మంత్ర

                                                                     మంత్ర

స్టేజీ మీద ఉన్న శాన్డల్యకు నెర్వస్ గా ఉంది. పూల దండలతో మనిషి నిలువునా మునిగి పోయాడు. ఊపిరి కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా అభిమానులు, కార్పొరేట్లు అతడిని చుట్టుముట్టారు. అతడికి డాక్టరు అపాయింట్‌మెంట్ సమయం దాటి కూడా గంట అవుతోంది. మిస్ అయితే మళ్ళీ 2 నెలల వరకు దొరకదు. బలవంతంగా నవ్వుతూ అందరికీ ఆటో గ్రాఫ్ ఇస్తూ పళ్ళ బిగువున  ఎప్పుడు బయట పడదామని ఎదురు చూస్తున్నాడు. ఒక అరగంట అపాయింట్‌మెంట్ కావాలంటూ వచ్చి గంటన్నర కు పైగా ఆపేశారు. ఎంతైనా స్టూడెంట్స్ని నిరాశ పరచటం ఇష్టo లేక అతడు భరిస్తున్న కొద్దీ ఆడ పిల్లలు మరీ పోకిరిలు లాగా ప్రవర్తిస్తున్నారు. ఒక అమ్మాయి బ్లేసర్ తీసి కంఠానికి ఎదకి మధ్య ప్రదేశములో ఆటో గ్రాఫ్  కావాలంటుంటే ఇంకో అమ్మాయి “నడుము మీద సంతకం చేయరా ప్లీజ్..!!” అంటూ గోముగా మొఖం పెడుతోంది. ఇంకొక మగాడయతే స్వర్గం అనుకుంటాడు కానీ శాన్డల్యకు ఇబ్బందిగా ఉండి నరక యాతన అనుభవిస్తున్నాడు. తను తన ప్రాణాన్ని విడిచి బతకటం మొదలెట్టి దాదాపు 29 సంవత్సరాలు అయింది. అతడికి 65 ఏళ్ళు. మరి ఆడపిల్లల గోల ఏంటి అంటే అతడొక పాప్ సింగర్. పైగా అతడు స్త్రీల కోసం చేయని మంచి పని లేదు. ఒక సమాంతర ప్రభుత్వం లాగా ఆడవారి కోసం పాటు పడతాడు. తన పలుకుబడిని ఉపయోగించి ఎంతో మందికి త్వరితగతిన న్యాయాన్ని అందించాడు. అసూయ పరులు ఎందుకు ఆడవాళ్లేకే అంత సహాయం చేయటం అని, స్త్రీ లోలుడని అంటారు. కానీ అతడికి అమ్మాయిలంటే ఎన లేని గౌరవం.

ఇక అతని వల్ల కాక ఒక్క సారి మండి పడ్డాడు స్టేజీ మీద అమ్మాయిల పైన  “ఇంక చాలు ఆపుతార! మగాళ్లు గౌరవించాలని ఎలా మీరు కోరుకుంటారో అలాగే మీ ప్రవర్తన ఉండాలి.”

“మేమేం చేశాం, శాండీ” అన్నారు వాళ్ళు.

“మిమ్మల్ని ఎవరన్నా ఈ రకంగా ఇబ్బంది పెడితే మీరు బాధ పడతారా ? అలాగే నేను ఎక్కడ  బడితే అక్కడ ఆటో గ్రాఫ్ పెట్టను”

వాళ్ళు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ “ సో స్వీట్!!” అంటూ దారికి అడ్డు తప్పుకున్నారు.

మౌనంగా వారికి చేతులెత్తి ‘బాయ్’ అన్నట్టు చేయి ఊపి, కార్ ఎక్కి వెంటనే డాక్టర్ కి ఫోన్ చేశాడు. ఆయన, “సారి శాండి, నా ఫ్లయిట్ కి టైమ్ అయ్యింది. కావాలంటే ఎయిర్ పోర్ట్లో కలుద్దాం” అన్నాడు. అతి వేగంగా కార్ను రివర్స్ చేసి ఆఘ మేఘాల మీద శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాడు. పరిగేట్టుకుంటూ వెళ్ళి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ స్పర్శతోనే అతను ‘ఏ స్థాయిలో’ తన వద్దకు వచ్చాడో డాక్టరుకి అర్థమయింది.  అతడి మీద విరిచుకు పడాలన్నంత కోపం వచ్చినా తమాయించుకున్నాడు, కారణం ఒకటి అతడి మానసిక స్థితి అయితే  రెండోది అతడు ఒక్క అపాయింట్‌మెంట్ కి చెల్లించే మూల్యం అక్షరాల 30 లక్షలు. ఆయన ప్రశాంతంగా నవ్వి “శాండి! ఇంక వెతికింది, కష్ట పడింది చాలు. మీకు కూడా 65 ఏళ్ళు. వైద్యం పని చేయాలన్నా కూడా ముందు మీ సహకారం కావాలి, ముందు సంతోషంగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది,” అన్నాడు.

“ డాక్టర్! అంతా ఆమే కోసం అంతే, మనీ ట్రాన్సఫర్ చేస్తాను”. అని అతడు వెను తిరిగాడు.

