ఆమే, ఆమెకు సైన్యం

                        

సౌదా!!! పారిపో ఇక్కడ నించి” అని  హెచ్చరిస్తున్నాడు సౌరభ్, చర్చ్ గది లో.

ముసుగు దొంగ, సౌదా నుదుటన పాయింట్ బ్లాంక్ రేంజీ లో తుపాకీ పెట్టి  క్రూరంగా నవ్వుతున్నాడు,

ఆమె చలించలేదు సరి కదా “ కాల్చారా దమ్ముంటే” అంటోంది. ఆమె కళ్ళు పరమ శివుని త్రినేత్రం వలే అగ్ని గొళాలయి, ముసుగు దొంగ ని  తీక్షణంగా చూస్తున్నాయి.

అంతే కాదు “ఎంట్రా ఆలోచిస్తున్నావు? తొందరగా కాల్చు”  అంటూ రెచ్చ కొడుతోంది వాడిని.

దొంగ, తుపాకి ఆమె  నుదుటికి బలంగా నొక్కిపెడుతూ “ఎందుకే, నా చేతికి నెత్తురు,  అది ఆడ నెత్తురు అంటిస్తావు?” అన్నాడు.

వాడి ముఖానికి  ఉన్న ఆచ్ఛాదన వల్ల కేవలం వాడి క్రౌర్యపు కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి సౌదాకి, ఇంకా అక్కడున్న బందీలకి.

దూరంగా దేశ రాష్ట్రపతి ప్రసంగం వినబడుతోంది. చర్చి లో ఉన్న బందీలు ప్రాణాలు బిగపెట్టుకొని చూస్తున్నారు సౌదాని, దొంగ ని. సూది కింద పడితే  వినబడేంత నిశ్శబ్దం రాజ్యమేలుతోంది ఆ గదిలో.

ముసుగు దొంగ పళ్ళు నూరుతూ “ ఏందుకే అనవసరంగా చచ్చిపోతావు! ఇప్పటికయినా పర్వాలేదు, సీ.డీ. ఇచ్చి బతికిపో ” అన్నాడు.

నిశ్చలమయిన వదనంతో సౌదా “తొందరగా కాల్చారా నా  శవం సాక్షమవ్వాలి” అంటూ సమాధానం ఇచ్చింది.

రాష్ట్రపతి ప్రసంగం కొనసాగుతూనే ఉంది. ప్రజల యొక్కప్రజల చేతప్రజల కోసం నిర్మించబడినదే ప్రజా స్వామ్యం…అదే మన భారత దేశపు ఔన్నత్యం” అని ప్రసంగం ముగిసిందికరతళధ్వానాలు వినబడుతున్నాయి.

 “విన్నావా” అన్నట్టు చూసింది సౌదా, దొంగ కేసి.

దొంగ ఉగ్రంతో ఊగిపోయాడు, బలంగా ట్రిగ్గర్ నొక్కాడు. సౌదా ముఖం అంతా నెత్తురు చిమ్మింది.

 *****                                        **********                        **************      *********

గాడ్ బ్లెస్ యు మై చైల్డ్“, ఫాదర్ అందరికి మిఠాయిలు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు.

ఆదివారం కావటం తో చర్చ్ రద్దీగా ఉంది.

ఫాదర్ నా దగ్గరకు వచ్చి అమ్మా సౌదా! ఇంక వెళ్ళుమిగతా మొక్కలు రేపు నాటొచ్చు.

ఆలశ్యం అయితే మీ ఆయన దగ్గర నించి మాటవస్తుంది“.

పరువా లేదు ఫాదర్” అని చెప్పి బయలుదేరానుఎందుకంటే ఫాదర్ మాటల్లో నిజం లేకపోలేదు, నాకు తెలుసు రవి నించి ఎలాంటి స్పందన వస్తుందో

ఇంటికి చేరాను.  చిన్నది అన్నం తింటూ గౌను అంతా చేసుకుంది. నేను క్లీన్ చేస్తానన్నా రాలేదుఇహ వాడు హోం వర్క్ చేసాడో లేదో దేవుడికే ఎరుక, అయినా మనకివన్ని ఎందుకు, పొలోమంటూ ఊరిని ఉధ్ధరిధ్ధాం” అంటూ గుమ్మం లోనే మొదలెట్టాడు రవి.

చెవులకి కాసేపు కంచె కట్టుకొని మళ్ళీ ఇంటి పని లో పడ్డాను. రేపు మీనా తో ఫాదర్ దగ్గరకెళ్ళాలి. జరిగిందేంటో ఫాదర్‌కి చెప్పాను కాని, ఎలా ముందుకు తీస్కెళ్ళాలో మేము నిర్ణయించ లేదు. 

