అమ్ము- ఆల్ఫా-ఇన్ఫినిటీ

అమ్ము- ఆల్ఫా-ఇన్ఫినిటీ

నా పేరు అలివేలు. ముద్దుగా అందరూ అమ్ము అని పిలుస్తారు. నేను చాలా తెలివయిన అమ్మాయిని అని మా పిచ్చి నాన్న నమ్మకం. ఆ అమాయకుడిని చూసి మా అమ్మ తల కొట్టుకోవటం రోజు పరిపాటే  మా ఇంట్లో. ఇంతకీ అసలు నేను తెలివి గల దాన్న ?కాదా? అన్న మీమాంసలోనే నాకు 16 యేళ్ళు వచ్చేశాయి. అన్నయ్య బోoడామ్ అని 24 గంటలు ఎక్కిరిస్తుంటే  ఊక్క్రోషంతో మేడ మీద ఏరోబిక్స్ మొదలెట్టాను. మొదలెట్టిన పది నిమిషాలకే పక్కింటి రమణా రావ్ అంకల్ వచ్చి “ఆడ పిల్లలకి కా..స్థ ఒళ్లుంటేనే బాగుంటుంది అన్నాడు, చూడకూడని ప్రదేశాల్లో చూస్తూ.. అంటే కాదండోయ్, ఒక డైరీ మిల్క్ చక్లేట్ కూడా ఇచ్చాడు. నేను చిరు సిగ్గుతో తీసుకొని కాలి బొటన వేలితో ఒక ముగ్గు వేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.దానికి ఉబ్బి తబ్బిబ్బు అయ్యి “సాయం కాలం  ఇదే చోటున లాల్చీ లుంగీ కట్టుకొస్తాను, అమ్మకి అంకల్ లెక్కలు ట్యూషన్ చెప్తాడు అని చెప్పు” అన్నాడు నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందని తెలియక.

ఇప్పుడు అంకల్ ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లో ఉన్నారు, వాళ్ళావిడ వీడియో చూసిన తర్వాత ఇచ్చిన ప్రోత్సాహము తో.

ఇంక నా గురించి పరిచయం చాలనుకుంటాను. సరి పోలేదా?

నేను  ఛామనచాయ కి కొద్దిగా తక్కువగా, కాస్త బొద్దుగా, ముద్దుగా ఉంటాను. ఏదో అడపా దడపా అయిదు ఆరుగురు అబ్బాయిలు నా వెంట పడ్డా నా కంటికి వాళ్ళు ఆన లేదు. ఎవరైనా సంస్కారవంతుడయిన అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొందామని నా జీవిత ఆకాంక్ష తప్ప, పెద్దగా నాకేం చదువు వంట పట్టటం లేదు. ఇది చూసిన మా అమ్మ రేపల్లే లో ఉన్న మా బావ కి ఇచ్చి నాకు పెళ్లి చేసేశారు, 18 వ ఏడు అనే గడిలో పడగానే. నా కధ పాఠశాల నించి  నేరుగా పాకశాలలో పారేశావా ఏంట్రా దేవుడా అని తిట్టిపోసాను…పాపం దేవుడు బాగా ఫీల్ అయ్యాడు. ఆ రోజు సాయంకాలం వస్తూనే బావ రేస్తారున్ట్ కి తీసుకెళ్ళి “చూడు అమ్ము, నువ్వు చాలా తెలివిగల దానివి. అలాంటి నిన్ను వంటకి, ఇంటి పనికి పరిమితం చేయటం నాకు నచ్చలేదు. కాలేజీ లో చేర్పిస్తాను, బాగా చదువుకో” అన్నాడు.

మా బావ చాలా మంచోడు.. కాదు కాదు దేవుడు. నా కన్నా 15 యేళ్ళు పెద్దవాడే అయిన కూడా భర్త అనే దర్ప మచ్చుకైనా లేదు. అమ్మ కంటే లాలన గా మాట్లాడ్తాడు, నానా కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. నేను ఏది అడిగిన క్షణాల్లో అమరుస్తాడు. ఆ నిజాయితీ వల్ల నాకు చదువు మీద ఆసక్తి పెరిగింది, ఇపుడు క్లాస్స్ లో నేనె ఫస్ట్ ర్యాంకు అంటే నమ్మండి.