డాక్టరు అతడు పూర్తిగా వెళ్ళాడని నిర్ధారించుకున్నాక  “నీ సమస్య ఒక బూజు పట్టిన ప్రేమ కథ, అందులో నించి నువ్వు రావు, రావాలని నువ్వు అనుకుంటేనే కదా నా వైద్యం పని చేసేది. సలహా పాటించని వాడివి ఎందుకు వస్తావు, ఎందుకు వెళ్తావు? నాకు అర్థం అవ్వటం లేదు”, అంటూ నిట్టూర్చాడు.

**********                  ************                  ************       ***************

పడమటి లోయలు: చిన్న చిన్న వెనక బడిన జాతుల వారు నివసించే ప్రదేశం. పచ్చని పైరులు, పిల్ల గాలులు అతడిని స్వాగతించాయి. వచ్చేశాడు  అన్నీ ఇంకొకరికి అప్పగించి. ఇంగ్లీషు ముక్క మచ్చుకైనా వినబడదు. ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వదు, షాపింగ్ మాల్స్ లేవు మొబైల్ సిగ్నల్ కూడా పని చేయవు. ఇక్కడ కూడా సిటీలో ఉండే బిజీనెస్స్ ఉంది, కానీ వీరు ఇవాల్టికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ కూడా అమ్మాయిలు ఎక్స్పోసింగ్ చేస్తారు కానీ ‘ఆచారం’ పేరుతో “అదే చీర బిగువుగా కట్టి రైక లేకుండా”. ఆచారం చెప్తే పర్వాలేదు, చదువుకున్న అమ్మాయిలను మాత్రమే ఎందుకు నిరసిస్తారు కుటుంబం లోని పెద్ద వాళ్ళు??? ఇలా సమాధానం లేని ఎన్నో ప్రశ్నలకు నవ్వుకుంటూ ఒక ‘ట్రీ హౌస్’ (చెట్ల మీద వెదురు బద్దల తో కట్టిన ఇల్లు.) ని నిర్మించుకున్నాడు అతడు.

డాక్టర్ చెప్పినట్లు రోజూ పాటి టెన్షన్స్ తగ్గినాయి, అతడికి. పొద్దున సాయంకాలం మంచు కురిసే వేళలో వాకింగ్ కి వెళ్ళటం కావల్సిన పుస్తకాలు చదవటం, సొంతంగా కుకింగ్ చేసుకోవటం అతనికి థ్రిల్లింగా ఉంది. కానీ పొద్దెక్కిన కొద్ది మనసుకి పట్టిన గుబులు మళ్ళీ గుర్తు వస్తుంది. ఎందుకని?

*************                   **************                             **************

అలవాటుగా ఇవాళ కూడా ‘ట్రీ హౌస్’ బాల్కనీ లో నిలుచున్న శాండికి, ఒక రోజు కూలి వాళ్ళ బృందం కనిపించింది. చేసేది రోజూ వారీ కూలి అయినా సరే ఏదో గొప్ప పని ముగించినట్టు, తమ వారిని కలుసుకోటానికి వెళ్ళే ఆనందం ముఖం లో స్పష్టంగా కనిపిస్తోంది. తను కూడా రోజుకి 20 గంటలు కష్టపడే వాడు, కానీ చివరికి మిగిలిన 4 గంటలు సరిగ్గా ఉపయోయింగించుకో లేక పోయానే  అనే బాధతో ఇంటికి వెళ్ళేవాడు. మళ్ళీ గతం నుంచి బయటికొచ్చి తిరిగి వాళ్ళనే చూస్తున్నాడు. వారిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అందరి లోకి చివరగా నడుస్తున్నారు, ఒకరి చేతులు మరొకరు పట్టుకొని. అమ్మాయి ఎక్కువగా సిగ్గు పడుతూ, తక్కువగా మాట్లాడుతోంది. అబ్బాయి మొత్తం ప్రపంచాన్ని ఆమె కళ్ళల్లో కి చూస్తూ నడుస్తున్నాడు. శాన్డల్య అడుగులు వాటంతట అవే వారి వెనుకగా నడిచాయి. ఆమెను కొంత దూరము లో వాళ్ళ ఇంటి దగ్గర దిగి పెట్టి అతను ఇంకా ముందుకెళ్లాడు. శాండి అతడినే అనుసరించి కొద్ది దూరంలో ఆపి  “ హేయ్ నీ పేరు” అని అడిగాడు.

అతడికి భాష అర్థం కాక “ఏంటి” అన్నట్టు చూశాడు.

“నా పేరు శాన్డల్య ”  అన్నాడు చేయి కరచాలనం కోసం అందిస్తూ..

పేరు అడుగుతున్నాడు అని అర్థం చేసుకున్న అతను, “మేఖలా”  అని “ఏం కావాలి” అన్నట్లుగా చూశాడు .

“ఆ అమ్మాయి ఎవరు” అన్నాడు ఆ ఇంటికేసి చూపిస్తూ.

అతడు కోపంగా చూసి వెను తిరిగి వెళ్లిపోయాడు. కానీ శాన్డి మాత్రం అతడిని మరలా అనుసరించాడు.