నా మొహాన ఇంత కాఫీ పోస్తావా” అని హాల్లో నుంచే అరుస్తున్నాడు, రవి.

 *****                                     ***************                        *******

నా కంటూ కాస్త ప్రశాంతత దొరికేది వేరే వారికి సహాయ పడ్డంలోనే. నా సొంత పనులు నాకు అంత ఉత్సాహాన్ని ఇవ్వవు. అలాగని నా ధర్మం మరువను. ఫాదర్ నాకు మూడేళ్లకు పైగా తెల్సు. మీనా బస్సు లో పరిచయం. వీరిద్దరే నాకు తెలిసిన నా బాహ్య ప్రపంచం. నాకు పరిచయం కాక ముందే మీనా ఒక కొత్త సంవత్సరపు వేడుక లో ధనికుడి చేతిలో చిక్కుకుంది. వాడు ఆమెకు శీతల పానీయము లో మత్తు మందు కలిపి ఆమెని అసభ్యకరంగా వీడియోల్లో చిత్రీకరించాడు. అక్కడితో వాడి విక్రుత చర్యలు ఆగలేదు. ఆమెకే ఆ వీడియోలు చూపించి పైశాచికానందం పొందాడు. తను ఎక్కడి కన్నా వెళ్ళినా వాడి మనుషులు వెంబడించి మరీ వేధించేవారు, ఆమె మత్తులో ఉండటం వల్ల తనని అసభ్యంగా చిత్రీకరించింది ఎవరో తెలుసుకోలేకపోయింది మీనా. వాడు నేరుగా ఎప్పుడూ మీనాకి ఎదురు పడకుండా జాగ్రత్త పడ్డాడు.

 మాకు పెద్ద దిక్కు ఫాదర్ ఒక్కరే.   ఆయనమీనా తండ్రి కలిసి పోలీసు కంప్లైంట్ ఇవ్వబోతే “ధనిక కుటుంబంజాగ్రత్త” అని వీళ్ళ నోరే నొక్కారు. నాకు పోలీసులను నమ్ముకుంటే న్యాయం జరగదని ధ్రుఢ నమ్మకం, దాన్ని వారు నిజం చేసారు.

నేనొక సోషల్ వెబ్ సైట్లో జనాన్ని కూడగట్టుకొని వాడి అకృత్యాలకి అడ్డుకట్ట వేద్దాం అనుకుని విఫలమయ్యాను.

పైగా ఈసారి వాడు నన్నే లక్ష్యంగా చేసాడుబహుశా వాడనుకోలేదు   ఒక ‘పాముల బుట్టలో చేయి పెడుతున్నానని . నన్ను అప్రతిష్ఠ పాలు 

చేసేవాడు, నా ఇంటి చుట్టుపక్కల వారి దగ్గర.  నా భర్త ఒక అవకాశావాదిచివరికి నిస్సహాయంగా నిలిచాను, ఇంత మంది మనుషులున్న అరణ్యంలో.

*****                    *****                        *****                           ******     

    

గెలిచానని విర్రవీగిన ప్రతి వారు నేలకి ఒరగక తప్పదు, ఓడాననుకొని కుంగిపోయినవారు తిరిగి విఝ్రభించకపోరు.

నా జీవితంలోకి నా అనుమతి లేకుండా ప్రవేశించినాకునా పరువుకి భంగం కలిగించిన అ కలియుగ కీచకుడిని వదిలి పెట్టదలుచుకోలేదు.

నాన్న కష్టంలో నాకు తోడు నా పిల్లలయితేనీడగా నిలిచింది నా చిన్న నాటి  స్నేహితుని సౌరభ్ ఆలోచనలే.

వాడి పూర్వపు మాటల  ప్రేరణ వల్ల వాడు నాతో ఇప్పుడు లేకపోయినా, నన్ను ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంటాయిసౌరభ్ వ్యక్తిత్వం నాకు ఒక ఆదర్శంవాడు పంచిన ప్రేమ, వేసవి కాలం వీచే చల్లని పిల్ల తెమ్మెర.  అపుడప్పుడు నా అభిమాన గాయకుడు గుణ శేఖర్ సంగీత సభలకి వెళ్ళటంఇదే నా జీవితం. ఒకో సారి ఆయన సంగీత సభల కి వెళ్ళకపోతే  అన్నం సహించదు అంటే  నమ్మి తీరాలి.