తర్వాత బావ బండి నేర్చుకో అన్నాడు. ఎప్పుడు ఆడ పిల్లలతోనే కాదు, అప్పుడప్పుడు మగ వాళ్ళ తో కూడా మాట్లాడాలి, అది నీ కెరీర్ లో చొచ్చుకు పోవటానికి ఉపయోగ పడుతుంది అని తన సహృదయాన్ని చాటుకున్నాడు. మొదటి సారిగా అమ్మకి ధన్య వాదాలు తెలుపుకున్నాను మనస్సులోనే.

*********************                 *********************

ఒక రోజు రాత్రి క్రాఫ్ట్ ఎక్ష్భీషన్ ప్రొజెక్ట్ కోసం బయట ఊరికి వెళ్ళి తిరిగి వచ్చే సరికి 11 గంటలు అయింది. ఇంటికి వచ్చే సరికి ఆశ్చర్యంగా ఇల్లంతా ఫూలు బెలూన్స్ తో  అలంకరించి ఉంది. అమ్మ నాన్న కూడా ఉన్నారు. మార్చే పోయాను, ఇవాళ నా పుట్టిన రోజు కదా, బావ ఇంత శ్రద్ధ చూపాడో, అమ్మని సంతోషం తో అమాంతం కౌగలించుకున్నాను. నన్ను ఒక్క తోపు తోసి బలంగా చెంప పగలు కొట్టింది అమ్మ, “ పెళ్లి అయిన ఆడ పిల్ల కి ఈ అర్ధ రాత్రిళ్లు తిరుగుళ్ళేంటి, పరాయి మగాళ్లు నిన్ను దిగబెట్టటం ఏంటి?” అంటూ.

నేను గట్టిగా నవ్వాను.  నన్ను బావ ఎంతలా మార్చేశాడో అమ్మకి తెలీదు పాపం.. “బావ !పుట్టిన రోజు నాడు అమ్మ కొట్టింది చూడు  అన్నాను.

కనీసం ఆ అబ్బాయి తో రాకుండా ఉండాల్సింది  అమ్ము, అప్పుడు ఏదో గుడికి వెళ్ళావని చెప్పే వాడిని అన్నాడు.

నాకు అర్థం కాలేదు “ఏంటి బావ” అని అడిగాను.

బావ అమ్మకేసి చూస్తూ “అమ్ము ని ఏమన్నా క్రమ శిక్షణలో పెట్టి ఉంటే అది చిన్నప్పుడే చేయాలి ఆంటీ, ఇపుడు కాదు” అంటూ కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళి పోయాడు.

“ఛీ..ఛీ.. నా కడుపున చెడ పుట్టావ్ కదే, పుట్టింటి పరువు తీసేశావు” అంటూ  నాన్న అమ్మని లాక్కొని వెళ్ళిపోయారు.

నాకు కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి…

***************                  **************                     ************

తెల్లగా తెల్లవారింది. బావ కాఫీ కప్ తో నా వద్దకు వచ్చి “ పిచ్చి అమ్ము, బాధ పడ్డావా? నువ్వే చెప్పు, పల్లెటూరు బైతుని ఎవరన్నా భరించగల రా, ఏదో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం మీ అమ్మ ఇచ్చే కట్నం కక్కుర్తి తప్ప నిన్ను ఎవరన్నా చేసుకుంటారా? “అల్ మోటివేషన్స్ ఆర్ నాట్ ఫర్ గుడ్ అమ్ము” అంటూ విడాకుల పత్రాలు నా చేతిలో పెట్టాడు.

నేను సంతకం పెట్టాను అచేతనంగా….