అక్కడికి కొద్ది దూరంలో అతడు కూడా ఒక ఇంటి దగ్గర ఆగిపోయాడు. ఒక స్త్రీ అతడి చేతిలో బాగు తీసుకోని తన కొంగుతో అతడి నుదుటన చెమట చుక్కలు తుడుస్తోంది. అతడు కూడా అమె నడుం మీద చేయి వేసి దగ్గరకు తీసికోని నుదుటన చుంబించాడు.

దిగ్భ్రాంతి కి గురి అయిన శాన్డల్య వెనుతిరిగాడు. తన లాగే ఇంకోరు కనబడే సరికి అతడిలో ఉత్సాహం ఉరకలు వేసింది. కానీ అతడు తన ప్రతి రూపం కాదు. ఎందుకంటే తను కూడా తనదైన ఆమెను ఒకప్పుడు అలాగే చూసే వాడు-‘మొత్తం ప్రపంచం ఆమె’ అన్నట్లుగా.

వెనక్కి వచ్చే సమయము లో తిరిగి ఆ అమ్మాయి ఇంటి ముందు ఆగి చూశాడు – ఇంటెకేసిన తాళం దర్శనమిచ్చింది.

******************            ********************                       ******************

తెల్లవారి మార్నింగ్ వాక్ కి వచ్చాడు. అక్కడ అతడికి నిన్నటి అమ్మాయి కనిపించింది.  ఆమెను అనుసరిస్తూ వెళ్ళి అతడు “నీ పేరు” అని అడిగాడు.

ఆమె ఎవరన్నట్లు చూసి “మంత్ర” అని, మళ్ళీ గడ్డి కోసుకునే పనిలో పడింది.

“నీకు తెలుగు వచ్చా”

“తెలుగోళ్ళింట్లో 5 ఏళ్ళు పని చేశాను”

“నిన్న నీతో వచ్చిన వాడికి పెళ్లి అయింది”

“తెల్సు”

“నీకు కోపంగా లేదా?”

“ఎందుకు”

“వాడు నిన్ను మోసం చేస్తున్నాడు”

“లేదు వాడు నా స్నేహితుడు మాత్రమే”

“మరి నిన్న చేతులు పట్టుకొని నడుస్తున్నారు కదా!?”

“మీరు పట్నం నుంచే వచ్చారా? లేక చదువుకో లేదా?” అన్నది చేస్తున్న పని ఆపేసి జుట్టు సరి చేసుకుంటూ

“వాడి చూపులో ప్రేమ కనబడింది”

“మీ కళ్ళు ప్రేమ తో నిండి పోయినాయి, అందుకే అలా కనబడ్డాయి, ఈ సారి సరిగ్గా చూడండి,” అని వెళ్లిపోయింది.

జీన్స్ ఫాంటు,  గాగ్ర లెంధీ బ్లౌసు వేసుకొని గడ్డి మోపు భుజం మీద వేసుకొని యుద్దానికి వెళుతున్న  యోధుడిలా నడుస్తోంది.

పరుగున వెళ్ళి “నా పేరు శాన్డల్య, నువ్వెంత  వరకు చదువుకున్నావు” అన్నాడు ఆమె దారికి అడ్డుగా నిల్చోని.

“12 వరకు చదివాను.”

“నీకు డబ్బులిస్తాను, నాకు నీ భాష నేర్పించు, ఇక్కడ భాష రాక ఇబ్బందిగా ఉంది.”

“నేర్పించను, నన్ను నువ్వు అని పిలవచ్చా? అంతా పరిచయం ఉందా మనకు?”

అతడు ఖంగు తిని తలొంచుకొని , “క్షమించండి” అన్నాడు”.

“ఎంతిస్తారేంటి” అన్నది

“రోజు కీ 200 రూపాయలు.”

అలాగే అంటూ అతడు వెళ్లిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి “మంత్ర”!! అని పిలిచాడు.

ఆమె వెనక్కి తిరిగి వచ్చి గడ్డి మోపు కింద పడేసి చిరు నవ్వుతో “అడిగే ప్రశ్నలన్నీ ఒకే సారి అడిగితే బాగుంటుంది. ఒక ప్రశ్న కి మరో ప్రశ్న కి ఎందుకంత గ్యాప్?” అని అడిగింది.

“నేనింతే నాకు త్వరగా అర్థం కాదు, అర్థం చేసుకొని మరో ప్రశ్న అడగటానికి కొంత టైమ్ కావాలి”.

ఆమె వింతగా చూసి చిన్నగా నవ్వి “ఎంత అమయాకుడివి, ఒక్కడివే ఎందుకొచ్చావ్?” అన్నది.

అది మీకు “అనవసరం” అన్నాడు కోపంగా

ఆమె పెద్దగా నవ్వింది, అతడి కోపం చూసి నవ్వి, నవ్వి గడ్డి మోపు మీద కూర్చొని “మీ వయసెంత? అని అడిగింది.

“65”

మీ ఆవిడెక్కడ?”

“నాకు పెళ్లి కాలేదు”

“వెనక్కి ఎందుకు పిలిచారు”

“అతన్ని సిగ్గు పడుతూ ఎందుకు చూపావు”?

“అబ్బాయిలు పొగిడితే అమ్మాయిలు సిగ్గు పడటం సహజo, అంత మాత్రాన ప్రేమ అనుకుంటారా?

“ఎవరు పొగిడినా సిగ్గు పడతారా”?

