సర్కస్

సింహాన్ని ఎపుడైనా అతి దగ్గరగా చూపారా? 8 ఏళ్ల వయస్సులో నేను చూసాను కానీ  జూలో కాదు, సర్కస్ లో మాస్టర్ లాగా. నాకు రెండో తండ్రి అయిన మాథ్యూ పప్పా దగ్గర అలవాటు అయింది. చిన్నప్పుడు 3 వ తరగతి లెక్కల పరీక్షలో తప్పానని నా తండ్రి చితకగొట్టాడు. ఇంటి నించి పారిపోయి ఏదో బస్ ఎక్కి, నిద్ర పోయాను ఆకలి తట్టుకోలేక. రెండు గంటల తర్వాత తెలిసింది అది ఒక సర్కస్ కంపెనీ బస్ అని, ఆ రోజు తో పని ముగించుకొని వెళ్లిపోతున్నారని. నా గుబులు మొహం చూసిన ఆయన, “కావాలంటే నిన్ను మీ వారి దగ్గర  దింపుతాను” అన్నారు. ఆయన చొక్కా పట్టుకుని “ఎప్పుడు విడిచి పెట్టొద్దు అని ఏడ్చాను”. నాకు సంబంధించినంత వరకు నేను ఓడిపోయినపుడు  ఎవరు నాకు తోడుగా నిలుస్తారో వాళ్ళే నా వారు, అది తండ్రి అయినా, పిన తండ్రి అయిన….

నన్ను ఒక అబ్బాయిలాగానే పెంచారు మా మాథ్యూ పప్పా. నాకు 14 ఏళ్ళ వయస్సులోనే సర్కస్ బాధ్యతను పూర్తిగా అప్పగించారు ఆయన. చదువు లేకపోయిన మంచి అందగత్తెని అని పేరు మాత్రం వుంది. గుర్రపు స్వారీ స్టంట్లలో ఆరి తేరాను. సర్కస్ యజమాని అంటే మాటలు కాదు, తిన్నా తినక పోయినా మిగిలిన వారి కడుపు నింపాలి. వారు రాలేనపుడు వారి బాధ్యతలను కూడా నేనే నిర్వహించాలి, అందుకే ఆల్ రౌండర్ అయ్యాను. నాకు 17 ఏళ్ల వయస్సులో మాథ్యూ పప్పా కను మూశాడు. అప్పుడు నా మొదటి భర్త పరిచయం అయ్యాడు.  3  ఏళ్ళ పరిచయం పెళ్ళిగా మారింది. ముగ్గురు  కవలలు కలిగారు, తనకు ఉన్నంతలో నన్ను మహా రాణి లా చూసే వాడు. ఒక రోడ్డు ప్రమాదం లో మరణించినపుడే అతను నాకు దూరమయ్యాడు.  తనతో గడిపిన 5 ఏళ్ల జీవితం మాత్రమే నేను జీవితం గా భావిస్తాను. రెండవ భర్త నాకు 27 వ యేట నన్ను సర్కస్ లో చూసి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికే అతడికి ఇద్దరు ఆడ పిల్లలు వున్నారు. సర్కస్ అంటే ఏమి తెలియదు అతనికి, నా దగ్గర నేర్చుకుంటుండే వాడు. తన ఇద్దరు కూతుళ్లని నాకు మల్లె నిస్ణాతురాళ్లను చేయమని అడిగే వాడు.  ఒక రోజు తెలియక కొత్తగా వచ్చిన పాముల బుట్ట లో చేతులు పెట్టి వాటి కాటుకు గురి అయి వెంటనే మరణించాడు. మంచి లాభాలలో ఉండే సర్కస్ కి షాపింగ్ మాల్సు, సినిమాల ఉప్పెన తాకిడి తగిలి సర్కస్లకు జనం రావటం మానేశారు. అయిదుగురు పిల్లలు నేను మిగిలాము . 6 నెలలకు మూడవ భర్త తన ఇద్దరు బిడ్డలతో  నా ఇంటి ముందు నించున్నాడు. స్థిరమయిన సంపాదన నేను అతనిలో చూసాను.. ఆ సమయంలో పిల్లలకు తిండి పెట్టె మార్గంగా కనబడ్డాడు తప్ప మరో ఆలోచన లేదు. అదృష్టవశాత్తు ఉన్న బిడ్డలకు మల్లె వీళ్ళు  కూడా నాకు అల్లుకు పోయి తమ తండ్రిని పూర్తిగా మర్చిపోయారు. అతనితో 7 ఏళ్ల యాంత్రిక జీవనం, ఒక వేళ అతను ఒక ఆయాను  పెట్టుకుంటే సరిపోయేది అనిపించేది, ఎందుకంటే అతని ఖర్చుల కంటే నా చని పోయిన భర్తల  పిల్లల ఖర్చు, సర్కస్ ఖర్చు ఎక్కువ గా ఉండేవి, కానీ బాధ్యతగా ఇచ్చేవాడు.  తన మొదటి భార్య ఫోటోను మొబైల్ లో ప్రతి క్షణం చూసుకునే వాడు.  నిరాశగా శూన్యంలోకి చూస్తూ ఉండే వాడు. నీ పిల్లల కోసమన్నా ఆమెను మర్చిపో అని చెప్పాను, తన చెంపల మీద కన్నీరు తప్ప నాకు సమాధానం ఇంకోటి దొరకలేదు. ఒక రోజు చనిపోయాడు.  ఆస్తిలో సగం నా పేర్న- తన బిడ్డల పేరున రాశాడు, మిగిలినది తన మొదటి భార్యకు ఇచ్చాడు. అతడికి తన భార్య అంటే ప్రాణం. ఆమెకు బాద్యతలు మోయలేదు, అందుకే నన్ను ఆశ్రయించాడు. అతడికి కాన్సరు, ఒక కూతురు, ఒక కొడుకు, వాడు కురచగా ఉంటాడు, ఆవిడ కి అది పరువు తక్కువ. నాకు ఈ విషయాలు తను చనిపోయాక డైరీలో బయట పడ్డాయి. నెల రోజులకి ఆమె వచ్చి తన బిడ్డలను ఇమ్మని అడిగింది, నేను డైరీ చూబించి ఆమెకు బుద్ధి చెప్పి పంపాను, అవును కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమను  తెంపుకోలేము. ఒక సంవత్సరము అతడి ఆస్తి మాకు అండగా ఉన్నది. ఆ తర్వాత పిల్లలు, వారి చదువుకి రెండు ఏనుగులు అమ్మేశాను, ఖర్చులకి. పిల్లలకి నెల రోజులు పట్టింది ఆ ఏనుగులను మర్చిపోటానికి, కానీ తప్పదు. చాలా మందిని ఉద్యోగంలో నించి తీసేశాను జీతాలు ఇవ్వలేక. ఇక మిగిలింది ఊర్జా ఆంటీ, నేను, పిల్లలు. ఆవిడకు 60 ఏళ్ళు, మాథ్యూ పప్పాకి జీవితాంతం కాబోయే భార్యగా మిగిలిపోయిన ప్రేయసి.   నా కన్నా పెద్ద వాడు ఎలా ప్రపోస్ చేయగలను అని ఆవిడ అనుకుంది, నా కన్న 10 యేళ్లు చిన్నది బాగోదూ అని పప్పా అనుకున్నారు, సర్కస్ బాధలు కొన్ని రోజులు వాళ్ళ ప్రేమను వాయిదా వేస్తూ  వచ్చాయి. ఒక రోజు ఆవిడే ధైర్యం చేసి పొద్దున్నే బెడ్ కాఫీ తో ‘మిమ్మల్ని ప్రేమిస్తున్నా’ అని ఆయనకు చెప్పింది, ఆవిడకు 55 యేళ్ళ వయస్సులో. కానీ అది వినటానికి ఆయన సిద్ధం గా లేడు, చనిపోయాడు రాత్రి నిద్దర్లోనే, 65 యేళ్ళ వయస్సులో. “మీ పప్పా కు అన్నీ తొందరే, చాలా తొందర పాటు మనిషి” అంటూ నవ్వుతూ ఎడ్చింది.

ప్రస్తుతం మేము బిల్లులు కట్టి చూస్తూ కూర్చొంటున్నాము. వచ్చే నెల నుంచి గడవటం కూడా కస్టమే.

అప్పుడే నా కంట ఒక ప్రకటన పడ్డది, ఒక బాగా డబ్బు ఉన్న కుటుంబం,  దేశ విదేశాలు తిరుగుతూ భారత దేశానికి కూడా వచ్చింది. కేవలం ఎప్పుడు నిరాశగా ఉండే తన కూతురిని సంతోష పెట్టడానికి మాత్రమే ఆయన ఎంత ఖర్చుకు అయినా  సిద్ధ పడుతున్నాడట. ఆమె ఒక్క సారి నవ్వితే కొన్ని లక్షల డాలర్లు బహుమానం అట.

“ఊర్జా, ప్రకటన చూశావా… మన వల్ల అవుతుందా..?”  అన్నాను ఆమెకు ఆ పేపరు అందిస్తూ.

ఆమె ప్రకటన చూసి, “దేశ విదేశాల్లో ఆయన అనుకున్నది జరగకనే కదా ఇక్కడకి వచ్చాడు, ఆయనే మనన్ని నమ్మినప్పుడు, మనం ఎందుకు మనన్ని నమ్ముకోలేము” అన్నది.

నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. నా మొదటి భర్త ఇచ్చిన వెడ్డింగ్ డ్రస్ తీసుకుని డ్రై క్లీనింగ్ కి ఇచ్చాను. నా పిల్లలు, ఊర్జా వచ్చి ఎదురుగా నా మాట కోసమే అన్నట్లు చూశారు, నేను ట్రంక్ పెట్టె దగ్గర ఉంటే కొత్తదేదో చేస్తాను అని తెలుసు వారికి. నాకు ఒకింత సంతోషం కలిగింది ఇంతగా అర్థం చేసుకునే టీం దొరికినందుకు.

వారికిలా  చెప్పాను, “చూడండి ఈ ఒక్క షో మన జీవితాలను తిరగ రాస్తుంది. ఇది మనకు విజయమో, వీర మరణమూ అంటారే, సరిగ్గా అలాంటిదే. మనసా వాచా మీరు మీ శక్తిని అంతా ఈ షో కి వినియోగించాలి , లేదంటే ఇక మిగిలిన మూగ జీవాలను కూడా అమ్ముకోవాల్సిందే…” అన్నాను కస్టంగా…

వారంతా తమ ఫేవరేట్  జంతువులని చూసుకొని మౌనంగా విలపించారు. ఒక తల్లికి తన పిల్లల్ని అలాంటి దీనావస్థలో చూడటం నరకమనే చెప్పాలి. కానీ నన్ను నేను సంభాళించుకొని  “ ఏడ్చి వదులుకుంటారో  లేక మీ నైపుణ్యం చూపి ఆ పాపను మెప్పించి, మీ జoతువులను దక్కించుకుంటారో మీ ఇష్టం” అన్నాను.

వారు మారు ఆలోచించకుండా “ విజయం మనదే అమ్మ” అన్నారు, ముక్త కంఠంతో.

వారు వెళ్ళిపోయాక జీసస్ ముందు మోకరిల్లి “ నాకు నా బిడ్డలకు కావల్సిన శక్తిని ఇవ్వు” అని ప్రార్థించాను.

******************                           *********************               ******************

సముద్రం అల్ల కల్లోలంగా ఉంది, నా మనస్సు లాగే.  ఈ రోజు పొద్దున ఊర్జా కూడా చనిపోయింది. అవును మరి 60 ఏళ్ళు ఆవిడకి, ఏం సుఖ పడింది, పప్పా  కోసం ఏడ్వటానికే పుట్టింది ఆవిడ. ప్రతిజ్ఞ్య పట్టి సరిగ్గా 5 వ రోజు ఇవాల్టికి. షో కి ఇంకా నెల మీద 5 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నా పని మరీ జటిలమయింది, పిల్లలకు మానసికంగాను, శారీరకంగానూ తర్ఫీదు ఇవ్వాల్సిన ఊర్జా బాధ్యత కూడా మీద పడింది.

సముద్రపు హోరులో కూడా నా కన్నీటి అలల చప్పుడు ఒకతనికి వినబడింది. నా వైపు వచ్చి “మీ బాధను నాతో చెప్పుకోవచ్చు” అన్నాడు.

6 అడుగులు ఉన్నాడు. పొడుగాటి జుట్టు భుజాల మీద పడుతోంది,  కళ్ళు చాలా ఆకర్షణీయంగా  ఉన్నా కూడా తన మీద తనకు శ్రద్ధ లేని వాడిలా కనబడ్డాడు. కొంచెం సినిమా హీరో ఫోసు కొడుతున్నాడు, నాకు నమ్మకం కుదర లేదు.

“అనామకులతో నా కష్టాలు చెప్పుకోను” అన్నాను.

అతను “నా డ్రస్ చూసి నేనేంటో అనుకోకండి. పర్వాలేదు, పోనీ నా కష్టాలు వినండి” అంటూ తన రెండు గుర్రాలను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి , ఇవి నా చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాయి.  మరో రెండు నెలలో వీటిని అమ్ముకోవాల్సిన స్దితి లో వున్నాను,”  అన్నాడు.

“మీకు రేసులు ఆడే అలవాటు ఉందా?” అని అడిగాను

“కాదు  నాకో సర్కస్ కంపెనీ ఉంది, నష్టాల్లో అన్నీ అమ్మేయగా మిగిలినవి ఈ రెండు మా అమ్మ ఇచ్చిన గుర్రాలు, వీటిని అమ్ముకోవటం నాకు ఇష్టం లేదు” అన్నాడు.

అప్పుడు నాకు అర్థం అయింది, జీసస్ పవర్ ఏంటో.. “ వెంటనే నెల రోజుల్లో ఉన్న షో కాంపిటేషన్ గూర్చి చెప్పాను.

అతను ఎగిరి గెంతేశాడు. “మీ పిల్లలకి కొత్త సర్కస్ విద్యలను నేర్పిస్తాను, షో గెలిపిస్తాను. అటు తర్వాత నా గుర్రాలను విడిపించే పూచీ మీదే” , నా పేరు అలెక్స్ అన్నాడు.

“డన్” నా పేరు రేచల్ అన్నాను ఉత్సాహంగా.

*******************                                *******************                          ***************

అలెక్స్ తన తర్ఫీదుని మొదలెట్టాడు. రకరకాల విన్యాసాలు, కానీ అతడి కఠినమయిన శిక్షణకు పిల్లలు భయపడి పోయి అతని దగ్గరకు వెళ్ళటానికి అంత మక్కువ చూప లేదు, ఊర్జా అంత లాలనగా నేర్పింది వారికి.

“మీ పిల్లలు మరీ సుకుమారులు, ధ్యాస తిండి మీద తప్ప, పని మీద లేదు. ఒక్క స్టంటుకి 100 బ్రేకులు, మీరన్నా చెప్పండి, సమయం ముంచుకొస్తోంది ” అన్నాడు.

“మీకు శిక్షణ ఇవ్వటం ఒక కళ అని తెలుసా”

ఓకే!, సొ ..నాకు రాదు అంటారు అన్నాడు దెబ్బ తిన్నట్లుగా.

“కాదు, పిల్లల మనస్సు ఎరిగి  చెప్పమన్నాను”

“వాళ్ళు సంవత్సరం గడువు ఇస్తే అలాగే చేద్దాం అన్నాడు, నన్ను వింతగా చూస్తూ…

నాకు తెలీకుండానే నా బుగ్గలు కోపంతో ఎర్రబడ్డాయి. “భోజనం సిద్దమయింది, టేబల్ మీద అన్నీ ఉన్నాయి, తీనొచ్చు” అని తలుపు వేసేసాను.

“లోపలికి రమ్మంటూ తలుపు బిగిస్తావ్ ఏంటి” అని అరుస్తున్నాడు బయట నించే.

*********************                           ************************

మూడవ రోజు:

మంచి ఎండ లో అలెక్స్ పాఠాలు మొదలెట్టాడు. పిల్లలు తమ వల్ల కాదు అని లాన్ గడ్డి లో కూలపడిపోయారు. అందర్నీ తలకిందులుగా వేలాడతీసి , “రేపు ఫోకస్ లైట్లలో ఎలా చేస్తారు” అంటూ తర్ఫీదు ఆపకుండా ఇస్తున్నాడు.

వాళ్ళు నన్ను చూసిన వెంటనే ఘోల్లున ఎడ్చారు…  “ మా వల్ల కాదు” అని.

“పోనివ్విండి ఆలేక్స్, ఈ రోజుకి చాలు” అన్నాను అతడితో.

“ఇంకా కేవలం 28 రోజులు మాత్రమే వున్నాయి”, అని కసురుగా వెళ్ళి పోయాడు.

నేను పిల్లలను దగ్గరకు తీసుకొని భోరుమన్నాను, “ఎన్నో ఏళ్ళ నుంచి  పడిన కస్టమ్ వృధాగా పోయింది, చివరికి మళ్ళీ పిల్లల మీద ఆధార పడాల్సిన పరిస్డితి,” అనుకుంటూ.

అతడు నన్ను చూసినట్లు వున్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చి “ఈ 1500 మాత్రమే ఉన్నాయి”  అని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు.

నాకు మనస్కరించ లేదు పని కాకుండా అతడి దగ్గర తీసుకోవటానికి , వాటిని అతడి రూమ్ లోనే ఉంచాను ఒక పెట్టెలో.

**********************                              *****************************

6 వ రోజు :

పిల్లలకు  అలెక్స్ కు కొద్ది గా సఖ్యత కుదిరింది. కానీ కురచోడికి మాత్రం ఆలేక్స్ అంటే గిట్టటంలేదు. నేను కూడా నా గుర్రపు స్వారీ  కసరత్తు చేసేటపుడు ఒక కంట చూస్తూనే ఉన్నాను, అలెక్స్ ఎంతో ఆసక్తి గా తర్ఫీదు ఇస్తున్నప్పుడు, కురచోడు అతని చొక్కను వెనకాలున్న లాన్ ఫెన్సింగ్ కు కట్టేసాడు, అతడు డమాలున కింద పడ్డం క్లాస్ అంతా చెదిరి పోవటం క్షణంలో జరిగి పోయింది .