*************                        *****************                        *****************

NH 18 road: వేగంగా వెళుతున్న వాహనాలకు సమానంగా నా మనస్సు పరుగెడుతోంది. నడుస్తున్న, నడుస్తున్న..నడుస్తూనే ఉన్నా నేను. అక్కడున్న 84 కి.మీ అనే మయులు రాయి నన్ను చూసి వెక్కిరించింది “ గమ్యం లేని ప్రయాణం ఏక్కడికి” అంటూ..

నమ్మక ద్రోహం.. నయ వంచన.. జ్వాల రగిలిపోతోంది, మనసులో..నా దేవుడు నా తండ్రి ముందే నా నడవడిక బాలేదని కుటిలమయిన పన్నాగం తో నిరూపించాడు. నా మట్టి బుర్ర కి ఏం చేయాలో తెల్సే లోపే అంతా జరిగి పోయింది. నా ఆలోచనల సంఘర్షణలో నేనుండగానే, నా ముందు రయ్యిమంటూ ఒక బండి వచ్చి జారీ పడిపోయింది.

చచ్చాడేమో అనుకోని కదలికలు లేని అతన్ని దగ్గరికి వెళ్ళి శ్వాస ఆడుతోందా లేదా అని పరీక్షించాను.వాడు నన్నే విచిత్రంగా చూస్తూ అమ్మంతమ్ లేచి బండి ని అటు తిప్పి ఇటు తిప్పి చూసుకుంటూ దేవుడా! ధన్య వాదాలు అంటున్నాడు ఆకాశంకేసి చూస్తూ..

నాకు చిర్రెత్తుకొచ్చి “నీకు బుద్ధుందా? ఇంత దెబ్బ తగిలితే బైకును చూసుకుంటున్నావా? పద కట్టు కడతాను అంటూ చూన్ని చింప బోయాను.

వాడు ఆగండీ అంటూ చేతులు గాల్లో ఆడించి ఒక వెదురు కంకణం తీసి “ ఆల్ఫా బీటా నీకు నాకు టాటా” అన్నాడు కళ్ళు మూసుకొని, అంతే క్షణంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ వాడీ బండి మీద వుంది. నాకు మతి గాని పోయిందా అనుకుంటూ వాడిని “మంత్ర గాడివా”? అని అడిగాను అనుమానంగా.

“కానే కాదు” అంటూ వాడికి వాడే ప్రధమ చికిత్స చేసుకొంటు, “అవును ఆడ పిల్లవి, ఒంటరిగా హై వే మీద ఏం చేస్తున్నావ్?” అని అడిగాడు.

గట్టిగా ఏడ్చేశాను. కర్చీఫ్ ఇచ్చి, “ఇప్పుడు చెప్పు” అన్నాడు.

పూస గుచ్చినట్లు చెప్పాను.

“వాడికి వేరే పెళ్ళాం ఉందా”

“తెలీదు.. తెలుసుకోవాలని కూడా లేదు, ఇంతకీ నీ పేరు ఏంటి?”

అక్కడ మొగుడు అడగ్గానే సంతకం చేసొచ్చి, తీరిగ్గా నా పేరు అడుగుతున్నవా?

“నీ పేరేంటీ?

ముందు నువ్వు చెప్పు

అలివేలు, కానీ అమ్ము అంటారు.

ఆల్ఫా..

అదేం పేరు, విచిత్రంగా?

అమ్మ నాన్న శాస్త్ర వేత్తలు, అందుకని.

ఆకలేస్తోంది, అనుకున్నాం ఇద్దరం ఒకే సారి పొట్ట పట్టుకొని. వాడు ఇందాకటి మంత్రమే మళ్ళీ చెప్పి ఫలహారాల పళ్లెము తెచ్చాడు అకస్మాత్తుగా.

తినొచ్చా? లేదా? వీడు మంత్ర గాడిలా ఉన్నాడే? అనుకుంటుండగా..వాడు తినొచ్చు, మంత్ర గాడిని కాదు ఖచ్చితం గా అన్నాడు. వీడికి ఫేస్ రీడింగ్ కూడా వచ్చా అనుకుంటూ మరో ఆలోచన లేకుండా తినేసాను.

“మీ ఇంట్లో దింపుతా పద” అన్నాడు తింటం అయ్యాక.