  రోజే కొరియర్ లో ఒక  సీ.డీ. నాకు వచ్చింది చీటి తో పాటు. సౌదాసాక్ష్యం లేదని బాధ పడకండి- సీ.డీ. మీ కోసం” అని క్లుప్తంగా వ్రాసి ఉంది. సీ.డీ. కవరు తెరిచి చేసి చూసే లోపే పోలీసులు నన్ను అరెస్ట్ చేయటానికి వచ్చారు. ఎలాగో తప్పించుకొని చర్చి దారిలోకి వచ్చాను. వెనుకనుంచి వాళ్ళ హెచ్చరింపులు వినబడుతున్నాయి. “సౌదా!! మర్యాదగా లొంగిపోలేదంటే కాల్చేస్తాం అని.

వాళ్ళ మాటలు బేఖాతరు చేసి నేను పరుగెడుతూనే ఉన్నాను, కాళ్ళు గుచ్చుకు పోతున్నాయి. ఊపిరి అందటం లేదు.

చర్చి చేరగానే ఒక్క ఉదుటున మైదానంలోకి లోకి దూకి ఫాదర్ గాడి వైపు వెళ్ళిసీ.డీ.  ఫాదర్ చేతిలో పెట్టాను, వాళ్ళ కంట పడకుండా. వాళ్ళు నన్ను చేరుకోగానే, నేను లొంగి పోయాను, పోలీసులు కాని.. నకిలీ పోలీసులకి….

 ******                    ******************                        *********

 చీకటి గదిలో ఒక మూలగా కూర్చోని ఉన్నాను. కిటికీ లోంచి అపుడే చిగురిస్తున్న ఆశలా, సూర్య కిరణాలు పడుతున్నాయి. నా మనస్సుకి నిశ్చింతగా ఉంది.  నేసుకున్న పని జరిగింది. నన్ను కిడ్నాప్ చేసింది ధనిక కీచకుడు అని తెలుసు. ఒక కీచకుడికి బుద్ధి చెప్ప కలిగాను. వీడు నన్ను చంపి పారేసినా నాకు నష్టం లేదు. మాట్లాడటానికి వస్తాడని తెలుసు, అలాగే వచ్చాడు.  ఆరడుగులుంటాడు. ముఖానికి గుర్తుపట్టకుండా ఆచ్ఛాదనంతో ఉన్నాడు. వాడి కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి చింత నిప్పుల్లా.

సౌదా!! , ఇప్పటికైనా నా శక్తి అర్థమయి ఉంటుంది. కాబట్టి సీ.డీ. ఇచ్చి బ్రతికి పో”, అన్నాడు.

  నాకు అర్థమయింది వీడికి కావల్సింది ఏంటో, అందుకే ఏమీ తెలీనట్టు “ఏ సీ.డీ”? అని అడిగాను. 

హూంం…నాకు తెలుసు నువ్వు వెంటనే ఇవ్వవు అని. నాలుగు రోజులు పిల్లలకి అడవిలో దూరంగా ఉంటే నువ్వే ఇస్తావు”, అని వెళ్ళిపోయాడు.

 ********                            ****************                    ****************

నాలుగు రోజుల తరువాత:

పిల్లలు దూరంగా ఉన్నారని బాధగా ఉన్నా సౌరభ్ నా పక్కనే ఉండి బుజ్జగిస్తున్నాడు.

ఇలాంటి కష్టమొస్తే మనుషులయితే తోడుండరు. కాని వాడు దేవుడు, అందుకే నాకు ఆత్మ స్థైర్యం నూరిపోస్తూ నా పక్కనే ఉన్నాడు—ఆత్మ రూపంలో.

అవును, నన్ను విపరీతంగా అభిమానించి, చివరికి నేను దక్కలేదు అన్న భావనతో తనువు చాలించాడు- నా మనసులో శిల వేసుకోని కూర్చొన్నాడు శాశ్వతంగా. ..

 నా అలోచనలు దూరం చేస్తూ కీచకుడి మనిషి వచ్చాడు. విసురుగా నా కాళ్లకి, చేతులకి తాళ్లు కట్టేసాడుఒక జంతువుని ఈడ్చికెళ్ళినట్టు, ఈడ్చుకెళ్ళి కొంత దూరంలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎలాగో జాతీయ రహా దారికి చేరుకున్నా నేను.

*****                    *****************          ***********                     ***

సికింద్రాబాద్:  రాత్రి 7.10 నిమిషాలు.

నాకు అర్థం అయింది,  నాతో పని కాదను కొని నన్ను వదిలేసాడు ఆ కీచకుడు. మళ్ళీ పరుగు లంకించుకున్నాను. ముందు మీనాకి ఏమన్నా వాడు హాని తలపెడతాడనుకొని వాళ్లింటికి వెళ్ళాను, ఇంటికి తాళం వేసుంది. నా మనసు కీడు శంకించింది. చర్చి వైపు పరుగు తీసాను.