“కాదు, తెలిసిన వాళ్ళు పొగిడితేనే, తెలియని వాళ్ళు నన్ను పొగడలేదు ఎప్పుడు..”

“నిజంగా అంతేనా?”

“అవును, కానీ ఎందుకు ఇంత తరచి తరచి అడుగుతున్నారు”?

“ఏం లేదు, నా పేరు శాన్డల్య, గుర్తుంచుకోన్డి”

“ఎందుకు మీకు మతి మరుపు ఉందా?”

“అనుకుంటా.. నీ కేలా తెలుసు సారి మీకెలా తెలుసు?

ఆమె పెద్దగా నవ్వుకుంటూ గడ్డి మోపు తీసుకొని వెళ్లిపోయింది.

ఆమెలో ఉన్న పొగరు చూసి అతడికి చిరు కోపం బసులు కొట్టింది.

************** *******                        ***************                        **************

మరు నాడు సాయంత్రం 6 గంటలు:

మంత్ర రాలేదు. ఎదురు చూసి చూసి ఆమె ఇంటికి బయలుదేరాడు.

మేకలా అతడి భార్య అమ్మ నాన్న తో కులాసాగా కబురులు చెప్పుకుంటోంది ఆమె. శాండిని చూసిన మేకలా కోపం తెచ్చుకొని నెమ్మదిగా ఆమె చెవిలో “వాడిని దూరంగా ఉంచు” అని వారి భాషలో చెప్పాడు. అతని ముఖ కవళికలు గమనించిన శాండి వెను తిరిగాడు.

మంత్ర వెంటనే అతడి దగ్గరకు పరుగున వచ్చి  “శాండి రేపు వస్తాను, ఇవాళ కాస్త పని పడింది, అన్నది.

“మరి మేకలా?” అన్నాడు.

“అది, అతడు నా మంచి కోరి అలా హెచ్చరిస్తాడు, పట్టించుకోకండి”

***********             ****************                           ****************

తెల్లారి 8 గంటలు:

“మంచు కమ్మి మేఘాలు భూ తలానికి షికారుకు వచ్చాయా!!”? అన్నట్లుంది అక్కడి ప్రదేశం, పొగలు కక్కే కాఫీ మంచి తోడుగా ఉంది  శాండికి.

మంత్ర వచ్చి మెట్ల మీద కూలబడింది. సాయంత్రం పని ఉంది ఈ రోజు కూడా, చెప్పండి మెదలెదమా?

“ఇక్కడ వచ్చి కూర్చోండి” అంటూ కుర్చీలు చూపించాడు అతడు.

“మీ హద్దుల్లో మీరుండండి, నా లిమిట్స్ లో నన్నుండనివ్వండి”

“మీకు  అంత కోపం ఎందుకు? నా వయస్సు 65 ఏళ్ళు.”

“నాకు కోపం రాలేదు, నా పద్దతి ముందు గానే చెప్పి ఉంచాను.”

“మర్యాదిస్తే పద్దతి తప్పినట్లా?”

“చెప్పింది పాటిస్తారని, తద్వారా మన ట్యూషన్ సజావుగా సాగాలని, మిమ్మల్ని బాధించాలని కాదు.”

“ప్రతి మొదటి మాట కఠువుగా, రెండో మాట మృదువుగా మాట్లాడ్డం అలవాటా?”

“మీరు నన్ను అంతలా రీడ్ చేయటం నాకు నచ్చలేదు, నేను వెళుతున్న.”

“హేయ్ అగాగు! ఇంక ప్రశ్నలడగను, క్లాస్ మొదలు పెడదాము”

“మీ గురించి ఏదన్నా చెప్పండి,  నేను తర్జుమా చేసి మీకు, నా భాషలో నేర్పిస్తాను”

“నా పేరు శాన్డల్య. నేను సాధారణ కుటుంబంలో పుట్టి మేస్త్రి స్థాయికి చేరుకొని ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి చేశాను.”

అలా అంటున్నప్పుడు అతని కళ్లలో ఒకింత గర్వం తొణికిసలాడటం గమనించినది మంత్ర.

అతను తన ధోరణిలో చెప్పుకు పోతున్నాడు “ రెండవ చెల్లిని ఒక హోమియో వైద్యుడికి ఇచ్చి చేశాను. నా స్థాయి నచ్చని మా బావ వాళ్ళ కుటుంబం అవమానించింది పెళ్లిలో. ఆత్మ హత్య చేసుకొందామననున్నాను. “

“తర్వాత”

“తర్వాత ఏముంది ..ఈ స్థాయికి వచ్చా ..పట్టుదలతో ” అన్నాడు .

అతడికి పూర్తిగా చెప్పటం ఇష్టం లేదని ఆమెకు అర్థం అయ్యి “సరే” అంటూ , చెప్పిన దంతా సీక్వెన్షియల్ ఆర్డర్లో బెంగాలీ భాషలో నేర్పించింది.

“క్లాస్ అయిపోయాక అతడు ఎలా అంతా కరెక్టుగా ఎలా చెప్పావు?” అని అడిగాడు.

“అవునా? గుర్తుంచుకొని చెప్పానా? నాకు తెలీదు?”