ఆ మాట అన్నావో చంపేస్తా జాగ్రత్త”, అని హూంకరించాను.

“పిచ్చి అలివేలు ! సమస్య నించి పారిపోవటం అంటే నిజామ్గా నడవడిక బాగోలేదని అర్థం. మీ నాన్న ఎప్పటికీ నిన్ను ఇలానే భావించ కూడదు అనుకుంటే, ముందు ఇంటికి వెళ్ళు, ఆ విడాకుల కాగితాలు వెతికి చించేయి”

ఆ తర్వాత నన్ను మా ఇంట్లో పాత మంత్రం ద్వారా దింపేశాడు. నాకు ఏడుపొస్తుంటే నా కళ్ళు తుడుస్తూ నా చేతిలో ఒక వెదురు కంకణం పెట్టి, “నీకు ఎప్పుడు అవసరం వచ్చినా, నా పేరు చెప్పి ఈ కంకణం తో నీకు ఏం కావాలో చెప్పు” అని మాయమయి పోయాడు.

ఈ లోపు మా బావ ఎవరో అమ్మాయి తో లోపలికి వచ్చి నన్ను చూసి “నీకు ఇంకా సిగ్గు రాలేదా? ఎందుకు వచ్చావ్ మళ్ళీ? అన్నాడు.

పొట్టి గౌను వేసుకున్న,తెల్లటి పొడుగాటి కాళ్ళ అమ్మాయి నన్నే చూస్తూ “పూర్ గల్, వదిలేయ్” అంటోంది.

నన్ను ఆల్ఫా దగ్గరికి తీఉకెళ్ళు అన్నాను, వెదురు కంకణంతో, అవమాన భారం తట్టుకోలేక..

ఎన్‌హెచ్18 రోడ్ మీద ఉన్న వాడి దగ్గర అమాన్తమ్ కూలేసింది నన్ను వెదురు కంకణం.

“మళ్ళీ ఏంటీ”

“చాలా స్కెచ్ వేసి ఇరికించాడు నన్ను వాడు, వాడి మొహం చూడాలంటేనే అసహ్యంగా వుంది”.

“కావొచ్చు కానీ వాడు నీ నడవడిక మీద మచ్చ వేశాక అలా వదిలేస్తావా?

“కంకణం ఇచ్చి ఎంత సేపు అయింది, యూస్  యువర్ బ్రైన్ లేడి”

నేను కృత నిశ్చయంతో  కంకణం దగ్గరకి తీసుకొని “ఇంటికెళ్లాలి… కాదు కాదు బావ ఆఫీసు కి వెళ్ళాలి అన్నాను.

మొదలు ఇంటికి వెళ్ళి మారు క్షణం లో బావ ఆఫీసు లో ఉన్నాను.

“ఇదేంటి ..ఈ మిషనుకేమన్నా పిచ్చా? ఆల్ఫా”

కాదు..నువ్వేమన్నా సరే అది చేసి తీరుతుంది. అది కూడా చెప్పింది చెప్పినట్టుగా. అందుకే జాగ్రత్తగా ఆలోచించి అడగాలి నువ్వు”

పిచ్చి సంతోషంతో  గెంతులేశాను.

బావ చాలా శ్రద్ధగా పని చేసుకొంటున్నాడు. ఇంతలో వాళ్ళ బాస్ వచ్చి ఏదో పావుగంట విడమరచి చెప్పాడు. “నువ్వు బాగా చేయగలవని నీకు మాత్రమే అప్పగిస్తున్నాను” అని చెప్పి వెళ్ళి పోయాడు. ఒక గంట సేపు ఏవో వెతికి మొత్తానికి లెటర్ తయారు చేసి అక్కడున్న గుమాస్తాకు సాయంత్రం నాలుగు కల్లా ఇచ్చేయమన్నాడు. అతను ఎంతో భక్తి గా అది తీసుకు వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగానే ఫోన్ అందుకొని “హే లవ్, లావణ్య.వెరీ హెక్టిక్ డే, నీడ్ యూ బాడ్లీ” అంటూ మెసేజ్ పెడ్తున్నాడు.