చర్చి ప్రాంగణం :  రాత్రి: 7.45 నిమిషాలు

చర్చి గది మధ్యలో నిలబడ్డాను, ఫ.. ఫాదర్!!! ఆయాసంతోనే గట్టిగా అరిచాను.

ఎవరూ??” అంటూ సిస్టర్ బయటకి వచ్చారు. పరుగున ఆవిడని చేరుకున్నాను.

సిస్టర్, ఫాదర్ ఎక్కడ?? అత్యవసరముగా  కలవాలి” అని అడిగాను.

ఆవిడ సందేహంగా “మీరు..?” అంటూ నా వైపు చూసింది.

సిస్టర్ నా పేరు సౌదా” 

ఆవిడ కొత్తగా వచ్చినట్లుంది “ఓహ్! మీరేనా సౌదా అంటే? ఫాదర్‌కి గుండె పోటు రావటం తో ఆసుపత్రి లో చేర్చాము, 10 రోజులు అక్కడే ఉంచాలని అన్నారు డాక్టర్లు. కలవాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి”  అంది ఆవిడ.

నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, ఆవిడ మాటలకి. సీ.డీ ఫాదర్‌కి ఇచ్చి పని అయిపోయిందనుకున్నాను.

సిస్టర్! నేను ఫాదర్ ని కలవాలి”.

 *****                                 *****************                    **************

తెల్లని గోడలు, పూర్తిగా ఏ. సి., బెడ్ మీద ఫాదర్ పడుకొని ఉన్నారు. నా కోసం ఎంత టెన్షన్ తీసుకున్నారు ఈయన. నా అడుగుల చప్పుడుకి నెమ్మదిగా కళ్ళు తెరిచారు ఫాదర్. “అమ్మ !! సౌదా!! నువ్విక్కడ, అదీ ఈ సిస్టర్ వేషంలో?? నమ్మ లేనట్టు గా చూస్తున్నారు ఆయన.

నేను ఆయనకి క్లుప్తంగా “ఎ.సి.పి. గారి అనుమతి కొసం తప్ప లేదు” అని చెప్పాను.

ఆయన “క్షమించమ్మా సీ.డీ నా  దగ్గర నే ఉంచుకున్నాను, ఏవరికిస్తే ఏం జరుగుతుందో అనే మీమాంస తో ఇలా గుండె పోటు నాటకం ఆడుతున్నాను” అన్నారు.

నేను విస్తు పోతూ “మరి డాక్టర్స్..??” అని అడిగాను.

ఆయన ‘లో గొంతుకతో’ “వాళ్ళు నా ఆశ్రమం పిల్లలేగా…అన్నారు”

మా కర్తవ్యం గుర్తు చేస్తూ గడియారం 12 గంటలు కొట్టింది.

నేను సంసిద్ధమవుతూ “ఫాదర్! రేపు క్రిస్టమస్ వేడుకలకి మన దేశ రాష్ట్రపతి హైదరాబాద్ వస్తున్నారు. మీరు ఆయన చేతిలో ఈ

సీ. డీ.  పెట్టి, న్యాయం కోరండి”, అని చెప్పి అక్కడ నించి బయలుదేరాను.

************                      *********           **********

 సౌదా కుక్క తెలివితేటలు చూబిస్తావా? మర్యాదగా సీ. డీ. ఎక్కడుందో చెప్పు” అని గద్దిస్తున్నాడు ముసుగు దొంగ నన్ను.

 చర్చి లో నన్నూ, మీనాని, సిస్టర్స్ అందరిని బంధించేసి, తప్పించుకునే వీలు లేకుండా నాలుగు వైపులా దిగ్భంధించేసారు, కీచకుడి మనుషులు. సౌరభ్ “తప్పించుకో సౌదా” అని చెప్తూనే ఉన్నాడు.

 నేను కసిగా “ఎదురు చూసిన సమయం వచ్చింది, ఇప్పుడు తప్పించుకుంటే ఎలా సౌరభ్” అన్నాను.

ముసుగు దొంగ నా నుదుటన తుపాకీ పెట్టి  ” ఏంటే ఒక్క సారి,  ఏదో తప్పు చేసానని, జీవితాంతం శిక్ష అనుభవించటానికి మూర్ఖుడిని అనుకున్నావా? ” అని నన్ను ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక రకంగా సమర్ధించుకొన్నాడు. అంటే వీడే ఆ కీచకుడు. 