క్లాసులో కొట్టినందుకు పగ బట్టి బ్రెడ్ అండ్ బటర్ కి బదులు బ్రెడ్ అండ్ ఫెవికాల్ ను పెట్టాడు . ఆ అయోమయం గాడు ఎలా తిన్నాడో  తెలియదు గాని రాత్రంతా మాకు మూగ శాపాలు పెడుతూనే వున్నాడు.

7 వ రోజు :

రాత్రి జరిగిన దానికి కోపంతో పిల్లలను క్లాసు పేరుతో బెత్తం పట్టుకొని తలా ఒకటి బాదాడు.

నేను పరుగున వెళ్ళి “ ఏంటి పిల్లలని చంపేస్తావా? నువ్వు వద్దు, నీ తర్ఫీదు వద్దు, నీ 1500 తీసుకొని వెళ్ళిపో, అన్నాను గట్టిగా అరుస్తూ..

“నా నోట్లో వాళ్ళు ఫెవికాల్ పోసినప్పుడు ఏమైంది ఈ కోపం” అన్నాడు.

నాకు ఇంక చాలు అనిపించి లోపలి కెళ్ళి 2000  తెచ్చి, అతని మొహాన కొట్టి “వెళ్ళిపో” అన్నాను.

అతడు బెత్తం అక్కడ విసిరేసి తన రెండు గుర్రాలను తీసుకొని వెళ్ళిపోయాడు.

అంతా నిశ్సబ్దo.  వెళ్లిపోతున్న అతన్ని చూసి పిల్లలు మూసి మూసి నవ్వులు నవ్వుతున్నారు.

నాకు రాత్రి అయ్యాక కోపం తగ్గింది, మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఇంకా 25 రోజులు మాత్రమే ఉంది షోకి. పిల్లలందరూ చొక్కా విప్పుకొని వరుసగా నించున్నారు, వీపు మీద వెన్న రాయించుకోటానికి . వెన్న రాస్తూ  “మీరు కూడా అలా అల్లరి చేస్తే ఎలా? మీరు ఇలానే ఉంటే మీ జంతువులను అమ్మేయాల్సిందే ఇంక” అన్నాను.

కురచోడు “సారీ మమ్మీ! అతను నాకు నచ్చలేదు, ఊర్జా అమ్మమ్మ లాగా లేడు.” అన్నాడు.

“ఊర్జా అమ్మమ్మకి 60 ఏళ్ళు” అన్నాడు వెనక నించి.

అందరం వెనక్కి తిరిగాము ఎవరిదా గొంతు?  అని, చూస్తే అలెక్స్!!!!

నా చేతిలో గిన్నెని తీసుకొని ” కడుపు కాలిపోతోంది, కాస్త త్వరగా భోజనం ఏర్పాట్లు చేయండి,” అని పిల్లల వైపు “తిరిగి ఈ సారి ఏమన్నా ఉంటే మనము మనము పగ తీర్చుకుందాం, మమ్మీ  తో మాత్రం చెప్పొద్దు, మనన్ని విడగొట్టేస్తుంది పూర్తిగా” అన్నాడు.

వాళ్ళు “నువ్వు రౌడీవి, నువ్వు మాకు వద్దు”, అన్నారు

“అయితే మీ జంతువులు..అమ్మేస్తుంది మమ్మీ” అన్నాడు

అందరూ వరుసగా అతని ముందు  నుంచున్నారు వెన్న రాయించుకోటానికి ..

*************************                                ************************

పిల్లల్ని కొట్టాడు అని కసితో నేను పెద్ద సమ్ముఖంగా మాట్లాడలేక పోతున్నాను, అతను కూడా తన గుర్రాలను దక్కించుకోటానికి తప్పక, నన్ను..  పిల్లల్ని భరిస్తు తడిపొడిగా మాట్లాడుతున్నాడు.

నాకు ఎంతో అవసరం వచ్చి అతనికి చెప్పే సమయం లేక తన షర్ట్ జేబులోంచి 1000 రూపాయలు తీసుకున్నాను, అతడి గుర్రాల గుగ్గిళ్ళ కోసం.

మరునాడు గుర్రపు స్టంట్ల కసరత్తును చేస్తూ ఎంత తక్కువ సమయంలో గాల్లోకి ఎగిరి మళ్ళీ గుర్రం మీద కూల బడి తిరిగి నేల  మీదకి,  గుర్రం మీదకి పల్టీలు కొట్టగలనో,  నాతో నేనే పోటీ పెట్టుకున్నాను. అతను నా గుర్రం చెక్కర్లు కొడుతుంటే మధ్యలో నిలబడ్డాడు కోపంగా, ” హేయ్ నీ పిల్లల టార్చర్ చాలదన్నట్లు నువ్వు నా డబ్బులు తీసేశావు, మర్యాదగా ఇవ్వు గుర్రం గుగ్గిళ్ళు తెచ్చుకోవాలి”  అన్నాడు.

నాకు తెగ నవ్వొచ్చింది,  గుర్రం మీద చెక్కర్లు కొడుతూనే బిగ్గారుగా నవ్వుతున్నాను, స్టంట్లు మాత్రం ఆపలేదు. ఎందుకంటే ఇవాళ ఆదివారం 10 గంటలకు లేచి గుగిళ్ళ కోసం ఆరాట పడుతున్నాడు, ఇందుకే రెండు గూర్రలతో మిగిలాడు. వేగం గా, అతడికి సమాధానం చెప్పకుండా, వెనక్కి చూడకుండా  ‘బాయ్’ అంటూ చేయి చూపి నేరుగా వెళ్ళిపోయాను దూరం లోని మైదానానికి.

కురచోడూ తన ఏనుగు దగ్గర కూర్చొని,  “ఏడవకు నిన్ను నేను దక్కించుకుంటాను, అమ్మ నిన్ను అమ్మేస్తే నేను కూడా నీతో వచ్చేస్తా” అని దాన్ని నిమురుతూ ఏడుస్తున్నాడు.

తన గుర్రాలను చూడటానికి వచ్చిన అలెక్స్ వాడిని చూసి అంతా విని వాడి పక్కనే కూర్చున్నాడు.

“ఏరా పెద్ద హీరోలా  ఫోసు కొడుతావు, ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావా? అని రెచ్చ కొట్టాడు.

వాడు కోపంగా అతడి మీద తిరగబడి “ఏదో ఒకటి చేయరా! నా ఏనుగు నన్ను విడిచి పెట్టి ఉండలేదు” అని ఎడ పెడా కొట్టాడు .

“అలా రా దారికి రోజు క్లాస్లో ఎడిపిస్తావా, ఇప్పుడు తెల్సిందా? అన్నాడు అలెక్స్

కురచోడు అతడి మీదకు ఎక్కి “చూడు నా ఏనుగులే కాదు, నీ గుర్రాలు కూడా అమ్మేయాల్సిందే ‘షో’ ఓడిపోతే “ అన్నాడు.

అతడికి ఆ పిల్లాడి తెలివితేటలకు ఆశ్చర్య పోయి  “అయితే డీల్! అందరం మన మన జంతువులు కాపాడుకోవాలి” అన్నాడు

“అయితే నువ్వు కూడా మమ్మల్ని కొట్ట కూడదు, we are just partners”

“బుడ్డోడ నీతో నాకు పర్ట్నర్ షిప్పా”

మరి నీ గుర్రాలు నీకు, నా ఏనుగులు నాకు ఎవరు , ఎక్కువ కాదు తక్కువ  కాదు… , డీల్ ఓ‌కే అయితే రేపు క్లాస్ కి రా” అని వెళ్ళిపోయాడు.

అక్కడే కూర్చుండిపోయి అలెక్స్  ” చెడ్డీలు వేసుకొనే వీడు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు” అనుకోని విస్తుపోయాడు.

వెనక నించి  కొరచోడు వచ్చి అతడి బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు.

నవ్వటం మాత్రమే అతని వంతు అయింది.

క్లాస్లో పాఠాలు బుధ్ధిగా నేర్చుకుంటున్నారు పిల్లలు అందరూ. నాతో మాట్లాడే సమయం  కూడా లేదు వాళ్ళకి  ఇప్పుడు.

కురచోడి బుద్ధి కుక్క తోక వంకర లాగే అని చెప్పాలి.. అతడు షర్ట్ మార్చి నా బాత్ గౌను పెట్టాడు, అతడి కప్బోర్డ్ లో. నేను ఇల్లంతా వెతికి అలిసిపోయాక కురచోడు అతడి ఎదురుగా ఆ డ్రస్ తెచ్చాడు అతని గది లోంచి. తెలియక అతని మీద విరుచుకు పడ్డాను. నాకేం తెలీదు మొర్రో 35 ఏళ్లగా గుడ్ బాయ్ అని పేరు నాకు” అంటూ లబో దిబో అన్నాడు.

కానీ అప్పటికే తిట్టరాని తిట్లు తిట్టాను. మొహం చూబించుకోలేక  అతడినే “నీ మొహం చూబించకు” ఇంక అని తిట్టాను. నేను అపార్ధం చేసుకున్నానని  చాల బాధ  పడి అతడు కురచోడి కాళ్ళు పట్టుకున్నాడు ” మమ్మీ దగ్గర ఇలా ఇరికించకు, కావాలంటే ఇంకోలా పగ తీర్చుకో” అన్నాడు. “నువ్వు ఊర్జా అమ్మమ్మని దాచి పెట్టావు అంట” మమ్మీ చెప్పింది అన్నాడు.