“నీకు 200 చాలా తక్కువ. నీకు వేరే విద్య నేర్పిస్తాను, నీకు ఇష్టమయి తేనే”.

“ఇష్టంలేదు, 200 ఇవ్వండి”.

అతడు చురుక్కుమన్నట్లు బాధ పడి ఆమె అడిగినట్లు ఇచ్చేశాడు.

కొత్త భాష నేర్చుకున్నా, నీ కోసం వెతికే ఈ  కళ్ళల్లో తడి ఆరనీకు మిత్రమా!! అంటూ డైరీ ముగించి పడుకున్నాడు శాండి. చాలా రోజుల తరవాత హాయిగా నిదుర పోయాడు  అతడు.

***************             *****************                                       ***************

మంత్ర ఇవ్వాళ మళ్ళీ రాలేదు. నిన్నటి పాఠాలు మననం చేసుకుంటుండగా మన్త్ర గుర్తొచ్చింది అతడికి, “అవును తానెందుకు తరచి తరచి అడగదు”, అనుకోని కోపం తెచ్చుకున్నాడు.

మర్నాడు క్లాస్లో అదే అడిగాడు. నీకు నా గురించి తెలుసుకోవాలని లేదా? మధ్యలో ఆపేశాను కదా! ఎందుకు అడగలేదు?

“మీకు ఇబ్బంది కాబట్టే కదా చెప్ప లేదు.”

“నాకు చెప్పాలని ఉంది”

“నాకు వినాలని లేదు”

“ఎందుకు?”

“నిన్న నన్ను నమ్మలేదు, ఇప్పుడు మీరు చెప్పినా వినను, ఇంకేమన్నా టాపిక్ తీసుకోన్డి,” అన్నది సూటిగా.

“నీకు పొగరు, అహంకారానికి మారు పేరు నువ్వు”

ఆమె ఇదే మాటలను తమ భాషలో తర్జుమా చేసి మీరు కూడా చెప్పండి అన్నది.

అతడు షాక్ అయిపోయి మళ్లా పెద్దగా నవ్వటం మొదలెట్టాడు.

“నవ్వుకు భాష అవసరం లేదు. మా భాషలో కూడా ఇలాగే నవ్వుతాము” అన్నది

అతడు ఆమె ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు’ అచ్చేరోవోంది, ఇంకా ఇంకా నవ్వుతూనే ఉన్నాడు, “ప్లీస్ స్టాప్ ఇట్, ఇంక నా వల్ల కాదు” అన్నాడు.

ఆమె కూడా నవ్వుతూ తన భాషలో అతడి మాటలను తర్జుమా చెప్పటం మొదలెట్టింది.

నిశబ్ధంగా ఉండే ట్రీ హౌస్ నవ్వులతో ఆహ్లాదకరంగా మారిపోయింది.

************                       *************                             ************

రోజులు నిమిషాల్ల దొర్లి పోతున్నాయి. “మంత్ర రోజుకి రెండు క్లాస్లు తీసుకోవచ్చు కదా!”

“నాకు మీరు తప్ప వేరే పని ఏం లేదా”?

పని అయిపోయాక ఏం చేస్తావ్, ఆ మెకలా దంపతుల మధ్యలో దూర్తావు అంతేగా?

నాకు ఈ ఊళ్ళో ఇంకా చాలా మంది తెల్సు, అయినా మేకల అంటే ఎందుకు అంతా అసూయ?”

“ఏం లేదు. వేరే టాపిక్ దొరకలేదు అంతే”

మంత్ర పెద్దగా నవ్వింది.

“ఆ నవ్వు ఆపు రాక్షసి లాగా..”

“టీచర్ ని! కాస్త మర్యాద ఇవ్వండి, క్లాస్స్ మొదలేదదామ?”

“ఇవాళ నీ గురించి చెప్పు”

“నేను పన్నెండు చదివి తర్వాత కుదరక డబ్బు కోసం ఆ పని ఈ పని చేస్తున్న”

“అంతేనా?”

“ఇంకేముంది?”

“నీ వయసెంత?27 కదా? చదువుకుంటావా? నేను చదివిస్తాను?”

“నీకెలా తెల్సు, నాకు చదువంటే ఇష్టమని?”

“ఒక లక్ష్యం ఉన్న వాళ్ళు మాత్రమే తమ సమయాన్ని గౌరవిస్తారు. ఎంత డబ్బు కావాలో అంత డబ్బు కోసమే కష్ట పడతారు. తిరిగి తమ లక్ష్యం వైపు పయనం సాగిస్తారు. అందుకే వేరే విద్య ఆఫర్ చేసినా వద్దన్నావు.”

“ఎవరా మే? నీలో నిన్ను లేకుండా చేసి , నిన్ను నీలా ఉండనివ్వకుండా చేస్తున్న అమ్మాయి”

“చెప్పను”

“నువ్వే కదా చెప్తాను అన్నావ్”

“నువ్వు వద్దన్నావ్”

మంత్రాకి అతడిని చూసి వింతగా అనిపించి “ఈ తిక్క చూసే వెళ్ళిపోయింది” అనుకోని ముని పంటి కింద నవ్వుని తొక్కి పెట్టింది.

ఆమెను చూసిన  శాండికి ఆమె భావాలు అర్థమై “నువ్వు కోటి జన్మలెత్తినా, ఆమెతో సరి తూగలేవు” అన్నాడు.