నేను కారం రాసుకున్నంత కోపంతో “మరి ఏ తప్పు చేసింది అని, మీనా నీ ధన మదానికి శిక్ష అనుభవించాలి” అని అన్నాను.

వాడు అంత కన్నా నిర్లక్షంతో “హహ !! ఏంటే? ఏదో ప్రాణాలు పోయినట్లు, తింటోంది, తిరుగుతోంది కదా? కావాలంటే డబ్బు పడేస్తాను మొహాన”అన్నాడు.

 వాడి అహంకారానికి అమ్మవారినయితే శూలం పెట్టి పొడిచేసేదాన్ని.

నేను కఠువుగా ” అవునా! సరే రేపు నీ ఘాతుకపు వీడియో, టీ.వీ. లో వస్తుంది, ఆ తర్వాత అందరు నీ ముఖాన ఉమ్మేస్తారు.. తుడుచుకొని తిరుగు.” అన్నాను.

 వాడు గర్జిస్తున్నాడు ” ఏంటే మధ్య తరగతి పెళ్ళాం మొగుడితో పోట్లాడినట్లు కాదు, ఎవరితో మాట్లడుతున్నావో తెల్సుకో…”

, అవును, ఆ ముసుగు తీసి, నీ అసలు రంగు ఈ సమాజానికి చూపించు” ఒక రకంగా అరుస్తున్నాను నేను కూడా.

వాడు అసహనంగా “సీ.డీ.  ఎక్కడుందో చెప్పు” అన్నాడు.

దూరంగా రాష్ట్రపతి ప్రసంగం వినబడుతోంది. ఇంకొద్ది నిమిషాల్లో ఫాదర్  సీ.డీ. అంద చేస్తారు రాష్ట్రపతికి, అని నిమిషాలు లెక్క పెట్టుకున్నాను నేను మనసులోనే.

ఆ ధైర్యము తోనే నేను “కాల్చారా దమ్ముంటే అన్నాను”.

గదిలో సూదిబడితే వినబడేంత నిశ్శబ్దం.

ప్రసంగం కొనసాగుతోంది. ” ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కొసం నిర్మింపబడిందే ప్రజాస్వామ్యంఅదే భారత దేశపు ఔన్నత్యము.”

నేను “విన్నావా?” అన్నట్టు ఒక్క చిరునవ్వు నవ్వాను, వాడి కళ్ళలోకి సూటిగా చూస్తూ.

ముసుగు దొంగ ఉగ్రంతో ఊగిపోయాడు. ట్రిగ్గర్ బలంగా నొక్కాడు. నా ముఖం అంతా నెత్తురు చిమ్మింది.

నెత్తుటి మడుగులో వాడు కుప్ప కూలిపోయాడు, తనని…  తాను…  కాల్చుకొని.

వాడు కింద కుప్ప కూలటం తో వాడి ముఖానికున్న ఆచ్ఛాదన తొలగి పోయింది పూర్తిగా.  అక్కడి వారంతా హథాసులయ్యారు ఊహించని ఘటనకి. ముఖ్యంగా నేను, అసలు మానవత్వానికి అర్థం ఉందా అన్నట్టు స్థాణువై నించున్నాను.

ఈ…త.. డా … ఓ నాతిని చెరబట్టింది….?

ఇ. త. .డా.. ఇంత ఘాతుకానికి ఒడికట్టింది?

 **************                      ***************                ****************

 టీ.వీ. లోకల్ ఛానెల్: సాయంకాలం సంచలనాలు

తాజా వార్తలు:

ప్రఖ్యాత సినీ గాయకుడు, పారిశ్రామిక వేత్త అయిన గుణసేఖర్, సికింద్రాబాద్ చర్చిలో, తుపాకి తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది కాలంగా ఆయన పాడిన పాటలు అంతగా జనాదరణకు నోచుకోని కారణంగా, మనో వ్యధకు గురి అయినట్లు గా విశ్వసనీయ వర్గాల భోగట్టా.”

కీచకుడి అదే సినీ గాయకుడు గుణ శేఖర్  పార్దీవ శరీరపు తాలూకు ద్రుశ్యాలు ఏవో చూపిస్తున్నారు.

తెలివి గల వాడు ఉచ్చు బిగుసుకుందని తెలుసుకొని పరువు కాపాడుకున్నాడు, అని నిట్టూర్చాను.  

టి.వి. కట్టేసి సౌరభ్ సమేతంగా పిల్లలని బడి నించి తీసుకురావటానికి బయలుదేరాను.

 

*************                         స్వస్తి                          ******************

  

 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s