అతడి కళ్ళలో , నా కళ్ళళో నీళ్ళు ఒకే సారి తిరిగాయి.

“అమ్మమ్మ వచ్చే వరకు నేను ఇంతే” అని గదీలో కెళ్ళి తలుపు బిగించుకున్నాడు.

మర్నాడు పోర్టునే  నాకు నిజo తెలీదని తిట్టుకుంటూ బట్టలు ఉతుక్కున్టునాడు ఆలెక్స్ .  “సింహాలను ఎన్నిటిని నా చేతుల మీద ఆడించాను? ఈ రేచల్ ని మాత్రం ఒప్పించటం నా తరం కావటం లేదు”  అని తిట్టుకుంటూ బట్టల్ని బండ కేసి బాదుతున్నాడు.

నేను పిల్లలని పంపి “సారి చెప్పండి” అని పంపాను. నాకు తెలీనట్లు హాల్ లోనే కూర్చున్నాను .

పిల్లలు వెళ్ళి  ” ఏడవకండి అంకల్ , మమ్మీ కి మిమ్మల్ని క్షమించమని చెప్తాము” అని నిప్పుకు ఆజ్యం పోశారు.

అలెక్స్ పక్కన ఉన్న  సర్ఫ్ నీళ్ళ మగ్ ని వాళ్ళ మీద గుమ్మరించాడు, “నన్ను క్షమిస్తుందా మీ అమ్మ, నేను ఏం తప్పు చేశాను రా!”  అంటూ…

నా దగ్గరకు పరుగున వచ్చి పిల్లలు అలెక్స్ చూడు మమ్మీ ఎలా చేశాడో అన్నారు.

అప్పుడర్థమయింది పిల్లలు ఎంత గడుగ్గాయులో  అని. “ఆలేక్స్” అని అరిచాను , నేనే సారి చేప్దామని.

కానీ ఈ సారి అతడు నేను మళ్ళీ తిట్టటానికే పిలిచాను అనుకోని నీళ్ళ సంపులో దూకి తల దాచుకున్నాడు.

క్రిస్మస్ రోజులు, దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. అర్ధ రాత్రి రెండు గంటలు , నాకు నిద్ర పట్టటం లేదు. బయట లాన్ లో కూర్చున్నాను. కాసేపటికి అలెక్స్ నా పక్కన వచ్చి  కూర్చున్నాడు. నా మనసు తీవ్ర ఒత్తిడికి గురై ఎలాగో తమాయించుకుంటున్నాను.

“ఆకాశంలో చుక్కలను చూశావా, బాగున్నాయి కదు!” అన్నాడు

నేను చాచి పెట్టి కొట్టాను అతడిని ” కష్టం లో ఉన్నాననే కదా పిల్లల్ని కొట్టావు” అన్నాను.

అతడు నా తలను తన రెండు చేతుల్లోకి తీసుకొని ” ఈ సమస్య గడిచిపోతుంది, కానీ ఈ క్రిస్మస్ రోజులు వచ్చే సంవత్సరం కూడా ఇంతే అందంగా ఉంటాయని చెప్పలేను, “so enjoy”  అన్నాడు.

“వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకు వచ్చావు” అని అడిగాను.

“నీ సొంత పిల్లలు ముగ్గురే, మరి నువ్వు అందరినీ ఎలా సమానంగా చూడగలుగుతున్నావు?” అని తిరిగి ప్రశ్నించాడు.

నా ఒత్తిడి అంతా దూది పింజ లా ఎగిరి పోయింది, కానీ ఎందుకో అతని చేతుల్లో తల వాల్చి రెండు నిమిషాలు అలాగే ఉండి పోయాను.

నా చెమ్మగిల్లిన కాళ్ళను పసికట్టి అతడు ” ఇప్పుడే చెప్పాను, ఈ పొగ మంచు, ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా స్పెషల్, గ్లోబలైసషన్  వల్ల ఇవన్నీ వచ్చే ఏడు  ఉంటాయో ఉండవో తెలీదు, కావాలంటే  నీ కళ్ళను చూసి నక్షత్రాలు అనుకోగలను కానీ” అన్నాడు.

నేను ఫకాలున నవ్వాను .

సమయం 3.45 తెల్ల వారు ఝామున , పొగ మంచు దట్టంగా కమ్ముకుని మిమ్మల్ని దుప్పటిలా కప్పెసింది. మేము  మాత్రం చలికి వెరువక అలాగే నక్షత్రాలను చూస్తూ లాన్ లోనే నిద్రలోకి జారుకున్నాము.

అందరం షో కి సిద్దంగా ఉన్నాము.

ఆ పాప కూడా జమీందారు గారి పక్కనే  అక్కడే కూర్చున్నది. మేము షో ని మొదలెట్టాము. మొదట అలెక్స్ కురచోడు కలిసి రక రకాలైన స్టంట్లు చేశారు. పాప ఇబ్బందిగా అటు ఇటు కదిలింది తప్ప పెద్దగా ఆమె పెదాలు విచ్చుకోలేదు. నాకు ఆ పాపకి ఏదన్నా జబ్బు కాబోలు అని సందేహం కలిగింది. ఏనుగులు ఒంటి కాలి మీద స్టూల్ మీద నిల్చోనే ఫీట్లు చేయించారు నా ముగ్గురు కవలలు. కానీ పాప ముఖములో పెద్ద సంతోషం కలగ లేదు. గుర్రమ్ ఫీట్లు చేశాను నేను, తల వెనక్కి తిప్పి అమ్మే విముఖతను చూపింది.

కురచోడికి భయం పట్టుకుంది, వెంటనే పెద్దోడు చేయాల్సిన ఫైర్ స్టoట్లు వాడు చేస్తానని వచ్చాడు.  అలెక్స్ వాడిని కొట్టినంత పని చేసి, వాడిని ఆపి తాను తీసుకున్నాడు ఆ బాధ్యత.

జమీందారు గారి అమ్మాయి నిద్దర్లోకి జారుకుంటోంది, జమీందారు గారు ఇక వెళ్లిపోదామని నిరాశగా లేచారు.

నాకు చివరి ప్రయత్నంగా ఒక్క ఆలోచన వచ్చింది, అంతే ఏనుగులకి నా భాషలో సైగ చేశాను, అవి వెళ్ళి పడుకున్న పాపను ఎత్తి నా చేతిలోకి విసిరాయి, నేను అమాంతం పాపను పట్టుకుని పైన ఉన్న హాంగర్ని అందుకున్నాను,  పాపను నడుముకి కట్టుకొని.

ఆమె తండ్రి  “ఆపండి, ఏం చేస్తున్నారు నా కూతురిని” అని ముందుకొచ్చాడు

అప్పటికే నేను ఒక హాంగర్ నించి మరో హంగారుకు నా పిల్లల సహాయముతో మరియు అలెక్స్ సహాయం తో పావు గంట ఆపకుండా తిరిగాము. మాతో పాటు పాపను ఏనుగులు, గుర్రాల మీద పల్టీలు కొట్టించాను జాగ్రత్తగా..

కిందకు దిగాక ఆయన “ఎంత ధైర్యం నీకు, నీ డబ్బు కోసం నా కూతురినే పణంగా పెడతావా?” అన్నాడు

పాప ఆయనకు అడ్డుపడి “లేదు నాన్నగారు నాకు చాలా హాయిగా అనిపించింది, ఇప్పుడు అర్థం అయింది నాకు, రోజు ఎందుకు దిగులుగా ఉంటుందో, నాకు మీ పక్కనే కూర్చొంటే పెద్ద సంతోషం  కలగటం లేదు. వాళ్ళతో సమానంగా నేను ఆడినప్పుడు నాకు నిజమైన ఆనందం కలిగింది”  అని అన్నది.

ఆయన మొహంలో కొట్టొచ్చినట్లు సంతోషం కనబడింది.

పిల్లలు, అలెక్స్ చాలా బాగా సెలబ్రేట్  చేసుకుంటున్నారు, నీళ్ళ పంపులన్నీ తెరిచి వర్షం అంటూ లాన్ లో ఆడుతూ ఆనందిస్తున్నారు. “మళ్ళీ గుర్రాలకు గుగ్గిళ్ళు  మర్చిపోయాడు అతను, మళ్ళీ రేపు ఆదివారం” అనుకోని నేను వాటి కోసం వెళ్ళాను.

మరో షోకి నేను నా కసరత్తులు గుర్రం మీద మొదలెట్టాను. నా గుర్రపు చెక్కర్ల మద్యలో అతడు నిలబడి నా 40 వేల $ ఎక్కడ ? నేను వెళ్ళాలి ఇంక, పైగా గుర్రానికి గుగ్గిళ్ళు తెచ్చుకోలేదు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి నేను” అన్నాడు.

నాకు మరల నవ్వొచ్చింది, గుర్రం మీద చెక్కర్లు కొడుతూ, గాల్లోకీ ఎగిరి పల్టీలు కొడుతూ బిగ్గారుగా నవ్వాను. మామూలుగా అతడికి కళ్ళు తిరుగుతాయి నా చెక్కర్లు చూసి, కానీ ఈ సారి అతి వేగంగా ఒక్క ఉదుటున నా గుర్రం మీద ఎక్కి “ఇక నీ ఆట కట్టు” అన్నాడు.