అతడలా ఉడుక్కుంటుంటే ఆమె పిచ్చి పట్టినట్లు నవ్వటం మొదలెట్టింది.

అతడు కూడా ఆమెతో జత కలిపి నవ్వుతూ “తిక్క వాడిని అనుకున్నావు కదా?” అన్నాడు.

“ఆమె పేరేన్టీ?”

“తెలీదు”

“అదేంటి”

“ఆమె తర్వాత చెప్తాను” అన్నది.

“తర్వాత అనంటే ఎపుడు?”

“నేను గొప్పోడిని అయి కలిస్తే  చెప్తాను” అన్నది.

“మరి అయ్యావుగా , చెప్పలేదే?”

“6 ఏళ్ల తర్వాత వెళ్ళి కనబడితే, ఇది కూడా ఒక ఎదుగుదల అని అనుకుంటున్నవా?” అన్నది.

“తర్వాత?”

“లాగి పెట్టి ఒక్కటి కొట్టాను, వెళ్ళి పోయింది కోపంగా. మళ్ళీ తిరిగి రాలేదు. వెతికాను అన్నీ చోట్ల, కానీ ఫలితం లేదు.”

మంత్ర కళ్ళు పెద్దవి చేసి “కొట్టావా?” అన్నది

“అవును”

“మరి ఆమె తో తుల తూగలేవు అన్నవ్ నన్ను?”

“అవును, తను దేవత”

“మరి నేను ?”

“నువ్వు బ్రహ్మ రాఖాసి.”

“తానుగా వచ్చిందా?, నువ్వుగా వెళ్ళావా 6 ఏళ్ల తర్వాత?

“తానుగా వచ్చింది, పెళ్ళి అయిందా? అని అడిగింది, తర్వాత నీకు చెప్పాను కదా!”

మంత్ర మళ్ళీ నవ్వుతూ “రేపు కలుద్దాం” అంటూ వేగం గా బయలుదేరింది.

అతడికి అర్థం కాక “ఏదన్నా ఉంటే, మొఖం మీద చెప్పే వాళ్ళంటే నాకు గౌరవం” అన్నాడు.

“ఆమె కోసం నువ్వు ఎదురు చూడటం ఒక పిచ్చికి పరాకాష్ట! ఆమెకు నీ గుణాలు నచ్చాయి, కానీ తన సొసైటీ కి నువ్వు సరి తూగవు, ఎంత డబ్బు సంపాదించినా కూడా, అయినా తన వల్ల మారవు కాబట్టి నువ్వన్టే అభిమానం కొద్ది కలవటానికి వచ్చింది. కొట్టావ్ కదా, మళ్ళీ రాలేదు.”

“తను అలాంటిది కాదు, తను దేవత”

“నేను చెప్పేది తప్పు అయితే ఇంకెపుడు ఎవరికి సలహాలు ఇవ్వను.”

“నువ్వన్నందుకైనా ఆమెను వెతికిస్తాను, నీకు నిరూపిస్తాను, తను దేవతని, నువ్వు రాక్షసివి అని”

వాదనలతో వేడెక్కిన ట్రీ హౌస్ కాసేపటికి నెమ్మదిగా చల్లబడింది.

 

మతి భ్రమించిన శాన్డల్య తన చిన్న చెల్లెలి ఇంటి దగ్గర నించి మళ్ళీ ఆమెను గాలించటం మొదలెట్టాడు. అతడి ఆశల మీద ఆసిడ్ పోసినంతలా బాధ పడ్డాడు మంత్ర మాటలకు. తన కలల సౌధం కూలి పోయినట్లు గా కుచించుకు పోయాడు మంత్ర జడ్జిమెంట్ కి.

కూర్చొన్న కుర్చీలోంచి లేచి ఒక్క తన్ను తన్నాడు ఎదురున్న టేబుల్ ని, ఆ తర్వాత ఫోన్ తీసుకొని మంత్రకు అడ్రస్ చెప్పి తను అపాయము లో ఉన్నట్టు చెప్పి ఆమెను కంగారు పెట్టి తన ఇంటికి రప్పించుకున్నాడు.

శాన్డల్య ఇంటికి చేరుకుని అతను గూర్చి తెలుసుకోని శివంగిలా విరిచుకు పడింది, “నువ్వు మనిషివా?, మోసం చేసి రప్పిస్తావా?

“చెత్త మాటలు మాట్లాడి నా కలల సౌధాన్ని కూల్చావు”

“నేను నిజమ్ విడమరచి చెప్పాను, ఇంత ఇగో పనికి  రాదు. నువ్వన్టే  ఇష్టమున్న అమ్మాయి నీ కోసం పరిగెత్తుకు రాదా? మట్టి బుర్రా!!” అని అరిచింది.

అతడు రౌదృడై పోయాడు “మంత్ర ! నన్నేమన్నా అను, తన గురించి తప్పుగా మాటలాడావో,  చచ్చిపోతావు!”

“మరి నన్నెందుకు పిలిపించావు?”

“నీ వెధవ బుర్రతో నువ్వే వెతుకు తనని, నీ నోటి తో నువ్వే చెప్పాలి తను దేవత అని”

“నాకేంటి పని, నీ ముసలి ప్రియురాలిని వెతకటానికి?”