నాకు కోపం ముంచుకు వచ్చింది. ఆల్ఫా వైపు చూశాను. నా కోపాన్ని వాడు అప్పుగా తీసుకున్నాడు. సూటిగా మొబైల్ ని చూశాడు. అవతల వైపు నించి మెస్సేజ్ వచ్చింది “ ఐ యామ్ నాట్ యువర్ సెక్స్ టాయ్”

ఖంగు తిన్నాడు బావ.

నా చేయి పట్టుకొని “ ఆల్ఫా బీటా నీకు టాటా “ అన్నాడు బావ వైపు చూస్తూ, ఇద్దరం మాయమై పోయి క్షణంలో బిడ్డింగ్ ఆఫీస్ లో ఉన్నాము. గుమాస్తా అనుకున్న సమయానికి కొటేషన్ కవర్ అధికారులకి అప్పగించాడు.

ఆల్ఫా గాడిని కాశీ గా ఒక్క గుడ్డు గుద్దాను కసిగా, వాడు కడుపు పట్టూకొని వంగి పోయి “బండ దాన ఏం తింటున్నావే” అంటూ ఒక్కడే మాయమై పోయాడు.

నా కంకణం సహాయం తో నేను మా ఇంటికి చేరాను. మా బావ హఠాత్తుగా నన్ను చూసి షాక్ అయిపోయాడు, “ ఇందాక గదిలో లేవు కదా! అన్నాడు.

నేను బావ కళ్ళల్లోకి చూస్తూ కంకణం సరి చేసుకుంటూ “ఆపిల్ కావాలి” అన్నాను, ఆపిల్ వచ్చి చేతిలో పడింది.

బావ బిత్తర పోతుండగా నేను గదిలో కెళ్ళి  తలుపేసుకొని కూర్చొన్నాను.

బయట ఫోన్ మోగింది, నేను పరుగున తలుపులకి చెవులు రిక్కించి నిల్చనున్నాను.

సారి సర్! మీరు చెప్పినట్ల్లు అన్నీ క్రోఢీకరించి, మన ప్రత్యర్థి గుమాస్తా కి లంచం ఇచ్చి వాళ కుఓటే తెల్సుకుని ఒక శాతం తగ్గించి మరి కోట్ చేశాను” నమ్మండి.

“షటప్, నీ పల్లెటూరి బైతు కి చెప్పు నీ కధలు నాకు కాదు ”

ఫోన్ కట్ అయింది.

నాకు అర్థం అయింది ఆల్ఫా గాడు కోట్ ప్రింట్ చేసే సమయానికి నెంబర్ మార్చేశాడు.

“ఒరేయ్ ఆల్ఫా ఎక్కనున్నావు రారా? అంటూ సంతోషం గా అరిచాను.

“ఇక్కడే ఉన్న” అంటూ వాడీ గాల్ ఫ్రెండ్ తో సహా వచ్చాడు.

“చ..చ ఇదేంటీ.. ఇలా వచ్చావ్..?

“మరేం చేయమంటావ్ కంకణం మహిమా, ఉన్న పళంగా లాక్కొస్తుంది”.

ముందు వెళ్ళు ఇక్కడ నించి ..అన్నాను గట్టిగా..

***************                           ******************

మరునాడు:

“నేను బాగా చదువుకొని పైకి రావాలి” అన్నాను కంకణం దగ్గర చేసుకొని.

ఉన్నట్టుండి నేను నా పాత ఫాషన్ డిజైనింగ్ క్లాస్ లో కూల బడ్డాను. సర్దుకునేలోపే ఫాకల్టీ మాడమ్ వచ్చి ఇన్ని రోజులూ ఏమీ అయిపోయావు, ఇన్నాళ్ల క్రాఫ్ట్ వర్క్ బుక్ కావాలి అన్నది. అంతే  ఆవిడ చేతిలో ప్రోజేక్ట్ పుస్తకం వచ్చి పడింది.