సింహాన్ని ఎపుడైనా అతి దగ్గరగా చూపారా? 8 ఏళ్ల వయస్సులో నేను చూసాను కానీ  జూలో కాదు, సర్కస్ లో మాస్టర్ లాగా. నాకు రెండో తండ్రి అయిన మాథ్యూ పప్పా దగ్గర అలవాటు అయింది. చిన్నప్పుడు 3 వ తరగతి లెక్కల పరీక్షలో తప్పానని నా తండ్రి చితకగొట్టాడు. ఇంటి నించి పారిపోయి ఏదో బస్ ఎక్కి, నిద్ర పోయాను ఆకలి తట్టుకోలేక. రెండు గంటల తర్వాత తెలిసింది అది ఒక సర్కస్ కంపెనీ బస్ అని, ఆ రోజు తో పని ముగించుకొని వెళ్లిపోతున్నారని. నా గుబులు మొహం చూసిన ఆయన, “కావాలంటే నిన్ను మీ వారి దగ్గర  దింపుతాను” అన్నారు. ఆయన చొక్కా పట్టుకుని “ఎప్పుడు విడిచి పెట్టొద్దు అని ఏడ్చాను”. నాకు సంబంధించినంత వరకు నేను ఓడిపోయినపుడు  ఎవరు నాకు తోడుగా నిలుస్తారో వాళ్ళే నా వారు, అది తండ్రి అయినా, పిన తండ్రి అయిన….

నన్ను ఒక అబ్బాయిలాగానే పెంచారు మా మాథ్యూ పప్పా. నాకు 14 ఏళ్ళ వయస్సులోనే సర్కస్ బాధ్యతను పూర్తిగా అప్పగించారు ఆయన. చదువు లేకపోయిన మంచి అందగత్తెని అని పేరు మాత్రం వుంది. గుర్రపు స్వారీ స్టంట్లలో ఆరి తేరాను. సర్కస్ యజమాని అంటే మాటలు కాదు, తిన్నా తినక పోయినా మిగిలిన వారి కడుపు నింపాలి. వారు రాలేనపుడు వారి బాధ్యతలను కూడా నేనే నిర్వహించాలి, అందుకే ఆల్ రౌండర్ అయ్యాను. నాకు 17 ఏళ్ల వయస్సులో మాథ్యూ పప్పా కను మూశాడు. అప్పుడు నా మొదటి భర్త పరిచయం అయ్యాడు.  3  ఏళ్ళ పరిచయం పెళ్ళిగా మారింది. ముగ్గురు  కవలలు కలిగారు, తనకు ఉన్నంతలో నన్ను మహా రాణి లా చూసే వాడు. ఒక రోడ్డు ప్రమాదం లో మరణించినపుడే అతను నాకు దూరమయ్యాడు.  తనతో గడిపిన 5 ఏళ్ల జీవితం మాత్రమే నేను జీవితం గా భావిస్తాను. రెండవ భర్త నాకు 27 వ యేట నన్ను సర్కుస్ లో చూసి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికే అతడికి ఇద్దరు ఆడ పిల్లలు వున్నారు. సర్కస్ అంటే ఏమి తెలియదు అతనికి, నా దగ్గర నేర్చుకుంటుండే వాడు. తన ఇద్దరు కూతుళ్లని నాకు మల్లె నిస్ణాతురాళ్లను చేయమని అడిగే వాడు.  ఒక రోజు తెలియక కొత్తగా వచ్చిన పాముల బుట్ట లో చేతులు పెట్టి వాటి కాటుకు గురి అయి వెంటనే మరణించాడు. మంచి లాభాలలో ఉండే సర్కస్ కి షాపింగ్ మాల్సు, సినిమాల ఉప్పెన తాకిడి తగిలి సర్కస్లకు జనం రావటం మానేశారు. అయిదుగురు పిల్లలు నేను మిగిలాము . 6 నెలలకు మూడవ భర్త తన ఇద్దరు బిడ్డలతో  నా ఇంటి ముందు నించున్నాడు. స్థిరమయిన సంపాదన నేను అతనిలో చూసాను.. ఆ సమయంలో పిల్లలకు తిండి పెట్టె మార్గంగా కనబడ్డాడు తప్ప మరో ఆలోచన లేదు. అదృష్టవశాత్తు ఉన్న బిడ్డలకు మల్లె వీళ్ళు  కూడా నాకు అల్లుకు పోయి తమ తండ్రిని పూర్తిగా మర్చిపోయారు. అతనితో 7 ఏళ్ల యాంత్రిక జీవనం, ఒక వేళ అతను ఒక ఆయాను  పెట్టుకుంటే సరిపోయేది అనిపించేది, ఎందుకంటే అతని ఖర్చుల కంటే నా చని పోయిన భర్తల  పిల్లల ఖర్చు, సర్కస్ ఖర్చు ఎక్కువ గా ఉండేవి, కానీ బాధ్యతగా ఇచ్చేవాడు.  తన మొదటి భార్య ఫోటోను మొబైల్ లో ప్రతి క్షణం చూసుకునే వాడు.  నిరాశగా శూన్యంలోకి చూస్తూ ఉండే వాడు. నీ పిల్లల కోసమన్నా ఆమెను మర్చిపో అని చెప్పాను, తన చెంపల మీద కన్నీరు తప్ప నాకు సమాధానం ఇంకోటి దొరకలేదు. ఒక రోజు చనిపోయాడు.  ఆస్తిలో సగం నా పేర్న- తన బిడ్డల పేరున రాశాడు, మిగిలినది తన మొదటి భార్యకు ఇచ్చాడు. అతడికి తన భార్య అంటే ప్రాణం. ఆమెకు బాద్యతలు మోయలేదు, అందుకే నన్ను ఆశ్రయించాడు. అతడికి కాన్సరు, ఒక కూతురు, ఒక కొడుకు, వాడు కురచగా ఉంటాడు, ఆవిడ కి అది పరువు తక్కువ. నాకు ఈ విషయాలు తను చనిపోయాక డైరీలో బయట పడ్డాయి. నెల రోజులకి ఆమె వచ్చి తన బిడ్డలను ఇమ్మని అడిగింది, నేను డైరీ చూబించి ఆమెకు బుద్ధి చెప్పి పంపాను, అవును కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమను  తెంపుకోలేము. ఒక సంవత్సరము అతడి ఆస్తి మాకు అండగా ఉన్నది. ఆ తర్వాత పిల్లలు, వారి చదువుకి రెండు ఏనుగులు అమ్మేశాను, ఖర్చులకి. పిల్లలకి నెల రోజులు పట్టింది ఆ ఏనుగులను మర్చిపోటానికి, కానీ తప్పదు. చాలా మందిని ఉద్యోగంలో నించి తీసేశాను జీతాలు ఇవ్వలేక. ఇక మిగిలింది ఊర్జా ఆంటీ, నేను, పిల్లలు. ఆవిడకు 60 ఏళ్ళు, మాథ్యూ పప్పాకి జీవితాంతం కాబోయే భార్యగా మిగిలిపోయిన ప్రేయసి.   నా కన్నా పెద్ద వాడు ఎలా ప్రపోస్ చేయగలను అని ఆవిడ అనుకుంది, నా కన్న 10 యేళ్లు చిన్నది బాగోదూ అని పప్పా అనుకున్నారు, సర్కస్ బాధలు కొన్ని రోజులు వాళ్ళ ప్రేమను వాయిదా వేస్తూ  వచ్చాయి. ఒక రోజు ఆవిడే ధైర్యం చేసి పొద్దున్నే బెడ్ కాఫీ తో ‘మిమ్మల్ని ప్రేమిస్తున్నా’ అని ఆయనకు చెప్పింది, ఆవిడకు 55 యేళ్ళ వయస్సులో. కానీ అది వినటానికి ఆయన సిద్ధం గా లేడు, చనిపోయాడు రాత్రి నిద్దర్లోనే, 65 యేళ్ళ వయస్సులో. “మీ పప్పా కు అన్నీ తొందరే, చాలా తొందర పాటు మనిషి” అంటూ నవ్వుతూ ఎడ్చింది.

ప్రస్తుతం మేము బిల్లులు కట్టి చూస్తూ కూర్చొంటున్నాము. వచ్చే నెల నుంచి గడవటం కూడా కస్టమే.

అప్పుడే నా కంట ఒక ప్రకటన పడ్డది, ఒక బాగా డబ్బు ఉన్న కుటుంబం,  దేశ విదేశాలు తిరుగుతూ భారత దేశానికి కూడా వచ్చింది. కేవలం ఎప్పుడు నిరాశగా ఉండే తన కూతురిని సంతోష పెట్టడానికి మాత్రమే ఆయన ఎంత ఖర్చుకు అయినా  సిద్ధ పడుతున్నాడట. ఆమె ఒక్క సారి నవ్వితే కొన్ని లక్షల డాలర్లు బహుమానం అట.

“ఊర్జా, ప్రకటన చూశావా… మన వల్ల అవుతుందా..?”  అన్నాను ఆమెకు ఆ పేపరు అందిస్తూ.

ఆమె ప్రకటన చూసి, “దేశ విదేశాల్లో ఆయన అనుకున్నది జరగకనే కదా ఇక్కడకి వచ్చాడు, ఆయనే మనన్ని నమ్మినప్పుడు, మనం ఎందుకు మనన్ని నమ్ముకోలేము” అన్నది.

నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. నా మొదటి భర్త ఇచ్చిన వెడ్డింగ్ డ్రస్ తీసుకుని డ్రై క్లీనింగ్ కి ఇచ్చాను. నా పిల్లలు, ఊర్జా వచ్చి ఎదురుగా నా మాట కోసమే అన్నట్లు చూశారు, నేను ట్రంక్ పెట్టె దగ్గర ఉంటే కొత్తదేదో చేస్తాను అని తెలుసు వారికి. నాకు ఒకింత సంతోషం కలిగింది ఇంతగా అర్థం చేసుకునే టీం దొరికినందుకు.

వారికిలా  చెప్పాను, “చూడండి ఈ ఒక్క షో మన జీవితాలను తిరగ రాస్తుంది. ఇది మనకు విజయమో, వీర మరణమూ అంటారే, సరిగ్గా అలాంటిదే. మనసా వాచా మీరు మీ శక్తిని అంతా ఈ షో కి వినియోగించాలి , లేదంటే ఇక మిగిలిన మూగ జీవాలను కూడా అమ్ముకోవాల్సిందే…” అన్నాను కస్టంగా…

వారంతా తమ ఫేవరేట్  జంతువులని చూసుకొని మౌనంగా విలపించారు. ఒక తల్లికి తన పిల్లల్ని అలాంటి దీనావస్థలో చూడటం నరకమనే చెప్పాలి. కానీ నన్ను నేను సంభాళించుకొని  “ ఏడ్చి వదులుకుంటారో  లేక మీ నైపుణ్యం చూపి ఆ పాపను మెప్పించి, మీ జాతువులను దక్కించుకుంటారో మీ ఇష్టం” అన్నాను.

వారు మారు ఆలోచించకుండా “ విజయం మనదే అమ్మ” అన్నారు, ముక్త కంఠంతో.

వారు వెళ్ళిపోయాక జీసస్ ముందు మోకరిల్లి “ నాకు నా బిడ్డలకు కావల్సిన శక్తిని ఇవ్వు” అని ప్రార్థించాను.

******************                           *********************               ******************

సముద్రం అల్ల కల్లోలంగా ఉంది, నా మనస్సు లాగే.  ఈ రోజు పొద్దున ఊర్జా కూడా చనిపోయింది. అవును మరి 60 ఏళ్ళు ఆవిడకి, ఏం సుఖ పడింది, పప్పా  కోసం ఏడ్వటానికే పుట్టింది ఆవిడ. ప్రతిజ్ఞ్య పట్టి సరిగ్గా 5 వ రోజు ఇవాల్టికి. షో కి ఇంకా నెల మీద 5 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నా పని మరీ జటిలమయింది, పిల్లలకు మానసికంగాను, శారీరకంగానూ తర్ఫీదు ఇవ్వాల్సిన ఊర్జా బాధ్యత కూడా మీద పడింది.

సముద్రపు హోరులో కూడా నా కన్నీటి అలల చప్పుడు ఒకతనికి వినబడింది. నా వైపు వచ్చి “మీ బాధను నాతో చెప్పుకోవచ్చు” అన్నాడు.

6 అడుగులు ఉన్నాడు. పొడుగాటి జుట్టు భుజాల మీద పడుతోంది,  కళ్ళు చాలా ఆకర్షణీయంగా  ఉన్నా కూడా తన మీద తనకు శ్రద్ధ లేని వాడిలా కనబడ్డాడు. కొంచెం సినిమా హీరో ఫోసు కొడుతున్నాడు, నాకు నమ్మకం కుదర లేదు.

“అనామకులతో నా కష్టాలు చెప్పుకోను” అన్నాను.

అతను “నా డ్రస్ చూసి నేనేంటో అనుకోకండి. పర్వాలేదు, పోనీ నా కష్టాలు వినండి” అంటూ తన రెండు గుర్రాలను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి , ఇవి నా చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాయి.  మరో రెండు నెలలో వీటిని అమ్ముకోవాల్సిన స్దితి లో వున్నాను,”  అన్నాడు.

“మీకు రేసులు ఆడే అలవాటు ఉందా?” అని అడిగాను

“కాదు  నాకో సర్కస్ కంపెనీ ఉంది, నష్టాల్లో అన్నీ అమ్మేయగా మిగిలినవి ఈ రెండు మా అమ్మ ఇచ్చిన గుర్రాలు, వీటిని అమ్ముకోవటం నాకు ఇష్టం లేదు” అన్నాడు.

అప్పుడు నాకు అర్థం అయింది, జీసస్ పవర్ ఏంటో.. “ వెంటనే నెల రోజుల్లో ఉన్న షో కాంపిటేషన్ గూర్చి చెప్పాను.

అతను ఎగిరి గెంతేశాడు. “మీ పిల్లలకి కొత్త సర్కస్ విద్యలను నేర్పిస్తాను, షో గెలిపిస్తాను. అటు తర్వాత నా గుర్రాలను విడిపించే పూచీ మీదే” , నా పేరు అలెక్స్ అన్నాడు.

“డన్” నా పేరు రేచల్ అన్నాను ఉత్సాహంగా.

*******************                                *******************                          ***************

అలెక్స్ తన తర్ఫీదుని మొదలెట్టాడు. రకరకాల విన్యాసాలు, కానీ అతడి కఠినమయిన శిక్షణకు పిల్లలు భయపడి పోయి అతని దగ్గరకు వెళ్ళటానికి అంత మక్కువ చూప లేదు, ఊర్జా అంత లాలనగా నేర్పింది వారికి.

“మీ పిల్లలు మరీ సుకుమారులు, ధ్యాస తిండి మీద తప్ప, పని మీద లేదు. ఒక్క స్టంటుకి 100 బ్రేకులు, మీరన్నా చెప్పండి, సమయం ముంచుకొస్తోంది ” అన్నాడు.

“మీకు శిక్షణ ఇవ్వటం ఒక కళ అని తెలుసా”

ఓకే!, సొ ..నాకు రాదు అంటారు అన్నాడు దెబ్బ తిన్నట్లుగా.

“కాదు, పిల్లల మనస్సు ఎరిగి  చెప్పమన్నాను”

“వాళ్ళు సంవత్సరం గడువు ఇస్తే అలాగే చేద్దాం అన్నాడు, నన్ను వింతగా చూస్తూ…

నాకు తెలీకుండానే నా బుగ్గలు కోపంతో ఎర్రబడ్డాయి. భోజనం సిద్దమయింది, టేబల్ మీద అన్నీ ఉన్నాయి, తీనొచ్చు అని తలుపు వేసేసాను.

“లోపలికి రమ్మంటూ తలుపు బిగిస్తావ్ ఏంటి” అని అరుస్తున్నాడు బయట నించే.

*********************                           ************************

మూడవ రోజు:

మంచి ఎండ లో అలెక్స్ పాఠాలు మొదలెట్టాడు. పిల్లలు తమ వల్ల కాదు అని లాన్ గడ్డి లో కూలపడిపోయారు. అందర్నీ తలకిందులుగా వేలాడతీసి , “రేపు ఫోకస్ లైట్లలో ఎలా చేస్తారు” అంటూ తర్ఫీదు ఆపకుండా ఇస్తున్నాడు.

వాళ్ళు నన్ను చూసిన వెంటనే ఘోల్లున ఎడ్చారు…  “ మా వల్ల కాదు” అని.

“పోనివ్విండి ఆలేక్స్, ఈ రోజుకి చాలు” అన్నాను అతడితో.

ఇంకా కేవలం 28 రోజులు మాత్రమే వున్నాయి, అని కసురుగా వెళ్ళి పోయాడు.

నేను పిల్లలను దగ్గరకు తీసుకొని భోరుమన్నాను, “ఎన్నో ఏళ్ళ నుంచి  పడిన కస్టమ్ వృధాగా పోయింది, చివరికి మళ్ళీ పిల్లల మీద ఆధార పడాల్సిన పరిస్డితి,” అనుకుంటూ.

అతడు నన్ను చూసినట్లు వున్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చి “ఈ 1500 మాత్రమే ఉన్నాయి”  అని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు.

నాకు మనస్కరించ లేదు పని కాకుండా అతడి దగ్గర తీసుకోవటానికి , వాటిని అతడి రూమ్ లోనే ఉంచాను ఒక పెట్టెలో.

**********************                              *****************************

6 వ రోజు :

పిల్లలకు  అలెక్స్ కు కొద్ది గా సఖ్యత కుదిరింది. కానీ కురచోడికి మాత్రం ఆలేక్స్ అంటే గిట్టటంలేదు. నేను కూడా నా గుర్రపు స్వారీ  కసరత్తు చేసేటపుడు ఒక కంట చూస్తూనే ఉన్నాను, అలెక్స్ ఎంతో ఆసక్తి గా తర్ఫీదు ఇస్తున్నప్పుడు, కురచోడు అతని చొక్కను వెనకాలున్న లాన్ ఫెన్సింగ్ కు కట్టేసాడు, అతడు డమాలున కింద పడ్డం క్లాస్ అంతా చెదిరి పోవటం క్షణంలో జరిగి పోయింది .