“నీకే ఆమె మీద అసూయ. నువ్వే ఆమె మీద అభాండాలు వేసావు . వెతకకపోతే తప్పు నీదే అని ఒప్పుకొని మీ ఊరు వెళ్లిపో.”

“నేను నా లక్ష్యం ఏమైపోవలి, నేను గ్రామ సర్పంచ్ అవ్వాలి, నీతో పెట్టుకుంటే అది అవ్వదు”

“అయితే ఒప్పుకో తను దేవత అని లేదా నీ చదువుకి సరిపడా అన్నీ సమకూరుస్తాను, ఇక్కడే ఉండి ఆమెను వెతుకు” అని వెళ్ళటానికి ఉపక్రమించాడు.

“సైకో వెధవ! ముసలి నక్క! నీ ముసలి దాన్ని నువ్వు వెతుక్కో” అని అరుస్తూనే ఉంది మంత్ర.

***********                      *****************                       ***************

అప్పట్నించీ మంత్ర చాలా రకాలైన దారుల్లో వెతికింది ఆమె కోసం.

అతన్ని కూడా పరి పరి విధాలుగా అడిగినా, పెద్దగా తనకు కావల్సిన ‘ఆమె’ గురించిన సమాచారం దొరక లేదు.

ఇంకా అతడి బంధువులను స్వయంగా కలిసి అతడి గూర్చి తెలుసుకున్న ది. వాటికి తోడూ అతడు తనతో పంచుకున్న విషయాలు జత చేసి ఒక నిర్ణయానికి వచ్చింది.

ఆ రోజూ సాయంత్రం మంత్ర గంభీరంగా కూర్చొన్నది.

ఆమెను చూసిన శాండి “ఏం మంత్ర అలా ఉన్నావ్”? అన్నాడు.

“ఈమేనా నీకు కావల్సిన అమ్మాయి”  అంటూ కొన్ని ఫొటోలను అతడి చేతిలో పెట్టింది.

ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు  అయిపోయాడు, ఆమె ఫొటోలను ఎంతో సున్నితంగా చేతలోకీ తీసుకొని, “పెద్ద ది అయిపోయింది చాలా” అంటూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ.. “నువ్వు సూపర్.. మంత్ర, చూసి రమ్మంటే కాల్చి వస్తావు. ఎక్కడ కనిపించింది? ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంది.?నువ్వు చాలా మంచి దానివి మంత్ర, కోపం తెచ్చుకోకు. ఇంతకీ అడ్రస్స్ చెప్పు” అన్నాడు.

“తనని నువ్వు మర్చిపోవాలి, మూర్ఖంగా ప్రవర్తించకు. తనకి ఒక మనవరాలు కూడా ఉంది శాండి”

“తెలుసు, నాకు 65 అంటే తనకి ఒక 60 అన్నా ఉండవా?”

“మరి ఈ పిచ్చి ఏంటి?”

“ఒక్క సారి మాట్లాడాలనీ అంతే.. ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి”

“ఆమెకు నువ్వు కలవక ముందే పెళ్లి అయిపోయింది, నీ చెల్లి పెళ్ళి లో జరిగిన అవమానం చూసి నిన్ను ఓదార్చటానికి వచ్చింది. నీ చెల్లి కి దూరపు బంధువు తను. కనకనే 6 ఏళ్ళ తర్వాత  నీ గురించి తెలుసుకుని, “పెళ్లి అయిందా”? అని అడిగి, కోపం తెప్పించి వెళ్ళిపోయింది. నీ చెల్లి కి కూడా తెలుసు ఇదంతా.

శాండికి నోట మాట రాలేదు, “చెప్పానా తను దేవతని?”

మంత్ర  అతడిని చూసి అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. “అసలు నువ్వు  చెప్పే అమ్మాయి లేదు, ఇది ఎవరి ఫోటో నో తెచ్చి నీకు ఇచ్చాను అంతే”.

శాండి మొహం జేవురించింది.

“నీకు అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. అవమానం తట్టుకోలేక బామ్మర్ది అక్క మీద కన్నేసావు. ఆమెకు పెళ్లయింది అని  తెల్సి దూరముగా ఉంటావు.  కానీ నువ్వు ఆమెకు దగ్గరై పోతున్నావ్ . ఇది తెల్సి నీ చెల్లెలు నిన్ను దూరం పెట్టింది. మర్చిపోటానికి రాత్రి పగలు పని చేస్తావు. సంస్కారానికి కుసంస్కారానికి మధ్య నలిగి పోతున్నావ్, ఒప్పుకో!!” అంటూ విజ్రభించింది అతడి మీద.

“కాదు.. కాదు.. కాదు !!! పిచ్చివాడిలా అరిచాడు శాండి.

మంత్ర అతన్నే సూటిగా చూస్తోంది.

శాండి నిరాశగా సోఫాలో కూల బడి చెబుతున్నాడు.  “ఆమె నన్ను ఓదార్చిన మాట నిజం. కానీ నా చెల్లెలు బంధువు అని తెలియదు. 6 ఏళ్ల తర్వాత కలిసి తనకు పెళ్లయింది అని  చెప్పింది. నిజం దాచినందుకు కొట్టాను, మర్చిపోలేక పోతున్నాను.”