“వెరీ ఆర్రొగంట్ లేడి” అని కళ్ళెర్ర చేసి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత పాఠం మీద నా మనస్సు నిమగ్నమైపోయింది.

సాయంకాలం:

“అవును ఆల్ఫా! క్రాఫ్ట్ బుక్ మా మ్యాడమ్ చేతిలో ఎలా పడింది.?

“మీ మ్యాడమ్ కంకణానికి దగ్గరగా వచ్చి మాట్లాడి ఉంటుంది.”

************                     ****************                          *****************

నేను ఇంటికి వెళ్ళి నా క్రాఫ్ట్ బుక్ తో కుస్తీ పడుతున్నాను.

మా బావ వచ్చాడు “ ఏమే నీకు ఎన్ని సార్లు చెప్పాలి, కుక్క లాగే ఇక్కడే ఉంటావా? మళ్ళీ క్లాస్ లో చేరావా?

అంటే నన్ను విడిచి వెళ్ళవా? అని నా మీద కొచ్చి బెదిరిస్తున్నాడు. నా మెడ పట్టుకొని “లావణ్య అంటే నాకు ప్రాణమే, ఒక పని చేయీ, నా తల పగలుకొట్టు” అన్నాడు.

అంతే వాడి వెనకాల ఒక బెత్తం వచ్చి ఉతకటం ప్రారంభించింది. నేను కంకణం మహిమ అని తెలుసుకోని “స్టాప్ ఇట్” అన్నాను.

**********                      ******************                  *****************

రాత్రి జరిగింది ఆల్ఫా గాడికి చెప్పాను. వాడు ఉడికి పోయి ఉన్న పళంగా బావ దగ్గరకు తీసుకెళ్లాడు.

లావణ్య తాగి పడుంది. బావ వాష్ రూమ్ లో ఉన్నాడు ,లావణ్య స్థానం లో నన్ను ఉంచాడు ఆల్ఫా. నన్ను చూసి ఒక్క పరుగున వెళ్లిపోయాడు. ఇంతలో లావణ్య లేచింది, హే వేర్ ఆర్ యు? అంటూ మెసేజ్ పెట్టింది, వాడికి.

ఒక్క చూపు చూశాడు ఆల్ఫా గాడు తన మొబైల్ ని . అవతలి వైపు నించి మెసేజ్ వచ్చింది.

“హే సెక్స్ టాయ్, ఐ యాం విత్ మై వైఫ్” అని .

లావణ్య గోడ కేసి కొట్టింది.. మొబైల్‌ని.

****************                   ******************         ***************

లావణ్య మా ఇంట్లో ఉండాలి అన్నాను.

అందరం బావ బెడ్ రూమ్ లో ఉన్నాము.

ఆల్ఫా గాడు బావ చూడాలనే లావణ్య ఫ్రెండ్ తడ బడుతూ వెళ్లిపోతున్నట్టు చూపించాడు.

నేరుగా తన పడక గదిలో పడుకొని ఉన్న లావణ్య చెంప పగలు కొట్టాడు అతను.

అదిరి పడిన లావణ్య శివంగిలా రెచ్చి పోయి అది నేర్చుకున్న కుంఫూ, కరాటే అన్నీ వాడి మీద ప్రయోగించి వాడి నడుము విరగ కొట్టింది, అమ్మ నాన్న ఎదురుగా.

మా నాన్న క్షమించు తల్లి అన్నారు.. ఇవాళ నా పుట్టిన రోజు.. ఆల్ఫా గాడు పెద్ద బహుమతినే ఇచ్చాడు.

వెదురు కంకణాన్ని దగ్గరగా తీసుకొని “నేను సెల్ఫ్ రిలయంట్ ఉమెన్ అవ్వాలి” అని వాడికి ఇచ్చేశాను, చివరి కోరికగా..

 

రాచయిత్రి: మన జీవితం, ఆ జీవితము లో ప్రేమ మనకెంత విలువైనవో, అవతలి వారికి కూడా అంతే విలువైనవి. మన స్వార్థం కోసం అవతలి వారి జీవితాలను పణంగా పెట్టటం అమానుషం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s