క్లాసులో కొట్టినందుకు పగ బట్టి బ్రెడ్ అండ్ బటర్ కి బదులు బ్రెడ్ అండ్ ఫెవికాల్ ను పెట్టాడు . ఆ అయోమయం గాడు ఎలా తిన్నాడో  తెలియదు గాని రాత్రంతా మాకు మూగ శాపాలు పెడుతూనే వున్నాడు.

7 వ రోజు :

రాత్రి జరిగిన దానికి కోపంతో పిల్లలను క్లాసు పేరుతో బెత్తం పట్టుకొని తలా ఒకటి బాదాడు.

నేను పరుగున వెళ్ళి “ ఏంటి పిల్లలని చంపేస్తావా? నువ్వు వద్దు, నీ తర్ఫీదు వద్దు, నీ 1500 తీసుకొని వెళ్ళిపో, అన్నాను గట్టిగా అరుస్తూ..

“నా నోట్లో వాళ్ళు ఫెవికాల్ పోసినప్పుడు ఏమైంది ఈ కోపం” అన్నాడు.

నాకు ఇంక చాలు అనిపించి లోపలి కెళ్ళి 2000  తెచ్చి, అతని మొహాన కొట్టి “వెళ్ళిపో” అన్నాను.

అతడు బెత్తం అక్కడ విసిరేసి తన రెండు గుర్రాలను తీసుకొని వెళ్ళిపోయాడు.

అంతా నిశ్సబ్దo.  వెళ్లిపోతున్న అతన్ని చూసి పిల్లలు మూసి మూసి నవ్వులు నవ్వుతున్నారు.

నాకు రాత్రి అయ్యాక కోపం తగ్గింది, మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఇంకా 25 రోజులు మాత్రమే ఉంది షోకి. పిల్లలందరూ చొక్కా విప్పుకొని వరుసగా నించున్నారు, వీపు మీద వెన్న రాయించుకోటానికి . వెన్న రాస్తూ  “మీరు కూడా అలా అల్లరి చేస్తే ఎలా? మీరు ఇలానే ఉంటే మీ జంతువులను అమ్మేయాల్సిందే ఇంక” అన్నాను.

కురచోడు “సారీ మమ్మీ! అతను నాకు నచ్చలేదు, ఊర్జా అమ్మమ్మ లాగా లేడు.” అన్నాడు.

“ఊర్జా అమ్మమ్మకి 60 ఏళ్ళు” అన్నాడు వెనక నించి.

అందరం వెనక్కి తిరిగాము ఎవరిదా గొంతు?  అని, చూస్తే అలెక్స్!!!!

నా చేతిలో గిన్నెని తీసుకొని ” కడుపు కాలిపోతోంది, కాస్త త్వరగా భోజనం ఏర్పాట్లు చేయండి,” అని పిల్లల వైపు “తిరిగి ఈ సారి ఏమన్నా ఉంటే మనము మనము పగ తీర్చుకుందాం, మమ్మీ  తో మాత్రం చెప్పొద్దు, మనన్ని విడగొట్టేస్తుంది పూర్తిగా” అన్నాడు.

వాళ్ళు “నువ్వు రౌడీవి, నువ్వు మాకు వద్దు”, అన్నారు

“అయితే మీ జంతువులు..అమ్మేస్తుంది మమ్మీ” అన్నాడు

అందరూ వరుసగా అతని ముందు  నుంచున్నారు వెన్న రాయించుకోటానికి ..

*************************                                ************************

పిల్లల్ని కొట్టాడు అని కసితో నేను పెద్ద సమ్ముఖంగా మాట్లాడలేక పోతున్నాను, అతను కూడా తన గుర్రాలను దక్కించుకోటానికి తప్పక, నన్ను..  పిల్లల్ని భరిస్తు తడిపొడిగా మాట్లాడుతున్నాడు.

నాకు ఎంతో అవసరం వచ్చి అతనికి చెప్పే సమయం లేక తన షర్ట్ జేబులోంచి 1000 రూపాయలు తీసుకున్నాను, అతడి గుర్రాల గుగ్గిళ్ళ కోసం.

మరునాడు గుర్రపు స్టంట్ల కసరత్తును చేస్తూ ఎంత తక్కువ సమయంలో గాల్లోకి ఎగిరి మళ్ళీ గుర్రం మీద కూల బడి తిరిగి నేల  మీదకి,  గుర్రం మీదకి పల్టీలు కొట్టగలనో,  నాతో నేనే పోటీ పెట్టుకున్నాను. అతను నా గుర్రం చెక్కర్లు కొడుతుంటే మధ్యలో నిలబడ్డాడు కోపంగా, ” హేయ్ నీ పిల్లల టార్చర్ చాలదన్నట్లు నువ్వు నా డబ్బులు తీసేశావు, మర్యాదగా ఇవ్వు గుర్రం గుగ్గిళ్ళు తెచ్చుకోవాలి”  అన్నాడు.

నాకు తెగ నవ్వొచ్చింది,  గుర్రం మీద చెక్కర్లు కొడుతూనే బిగ్గారుగా నవ్వుతున్నాను, స్టంట్లు మాత్రం ఆపలేదు. ఎందుకంటే ఇవాళ ఆదివారం 10 గంటలకు లేచి గుగిళ్ళ కోసం ఆరాట పడుతున్నాడు, ఇందుకే రెండు గూర్రలతో మిగిలాడు. వేగం గా, అతడికి సమాధానం చెప్పకుండా, వెనక్కి చూడకుండా  ‘బాయ్’ అంటూ చేయి చూపి నేరుగా వెళ్ళిపోయాను దూరం లోని మైదానానికి.

కురచోడూ తన ఏనుగు దగ్గర కూర్చొని,  “ఏడవకు నిన్ను నేను దక్కించుకుంటాను, అమ్మ నిన్ను అమ్మేస్తే నేను కూడా నీతో వచ్చేస్తా” అని దాన్ని నిమురుతూ ఏడుస్తున్నాడు.

తన గుర్రాలను చూడటానికి వచ్చిన అలెక్స్ వాడిని చూసి అంతా విని వాడి పక్కనే కూర్చున్నాడు.

“ఏరా పెద్ద హీరోలా  ఫోసు కొడుతావు, ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావా? అని రెచ్చ కొట్టాడు.

వాడు కోపంగా అతడి మీద తిరగబడి “ఏదో ఒకటి చేయరా! నా ఏనుగు నన్ను విడిచి పెట్టి ఉండలేదు” అని ఎడ పెడా కొట్టాడు .

“అలా రా దారికి రోజు క్లాస్లో ఎడిపిస్తావా, ఇప్పుడు తెల్సిందా? అన్నాడు అలెక్స్

కురచోడు అతడి మీదకు ఎక్కి “చూడు నా ఏనుగులే కాదు, నీ గుర్రాలు కూడా అమ్మేయాల్సిందే ‘షో’ ఓడిపోతే “ అన్నాడు.

అతడికి ఆ పిల్లాడి తెలివితేటలకు ఆశ్చర్య పోయి  “అయితే డీల్! అందరం మన మన జంతువులు కాపాడుకోవాలి” అన్నాడు

“అయితే నువ్వు కూడా మమ్మల్ని కొట్ట కూడదు, we are just partners”

“బుడ్డోడ నీతో నాకు పర్ట్నర్ షిప్పా”

మరి నీ గుర్రాలు నీకు, నా ఏనుగులు నాకు ఎవరు , ఎక్కువ కాదు తక్కువ  కాదు… , డీల్ ఓ‌కే అయితే రేపు క్లాస్ కి రా” అని వెళ్ళిపోయాడు.

అక్కడే కూర్చుండిపోయి అలెక్స్  ” చెడ్డీలు వేసుకొనే వీడు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు” అనుకోని విస్తుపోయాడు.

వెనక నించి  కొరచోడు వచ్చి అతడి బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు.

నవ్వటం మాత్రమే అతని వంతు అయింది.

క్లాస్లో పాఠాలు బుధ్ధిగా నేర్చుకుంటున్నారు పిల్లలు అందరూ. నాతో మాట్లాడే సమయం  కూడా లేదు వాళ్ళకి  ఇప్పుడు.

కురచోడి బుద్ధి కుక్క తోక వంకర లాగే అని చెప్పాలి.. అతడు షర్ట్ మార్చి నా బాత్ గౌను పెట్టాడు, అతడి కప్బోర్డ్ లో. నేను ఇల్లంతా వెతికి అలిసిపోయాక కురచోడు అతడి ఎదురుగా ఆ డ్రస్ తెచ్చాడు అతని గది లోంచి. తెలియక అతని మీద విరుచుకు పడ్డాను. నాకేం తెలీదు మొర్రో 35 ఏళ్లగా గుడ్ బాయ్ అని పేరు నాకు” అంటూ లబో దిబో అన్నాడు.

కానీ అప్పటికే తిట్టరాని తిట్లు తిట్టాను. మొహం చూబించుకోలేక  అతడినే “నీ మొహం చూబించకు” ఇంక అని తిట్టాను. నేను అపార్తం చేసుకున్నానని  చాల బాధ  పడి అతడు కురచోడి కాళ్ళు పట్టుకున్నాడు ” మమ్మీ దగ్గర ఇలా ఇరికించకు, కావాలంటే ఇంకోలా పగ తీర్చుకో” అన్నాడు. “నువ్వు ఊర్జా అమ్మమ్మని దాచి పెట్టావు అంట” మమ్మీ చెప్పింది అన్నాడు.

