ముఖ ద్వారం తలుపులు తెరవటానికి సంసిద్ధమయినాడు.

కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉంది …తన లక్ష్యాన్ని చేరుకోటానికి, పొత్తుల నియమిత సమయం ప్రకారం, ద్వారం తెరవటానికి. వరుణదేవ ఆ ఉత్ఖంఠతకు, తన నుదిటిన జారుతున్న  చెమటను తుడవటానికి సైతం చలించటం లేదు. తదేకంగా ముఖ ద్వారపు తాళాన్నే చూస్తున్నాడు.

ఎందుకంటే ఈ మూడు నిమిషాల్లో ఏదన్నా జరగొచ్చు.. రెప్ప పాటు కాలం చాలు- విష సర్పము వ్రిత్రి తన మీద దాడి చేయటానికి,  లేదా తన కన్నా ముందే గార్గి ముఖ ద్వారం ఛేదించి లోపలికి ప్రవేశించి తన లక్ష్యాన్ని, ఆమె కైవసం చేసుకోవటానికి,  తానుగా ఈ సాహసం చేసి తన సత్తా చాటుకోవాలనే అతని లక్ష్యం నీరు కారటానికి..

కేవలం 2 నిమిషాలు: ఊపిరి బిగ పట్టి సమయం కోసం వేచి చూస్తున్నాడు.

ఒక్క నిమిషం: తన మనస్సులో తల్లిని తలుచుకొని ఒక్క వేటు వేశాడు తాళం కప్ప మీద, తాళం విరిగి కింద పడింది… ఆశ్చర్యం  ఎదురుగా తొలి ఉదయపు కిరణాల కాంతిలో, 25 అడుగుల విష సర్పాన్ని మెడ నించి నడుము వరకు చుట్టుకొని గార్గి దేవి దర్శనమిచ్చింది …..తన కన్నా ముందే చంద్ర గిరి కోటలోకి ప్రవేశించింది, వేసిన తాళం వేసినట్లు గానే వుంది.

అతడి చేతికి తన వామ హస్తంతో రాజు గారి ప్రత్యుత్తరం అందించింది. అచకితుడై చూస్తుండి పోయాడు ఆమెను వరుణ దేవుడు.

“ఇప్పుడు రాజ్య పొత్తులు ఉల్లంఘన కాలేదా గార్గి?” అని నిలదీశాడు వరుణ దేవ

“ఉల్లంఘనా ? ఎలా?” అని అడిగింది ఆశ్చర్యంగా

“మీరు, అనుకున్న సమయం కన్నా ముందు ఎలా చంద్రగిరి కోటలోకి వెళ్ళారు”?

“రాజు శ్రేయస్సు కొరకు తప్పు లేదు, మీన మేషాలు లెక్కపెట్టకూడదు” అని  మీరే చెప్పారు కదా!”  అన్నది చిరు నవ్వుతో

ఆ మాటకు అతడు “మీ మీదున్న గౌరవం పోయింది గార్గి దేవి, మీ మాట నమ్మి నేను సమయం కోసం వేచి ఉన్నాను, కానీ దొంగ దోవలో మీరు దెబ్బ తీశారు” ఆన్నాడు.

ఆమె ఆ పాడుబడ్డ సొరంగంలో పొదల మద్య కూర్చొని,  నిదానంగా వ్రిత్రిని వదిలేసి, తన గాయలకు పసరు వైద్యం చేసుకుంటూ “నేను చెప్తే ఆగిపోతారా?” అన్నది కవ్విస్తూ…

“ ఈ  ప్రత్యుత్తరo కూడా మీరే ఇవ్వన్డి రాజు గారికి” అన్నాడు కోపoగా.

“నాకు పని అవ్వాలి, మెచ్చుకోలు కోసం ఏ పని చేయను, మీరే ఇవ్వండి” అని తన అశ్వం మీద తిరుగు ప్రయాణం అయింది.

చంద్రగిరి కోట నుండి వీరు ప్రవేశించి అనుకున్న పధకం ప్రకారం శత్రువులను మట్టు పెట్టారు.

మహా రాజు  నిండు సభలో గార్గి దేవికి సన్మానం చేస్తుండగా , “దొంగ తెలివి తేటలు” అని పట్టపు రాణి పరిహసించగా వరుణ దేవుడు స్వరంగ మార్గపు చిత్ర పటం చూబించి ఆమె చెప్పింది అసలైన చంద్ర గిరి ప్రవేశ ముఖ ద్వారం గూర్చి, కానీ నేను వేచి ఉన్నది మన రాజ్యపు అంతిమ ద్వారం దగ్గర” అని నిజాయితీ గా ఒప్పుకున్నాడు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s