“అయితే ఆమె స్వార్థ పరురాలు కాదా?నిన్ను మోసం చేయలేదా?నువ్వే ఒప్పుకున్నావు! నీ చేతే నిజం చెప్పించాను.. ‘గేమ్ ఓవర్ మిస్టర్!!’

“అతడు ఆమె మానసిక స్థితి కి దూరంగా ఉన్నాడు. తన లో తను ట్రాన్స్లో ఉండి మాట్లాడుతున్నాడు, ఆమె ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా, కేవలo నన్ను బతికించటానికి, నీ మట్టి బుర్రకి అర్థం అవ్వదే రాక్షసి.”

“తను తన పేరు కూడా నీ దగ్గర దాచి పెట్టింది, ఒప్పుకో తను స్వార్తి అని”

“ఓహ్ అదా నీ బాధ !! మళ్ళీ చెప్తున్నా తను దేవత. ఇంకో అవకాశం ఇస్తాను, నిరూపించు.”

“రెండు రోజులు చాలు నాకు, అని మంత్ర నిష్క్రమించింది.

**********************                                   *********************

ఆమెను ఇదివరకెన్నడూ కలువ లేదు మంత్ర, శాన్డీ తో పందెం కట్టి వచ్చిందే కానీ ఎలా నిరూపణ చేయాలో అర్థం కాలేదు.

అందుకే నేరుగా ఆమె దగ్గరకెళ్ళీ, “శాండీ పంపాడు, కోట్లు సంపాదించాడు, మిమ్మల్ని రమ్మన్నాడు, రండి” అన్నది.

వీళ్లిద్దరి కీ తెలియకుండా దూరం నించి గమనిస్తున్నాడు శాండి.

“ఆమె శాండీ ఎవరు?” అన్నది.

“అదే మీ పాత మేస్త్రీ”

ఓహ్! అతను ఇంకా బతికే ఉన్నాడా?

మంత్రకు కోపం కట్టలు తెంచు కొచ్చి, “నీ కోసం పిచ్చోడయితే ఇలా మాట్లాడతావా?”

“నేను అవమన్నాన?”

“బోలెడు డబ్బు ఉన్నది కదా! ఎందుకొద్దన్నావ్?”

“డబ్బు ఉంటే సరిపోయిందా? అమ్మాయిల వెనకాల పడే వాడిని పిచ్చోడని అంటారు”

మంత్ర తన కన్నా పెద్దదని కూడా చూడకుండా పెడేల్న చెంప పగలు కొట్టింది ఆమెను.

“నువ్వో దేవతని చెప్పాడు ఆ ముసలోడు, ఇపుడు వాడిని కొట్టాలి ఇంక”  అంటూ శాండీ ఇంటి కేసి బయలుదేరింది ఆవేశంగా..

ఆమె వెళ్ళే సరికి శాండి తన ఇంటికి చేరుకొని ఆమే రాగానే “చెప్పానా ఓడి పోతావు అని” అన్నాడు.

“ఆమె అవును శాండి నువ్వే గెలిచావు, తను దేవత, నేను రాక్షసి అన్నది”.

“పద నిన్ను ట్రైన్ ఎక్కిస్తా” అని ఆమెను ట్రైన్ ఎక్కిస్తూ డబ్బు సంచి ఇచ్చి “నా పని కోసం నిన్ను ఇబ్బంది పెట్టాను, క్షమించు” అన్నాడు.

ఆమె వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ “ఇంత అమాయకంగా ఉండకు శాండి” అన్నది.

ట్రైన్ బయలుదేరింది. మంత్ర  వాష్ రూమ్ లోకీ వెళ్ళి పెద్దగా ఏడుస్తూ “నువ్వు పొగిడిన దానిలో ఒక్క పర్సెంట్ కూడా తను అర్హురాలు కాదు, కానీ తన ఊహ నిన్ను బ్రతికిస్తోంది. ఆ భ్రమ లోనే నువ్వు బతుకు, నీ కలను కూల్చి, నిరూపణ చేసి నిన్ను చంపుకోలేను.”

***********              ***********                             **************

స్టేషన్ నించి బయట కొచ్చిన శాండీ, వాటర్ బాటిల్ లోని నీళ్ళు నెత్తి మీద కుమ్మరించుకొని, అక్కడున్న పేవ్మెంట్ మీద కూల బడి “నన్ను క్షమించు మంత్ర.. నాకు తెల్సు నువ్వే కరెక్ట్ అని, కానీ ఆ ముసల్ది అంటే నాకు పిచ్చి. నీ వంకన తన గురించి నీతో మాట్లాడొచ్చు. వేరే ఇంకోరయితే ముసలాడికీ ఇదేం పిచ్చి అంటారు. కానీ నువ్వు నన్ను ఒక ప్రేమికుడిగా చూపావు, అందుకే నిన్ను రప్పించాను, నిజం తెలిసినా కూడా!!! నువ్వు నిజమైన దేవతవి, నిజం తెల్సి నా దగ్గర దాచావు….”” అంటూ తన జ్ఞాపకాల లోకి తిరిగి జారుకున్నాడు .

****************************                           *************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

2 Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s