అతడి కళ్ళలో , నా కళ్ళళో నీళ్ళు ఒకే సారి తిరిగాయి.

“అమ్మమ్మ వచ్చే వరకు నేను ఇంతే” అని గదీలో కెళ్ళి తలుపు బిగించుకున్నాడు.

మర్నాడు పోర్టునే  నాకు నిజo తెలీదని తిట్టుకుంటూ బట్టలు ఉతుక్కున్టునాడు ఆలెక్స్ .  “సింహాలను ఎన్నిటిని నా చేతుల మీద ఆడించాను, ఈ రేచల్ ని మాత్రం ఒప్పించటం నా తరం కావటం లేదు”  అని తిట్టుకుంటూ బట్టల్ని బండ కేసి బాదుతున్నాడు.

నేను పిల్లలని పంపి “సారి చెప్పండి” అని పంపాను. నాకు తెలీనట్లు హాల్ లోనే కూర్చున్నాను .

పిల్లలు వెళ్ళి  ” ఏడవకండి అంకల్ , మమ్మీ కి మిమ్మల్ని క్షమించమని చెప్తాము” అని నిప్పుకు ఆజ్యం పోశారు.

అలెక్స్ పక్కన ఉన్న  సర్ఫ్ నీళ్ళ మగ్ ని వాళ్ళ మీద గుమ్మరించాడు, “నన్ను క్షమిస్తుందా మీ అమ్మ, నేను ఏం తప్పు చేశాను రా!”  అంటూ…

నా దగ్గరకు పరుగున వచ్చి పిల్లలు అలెక్స్ చూడు మమ్మీ ఎలా చేశాడో అన్నారు.

అప్పుడర్థమయింది పిల్లలు ఎంత గడుగ్గాయులో  అని. “ఆలేక్స్” అని అరిచాను , నేనే సారి చేప్దామని.

కానీ ఈ సారి అతడు నేను మళ్ళీ తిట్టటానికే పిలిచాను అనుకోని నీళ్ళ సంపులో దూకి తల దాచుకున్నాడు.

క్రిస్మస్ రోజులు, దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. అర్ధ రాత్రి రెండు గంటలు , నాకు నిద్ర పట్టటం లేదు. బయట లాన్ లో కూర్చున్నాను. కాసేపటికి అలెక్స్ నా పక్కన వచ్చి  కూర్చున్నాడు. నా మనసు తీవ్ర ఒత్తిడికి గురై ఎలాగో తమాయించుకుంటున్నాను.

“ఆకాశంలో చుక్కలను చూశావా, బాగున్నాయి కదు!” అన్నాడు

నేను చాచి పెట్టి కొట్టాను అతడిని ” కష్టం లో ఉన్నాననే కదా పిల్లల్ని కొట్టావు” అన్నాను.

అతడు నా తలను తన రెండు చేతుల్లోకి తీసుకొని ” ఈ సమస్య గడిచిపోతుంది, కానీ ఈ క్రిస్మస్ రోజులు వచ్చే సంవత్సరం కూడా ఇంతే అందంగా ఉంటాయని చెప్పలేను, “so enjoy”  అన్నాడు.

“వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకు వచ్చావు” అని అడిగాను.

“నీ సొంత పిల్లలు ముగ్గురే, మరి నువ్వు అందరినీ ఎలా సమానంగా చూడగలుగుతున్నావు?” అని తిరిగి ప్రశ్నించాడు.

నా ఒత్తిడి అంతా దూది పింజ లా ఎగిరి పోయింది, కానీ ఎందుకో అతని చేతుల్లో తల వాల్చి రెండు నిమిషాలు అలాగే ఉండి పోయాను.

నా చెమ్మగిల్లిన కాళ్ళను పసికట్టి అతడు ” ఇప్పుడే చెప్పాను, ఈ పొగ మంచు, ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా స్పెషల్, గ్లోబలైసషన్  వల్ల ఇవన్నీ వచ్చే ఏడు  ఉంటాయో ఉండవో తెలీదు, కావాలంటే  నీ కళ్ళను చూసి నక్షత్రాలు అనుకోగలను కానీ” అన్నాడు.

నేను ఫకాలున నవ్వాను .

సమయం 3.45 తెల్ల వారు ఝామున , పొగ మంచు దట్టంగా కమ్ముకుని మిమ్మల్ని దుప్పటిలా కప్పెసింది. మేము  మాత్రం చలికి వెరువక అలాగే నక్షత్రాలను చూస్తూ లాన్ లోనే నిద్రలోకి జారుకున్నాము.

అందరం షో కి సిద్దంగా ఉన్నాము.

ఆ పాప కూడా జమీందారు గారి పక్కనే  అక్కడే కూర్చున్నది. మేము షో ని మొదలెట్టాము. మొదట అలెక్స్ కురచోడు కలిసి రక రకాలైన స్టంట్లు చేశారు. పాప ఇబ్బందిగా అటు ఇటు కదిలింది తప్ప పెద్దగా ఆమె పెదాలు విచ్చుకోలేదు. నాకు ఆ పాపకి ఏదన్నా జబ్బు కాబోలు అని సందేహం కలిగింది. ఏనుగులు ఒంటి కాలి మీద స్టూల్ మీద నిల్చోనే ఫీట్లు చేయించారు నా ముగ్గురు కవలలు. కానీ పాప ముఖములో పెద్ద సంతోషం కలగ లేదు. గుర్రమ్ ఫీట్లు చేశాను నేను, తల వెనక్కి తిప్పి అమ్మే విముఖతను చూపింది.

కురచోడికి భయం పట్టుకుంది, వెంటనే పెద్దోడు చేయాల్సిన ఫైర్ స్టoట్లు వాడు చేస్తానని వచ్చాడు.  అలెక్స్ వాడిని కొట్టినంత పని చేసి, వాడిని ఆపి తాను తీసుకున్నాడు ఆ బాధ్యత.

జమీందారు గారి అమ్మాయి నిద్దర్లోకి జారుకుంటోంది, జమీందారు గారు ఇక వెళ్లిపోదామని నిరాశగా లేచారు.

నాకు చివరి ప్రయత్నంగా ఒక్క ఆలోచన వచ్చింది, అంతే ఏనుగులకి నా భాషలో సైగ చేశాను, అవి వెళ్ళి పడుకున్న పాపను ఎత్తి నా చేతిలోకి విసిరాయి, నేను అమాంతం పాపను పట్టుకుని పైన ఉన్న హాంగర్ని అందుకున్నాను,  పాపను నడుముకి కట్టుకొని.

ఆమె తండ్రి  “ఆపండి, ఏం చేస్తున్నారు నా కూతురిని” అని ముందుకొచ్చాడు

అప్పటికే నేను ఒక హాంగర్ నించి మరో హంగారుకు నా పిల్లల సహాయముతో మరియు అలెక్స్ సహాయం తో పావు గంట ఆపకుండా తిరిగాము. మాతో పాటు పాపను ఏనుగులు, గుర్రాల మీద పల్టీలు కొట్టించాను జాగ్రత్తగా..

కిందకు దిగాక ఆయన “ఎంత ధైర్యం నీకు, నీ డబ్బు కోసం నా కూతురినే పణంగా పెడతావా?” అన్నాడు

పాప ఆయనకు అడ్డుపడి “లేదు నాన్నగారు నాకు చాలా హాయిగా అనిపించింది, ఇప్పుడు అర్థం అయింది నాకు, రోజు ఎందుకు దిగులుగా ఉంటుందో, నాకు మీ పక్కనే కూర్చొంటే పెద్ద సంతోషం  కలగటం లేదు. వాళ్ళతో సమానంగా నేను ఆడినప్పుడు నాకు నిజమైన ఆనందం కలిగింది”  అని అన్నది.

ఆయన మొహంలో కొట్టొచ్చినట్లు సంతోషం కనబడింది.

పిల్లలు, అలెక్స్ చాలా బాగా సెలబ్రేట్  చేసుకుంటున్నారు, నీళ్ళ పంపులన్నీ తెరిచి వర్షం అంటూ లాన్ లో ఆడుతూ ఆనందిస్తున్నారు. “మళ్ళీ గుర్రాలకు గుగ్గిళ్ళు  మర్చిపోయాడు అతను, మళ్ళీ రేపు ఆదివారం” అనుకోని నేను వాటి కోసం వెళ్ళాను.

మరో షోకి నేను నా కసరత్తులు గుర్రం మీద మొదలెట్టాను. నా గుర్రపు చెక్కర్ల మద్యలో అతడు నిలబడి నా 40 వేల $ ఎక్కడ ? నేను వెళ్ళాలి ఇంక, పైగా గుర్రానికి గుగ్గిళ్ళు తెచ్చుకోలేదు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి నేను” అన్నాడు.

నాకు మరల నవ్వొచ్చింది, గుర్రం మీద చెక్కర్లు కొడుతూ, గాల్లోకీ ఎగిరి పల్టీలు కొడుతూ బిగ్గారుగా నవ్వాను. మామూలుగా అతడికి కళ్ళు తిరుగుతాయి నా చెక్కర్లు చూసి, కానీ ఈ సారి అతి వేగంగా ఒక్క ఉదుటున నా గుర్రం మీద ఎక్కి “ఇక నీ ఆట కట్టు” అన్నాడు.

********************************                                 ********************************

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s